అవకాశాలులేనంత మాత్రాన... అలా చేయడమేనా? - కుష్బూ
ఆర్థిక ఇబ్బందులు, సినిమాల్లో అవకాశాలు లేనంతమాత్రాన వ్యభిచార కూపంలోకి దిగడమేనా అంటూ ఇటీవల అరెస్టయిన నటి శ్వేతాబసుకు సీనియర్ నటి కుష్బూ క్లాస్ పీకింది. ‘సినిమా అవకాశాలు లేకుంటే టీవీ రంగంలోకి వెళ్లవచ్చు, క్యారెక్టర్ నటిగా మారవచ్చు - ఇలా అనేక అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు లేని నటీనటులు ఎందరో ఉన్నారు. అంతమాత్రాన శ్వేతాబసు ఇలాంటి పనిచేయడం సమర్థనీయం కాదు. ఇటువంటి చర్యలను తల్లిదండ్రులు ఎలా అంగీకరిస్తున్నారు, శ్వేత విషయంలో ఆమెను కన్నవారినే ప్రధానంగా తప్పుపడుతున్నాను’ అని కుష్బూ అన్నారు.