breaking news
extradite
-
పారిపోయిన వాళ్లను పట్టుకొచ్చే హక్కు ప్రభుత్వానికి ఉంది
న్యూఢిల్లీ: డజన్లకొద్దీ నేరాలను దర్జాచేసి విదేశాలకు పారిపోయిన వ్యక్తులను పట్టుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి సర్వాధికారం ఉందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. గుజరాత్‌కు చెందిన విజయ్ మురళీధర్ ఉద్వానీ తనపై నమోదైన 153 కేసులకు సంబంధించి జారీ అయిన రెడ్‌కార్నర్ నోటీస్ సంబంధ హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ దాఖలుచేసిన పిటిషన్‌ను విచారణకు తిరస్కరిస్తున్న ట్లు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం ప్రకటించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలుచేసింది. 2022 జులైలోనే దుబాయ్‌కు పారిపోయిన మీపై రెడ్‌కార్నర్ నోటీసు జారీ సరైందేనంటూ గతంలో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాల్‌చేస్తూ ఉద్వానీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌నుద్దేశిస్తూ సుప్రీంకోర్టు.. ‘‘మీపై ఎన్నో ఆరోపణలు, 153 కేసు లు ఉన్నాయి. ముందు భారత్ రావాల్సిందే. వస్తే ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలుకుతారని అనుకో వద్దు’’ అని వ్యాఖ్యానించింది. తన పిటిషన్‌దారుకు తనపై 38 కేసుల వివరాలు కూడా తెలీదని అతని న్యాయవాది చెప్పారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘వివరాలు తెలీదంటే ఎలా? ట్ర యల్ కోర్టుకువెళ్లి సర్టిఫైడ్ కాపీల కోసం దరఖా స్తుచేస్తే వాళ్లే ఇస్తారు. ఇదేం రాకెట్ తయారీ శాస్త్రం కాదు. అతడిపై అరెస్ట్వారెంట్ జారీ అయింది’’ అని అన్నారు. ఎఫ్ఐఆర్లలోని వివరాలను అధికా రులు చెప్పడంలేదని లాయర్ వాదించగా ధర్మా సనం మళ్లీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ ఎఫ్ఐఆర్ వివరాలు మీకు దుబాయ్‌లో పళ్లెంలో పెట్టి అందించాలా? ముందు భారత్‌కు రండి. వచ్చాక అధికారులు అన్ని వివరాలు అందిస్తారు’’ అని అన్నారు. ‘‘ అతని వద్ద ప్రస్తుతం పాస్‌పోర్ట్ లేదు. ఎలామరి?’’ అని ప్రశ్నించగా.. ‘‘ అంత కష్టపడకండి. అధికారులు అక్కడ అరెస్ట్‌చేసి తీసుకొస్తారులే’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ అతని తోటి నిందితుడు భారత్‌లో పోలీస్‌కస్టడీలో చనిపో యాడు. అందుకే నా పిటిషనర్ భారత్‌కు వచ్చాక సీసీటీవీ నిఘా ఉన్న గదిలోనే ఉంచాలి’’ అని లాయర్ కోరగా.. ‘‘ఇంక ఈ పిటిషన్‌ను విచారించలేం’’ అని ధర్మాసనం కోప్పడటంతో లాయర్ ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. -
మాల్యాపై ఉచ్చు బిగిస్తున్న సీబీఐ
ముంబై: కష్టకాలంలో విదేశాల్లో కింగ్ లా ఎంజాయ్ చేస్తున్న రుణ ఎగవేతదారుడు విజయ్ మాల్యాకు మరిన్ని కష్టాలు తప్పేట్టు లేవు. ఆయన్ని స్వదేశానికి రప్పించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరో కీలక అడుగు ముందుకు వేయనుంది. ముఖ్యంగా ఆయనకు సాయం చేసారన్న ఆరోపణలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ప్రశ్నించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పెద్దమొత్తంలో రుణాలను ఎ గ్గొట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాకు దేశానికి రప్పించే విషయంలో సీబీఐ మరింత పట్టు బిగిస్తోంది. ఐడీబీఐ బ్యాంక్ లోన్ డీఫాల్ట్ కేసులో మాల్యాపై సీబీఐ ప్రత్యేక కోర్టులో మంగళవారం అఫిడవిట్ ను దాఖలు చేసింది. దీంతో సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రత్యేక న్యాయవాది హెచ్ ఎస్ మహాజన్ మాల్యాపై నాన్ బెయలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అతను వాంటెడ్ క్రిమినల్ అని పేర్కొంది. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది. ఐడిబిఐ బ్యాంకు లోన్ డిఫాల్ట్ సందర్భంలో ఇబ్బందులతో పడ్డ వ్యాపారవేత్త విజయ్ మాల్యా పై అఫిడవిట్ దాఖలు చేశామని సిబీఐ అధికారి తెలిపారు. లండన్ నుంచి వెనక్కి రప్పించాలని కోరినట్టు తెలిపారు. ఈ వారెంట్ ను దౌత్య మార్గాల ద్వారా ఆ దేశానికి పంపిస్తామన్నారు. ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసిన ఐడీబీఐ అధికారులు, కింగిఫిషర్ ఉద్యోగుల తదితర నిందితుల బెయిల్ దరఖాస్తులను బెయిల్ దరఖాస్తులను కూడా కోర్టు పరిశీలించింది. గతంలో కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినప్పటికీ అతని ఎడ్రస్ తెలియలేదని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం విజయ్ మాల్యాకు సహకరించారన్న బీజేపీ ఆరోపణల నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సీబీఐ ప్రశ్నించనున్నట్టు సమాచారం. కాగా జనవరి 24న ముంబై కోర్టులో 1000 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ. "వ్యక్తిగత ఖర్చులు" కోసం ఈ నిధులను మళ్లించినట్టు సిబిఐ చార్జిషీట్లో ఆరోపించింది. మోసం, కుట్ర అభియోగాలను కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పటికే పలుసార్లు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ, తనపై అక్రమ ఆరోపణలు చేస్తున్నారని ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసిన బిజినెస్ టైకూన్ మాల్యాను వెనక్కి రప్పిస్తారా? వేచి చూడాల్సిందే.


