breaking news
execution video
-
ఈసారి బ్రిటన్‌పై దాడిచేస్తాం: ఐఎస్
-
ఈసారి బ్రిటన్‌పై దాడిచేస్తాం: ఐఎస్
ఈసారి తాము బ్రిటన్ మీద దాడిచేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ తాజా వీడియోలో ప్రకటించింది. ఈ విషయాన్ని సిరియా మానవహక్కుల సంస్థ తెలిపింది. బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌ను ఐఎస్ ఉగ్రవాది ఒకరు 'ఫూల్' అని తిట్టారు. ఆ తర్వాత ఐదుగురి తలలు నరికేశాడు. ఈ ఐదుగురూ బ్రిటన్ తరఫున పనిచేస్తూ ఐఎస్ఐఎస్ మీద గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపించాడు. ఉత్తర సిరియాలో ఉగ్రవాద రాజధానిగా ఉన్న రక్కా ప్రాంతంలో ఈ వీడియోను తీసినట్లు తెలుస్తోంది. సిరియాలో ఐఎస్ఐఎస్ మీద దాడి చేయాల్సిన నైతిక, సైనిక బాధ్యత బ్రిటన్ మీద ఉందని ప్రధాని కామెరాన్ గత నెలలో అన్నారు. ఇప్పటికే ఇరాక్‌లో వైమానిక మార్గంలో ఐఎస్ఐఎస్ మీద దాడులు చేస్తున్న బ్రిటన్.. ఇటీవలే సిరియాకు కూడా ఆ దాడులను విస్తరించింది.