breaking news
epsom salt
-
మొక్కలకు ఎప్సమ్ సాల్ట్.. ఇలా వాడితే అదిరిపోయే ఫలితాలు!
మిద్దెతోట/ పెరటి తోటల్లో పెరిగే మొక్కలకు ఎప్సమ్ సాల్ట్ (మెగ్నీషియం సల్ఫేట్) వాడటం వల్ల మొక్కలు పచ్చగా మారటం, పూలు–పండ్లు ఎక్కువగా పూయటం, వేర్ల ద్వారా పోషకాలు బాగా అందటం వంటి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.1. ఇందులో ఉండే మెగ్నీషియం మొక్కల్లో క్లోరోఫిల్ (పత్రహరితం) ఉత్పత్తిని పెంచుతుంది. ఆకులు పసుపు రంగులోకి మారకుండా, ముదురు పచ్చ రంగులో నిగనిగలాడేలా చేస్తుంది.2. గులాబీలు, మల్లెలు, మందార వంటి పూల మొక్కలకు పువ్వుల సైజు పెరుగుతుంది, రంగు ప్రకాశవంతంగా ఉంటుంది. ఎక్కువ మొగ్గలు వస్తాయి. కొత్త చిగుళ్లు వచ్చేటప్పుడు. మొగ్గ దశలో ఉన్నప్పుడు నెలకు ఒకసారి మొక్క మొదట్లో 1 టేబుల్ స్పూన్ చొప్పున చల్లి నీరు పోయాలి లేదా 1 లీటరు నీటిలో 1 టీస్పూన్ కలిపి ఆకులపై స్ప్రే చేయాలి.3. టమోటా, మిరప, బెండ, వంగ లాంటి కూరగాయల మొక్కలకు మెగ్నీషియం చాలా అవసరం. ఇది పూత రాలుడును తగ్గిస్తుంది. టమోటాలకు వచ్చే ‘బ్లాసమ్ ఎండ్ రాట్’ (కాయ కింద నల్లగా కావటం) సమస్యను నివారిస్తుంది. మొక్క నాటేటప్పుడు గుంతలో 1 టేబుల్ స్పూన్ వేయాలి. పూత దశలో 1 లీటరు నీటికి 1 టీస్పూన్ కలిపి ప్రతి 15 రోజులకు ఒకసారి ఆకులపై స్ప్రే చేయాలి.4. నిమ్మ, జామ, దానిమ్మ, మామిడి లాంటి పండ్ల చెట్లకు ఆకులు పసుపు రంగులోకి మారకుండా చూస్తుంది. పండ్లు తీపిగా మారడానికి, రసం బాగా ఊరడానికి సహాయపడుతుంది. 5. నేలలో ఉండే నైట్రోజన్, ఫాస్పరస్ వంటి ఇతర ముఖ్య పోషకాలను మొక్కల వేర్లు సులభంగా పీల్చుకోవటానికి మెగ్నీషియం సహాయపడుతుంది.6. నారును ఒక కుండీ నుంచి మరో కుండీలోకి మార్చినప్పుడు మొక్కలు వాడిపోకుండా, త్వరగా కొత్త మట్టిలో కుదురుకోవటానికి ఇది దోహదపడుతుంది.7. విత్తనాలు నాటేటప్పుడు కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వాడటం వల్ల అవి వేగంగా, బలంగా మొలకెత్తుతాయి.8. ఒక లీటరు నీటిలో 1 టీస్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేసి బాగా కలపాలి. ఈ నీటిని నెలకి ఒకసారి మొక్కల ఆకులపై స్ప్రే చేయాలి. ఆకులు నేరుగా మెగ్నీషియంను గ్రహించడం వల్ల త్వరగా ఫలితం కనిపిస్తుంది.9. కుండీ చుట్టూ ఉన్న మట్టిని కొద్దిగా తవ్వి, మొక్క మొదట్లో కాకుండా కొంచెం దూరంగా ఒక టీస్పూన్ ΄ûడర్‌ను చల్లి, వెంటనే నీరు పోయాలి. ఎప్సమ్ సాల్ట్ త్వరగా కరగకపోతే వేర్లు దెబ్బతినే ప్రమాదం ఉంది.10. ఎక్కువ మొత్తంలో వాడితే మట్టిలో కాల్షియం లోపం ఏర్పడే ప్రమాదం ఉంది. నెలకొక్కసారి మాత్రమే వాడటం మంచిది.11. ఎప్సమ్ సాల్ట్ కలిపిన నీటిని ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు స్ప్రే చేస్తే ఆకులు మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఉదయం పూట లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే స్ప్రే చేయాలి.12. పెద్ద కుండీలు లేదా నేలపై ఉన్న చెట్లకు 2 టేబుల్ స్పూన్ల ఎప్సమ్ సాల్ట్‌ను సుమారు 4 లీటర్లు నీటిలో కలిపి సంవత్సరానికి 3–4 సార్లు ముఖ్యంగా పూతకు ముందు, కాయ పిందె దశలో వేర్ల దగ్గర పోయాలి. 13. కూరగాయలు, పూల మొక్కలకు కేవలం మట్టిలో వేయటం కంటే, నీటిలో కలిపి ఆకులపై స్ప్రే చేయడం వల్ల మొక్కలు 20% వేగంగా పోషకాలను గ్రహిస్తాయి.14. కుండీకి కింద నీరు పోయే రంధ్రం సరిగ్గా ఉండాలి. లేకపోతే ఉప్పు మట్టిలోనే పేరుకుపోయి మొక్క చనిపోతుంది. కుండీలోని మట్టి పూర్తిగా ఎండిపోయి ఉన్నప్పుడు ఎప్సమ్ సాల్ట్ వేయకూడదు. మట్టిలో కొద్దిగా తేమ ఉన్నప్పుడు మాత్రమే దీన్ని వాడాలి.15. ఇప్పుడే మొలిచిన చిన్న నారు లేదా చిన్న కుండీల్లోని మొక్కలకు ఎప్సమ్ సాల్ట్ వాడకూడదు. మొక్క కనీసం 5–6 ఆకులతో నిలదొక్కుకున్నాకే వాడాలి.- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం. మొబైల్: 94906 02366నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ఇదీ చదవండి: రైతులకు గుడ్‌న్యూస్.. పొలాల్లో కార్బన్ పెంచితే ఇక నగదు ప్రోత్సాహకం! -
మోళ్ల తొలగింపు ఇలా..!
చెట్ల మోళ్లను ఖర్చు, శ్రమ లేకుండా తొలగించుకోవచ్చు మానులపై చేసిన రంధ్రాల్లో ఎప్సమ్‌సాల్ట్ నింపాలి ఆ రంధ్రాల్లో ఈఎంఓలు లేదా లాక్టోబ్యారియా కలిపిన నీటిని పోస్తే మానులు కుళ్లిపోతాయి బంజరు నేలను సాగుకు అనుకూలంగా మార్చుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. నేలను చదును చేయడం ఒకెత్తయితే అంతకు ముందే పెరిగిన మాన్లు మాకులు నరికి వేసినప్పుడు వాటి మొట్లు, మొదళ్లు తీయడం చాలా పెద్ద పనవుతుంది. కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల తరాల నాటి కొబ్బరి తోటలు దిగుబడులు ఇవ్వని పరిస్థితిలో చెట్లను నరికివేస్తున్నారు. కోసిన మాన్లను కొంతమంది వ్యాపారులు తృణమో ఫణమో ఇచ్చి తీసుకుపోతున్నా మిగిలిన మొదళ్లు తొలగించాలంటే యంత్రాలను ఉపయోగించాల్సిందే. ఇందుకు భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. సాధారణ రైతుకు ఇది వ్యయభారం. స్వయంగా ఈ పని చేసుకుందామనుకుంటే గొడ్డళ్లు, గడ్డపారల (గునపాల)తో రోజుల తరబడి శ్రమించాల్సి వస్తుంది. అదే సహజ విధానంలో మొదళ్లు తొలిగించే పద్ధతి అందుబాటులో ఉంటే? అంతకంటే అదృష్టమా? అనే మాట ప్రతి రైతు నోటి నుంచి వస్తుంది. నిజమే.. కొద్దిపాటి ప్రయత్నంతో మొట్లు తొలిగించుకోగలిగితే రైతుకు ఎంతో ఊరటగా ఉంటుంది. ఇందుకు రెండు పద్ధతులున్నాయి. మొదటిది మొట్లు బాగా ఎండిన తరువాత చెత్తా చెదారం వేసి అగ్గిపెట్టడం. నిప్పు అడుగుకంటా కాలిపోతుంది. దీని వలన మొదలు కాలిపోవడంతోపాటు నేల గుల్ల బారుతుంది. బూడిద నేలలో కలిసిపోతుంది. దీని వలన నేల సారవంతమౌతుంది. జేసీబీ యంత్రాలకు చెల్లించాల్సిన వేలాది రూపా యలకు బదులు కేవలం స్వల్ప ఖర్చుతోనే పని పూర్తవుతుంది. ఇక రెండో పద్ధతికి వస్తే.. నేలకు హాని కలిగించని రసాయనాలను ఉపయోగించి మొదళ్లను తీసివేయడం. ‘ఎప్సం సాల్ట్’ బాగా ఉపయోగపడుతుంది. దీని వలన నేలకు ఎలాంటి హానీ జరగగకపోగా మరింత సారవంతమౌతుంది. ఎప్సమ్ సాల్ట్ ఎందుకు? మెగ్నీషియం సల్ఫేట్నే ఎప్సమ్ సాల్ట్ అని పిలుస్తారు. దీనికి నీటిని గ్రహించే గుణం ఉంది. చెట్లు నరికినా.. కొన్ని రకాల చెట్ల వేరు వ్యవస్థ సజీవంగానే ఉండి.. తిరిగి కొత్త చిగుళ్లు వస్తాయి. వేరు వ్యవస్థ ఆహారం సేకరించి మానుకు అందించడం వలన తిరిగి చిగుళ్లు వస్తాయి. నీటి సరఫరా అవకుండా నిరోధించ గలిగితే పోషకాలు లభించడం స్తంభించిక నిర్జీవమై పోతుంది. నీటిని గ్రహించే గుణం ఉండడం వలన ఎప్సమ్ సాల్ట్ ఈ పనిని విజయవంతంగా చేయగలుగుతుంది. దీన్ని మానుపైన వేసినప్పుడు అందులో మిగిలి ఉన్న నీటిని పూర్తిగా పీల్చేస్తుంది. దీని వలన ఎండిపోయిన వేరు వ్యవస్థ చనిపోతుంది. నీటిని గ్రహించే గుణం కలిగిన ఇతర రసాయనాలు అనేకం ఉన్నాయి. రాక్ సాల్ట్, క్యాస్టిక్ సోడా, క్యాల్షియం క్లోరైడ్, జింక్ క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, సోడియం హైడ్రా క్సైయిడ్ వంటి రసాయనాలు కూడా ఇందుకు ఉపయోగపడగలవు. అయితే ఈ రసాయ నాలను వాడడం వలన నేల ఉప్పుదేరి పోయే ప్రమాదం ఉంది. మొద్దును తొలగించిన స్థలంలో నాటిన ఇతర మొక్కల ఎదుగుదలకు ఆటంకం కలుగుతుంది. మార్కెట్లో మాను మోడులను తొలగించేందుకు పొటాషియం నైట్రేట్‌తో తయారు చేసిన రసాయ నాలను వాడుతున్నారు. వీటిని వాడటం వలన మాను మొదలు కుళ్లిపోయి తొలగిం చడానికి అనువుగా మారుతుంది. అయితే ఇది వేరు వ్యవస్థ సజీవంగా ఉన్న చెట్ల మోడులను చంపలేదు. అదే ఎప్సమ్ సాల్ట్‌ను వాడడం వలన మాను చనిపోవడంతో పాటు నేలకు మెగ్నీషియం, గంధకం అందుతాయి. ఇవి మొక్కల్లో పత్రహరితం పెరగడానికి ఉపయోగ పడతాయనే సంగతి వ్యవసాయ రంగంలో అనుభవజ్ఞులందరికీ తెలిసిందే. ఎప్సమ్ సాల్ట్‌ను వాడే విధానం తొలగించదలచుకున్న మానులో అంగుళం మందంలో మూడు అంగుళాల లోతు వరకు రంధ్రాలు చేయాలి. మాను వైశాల్యాన్ని బట్టి రంధ్రాల సంఖ్యను ఎంచుకోవాలి. మరీ పెద్ద మానయితే 8 అంగుళాల వరకు రంధ్రాలు వేసుకోవాలి. ఇందులో 100 శాతం స్వచ్ఛమైన ఎప్సమ్ సాల్ట్‌ను వేసి, దానిలో కొద్దిగా నీరు (పదార్థం తడిచేంత మేరకు మాత్రమే) పోయండి. ఇప్పుడు ఎప్సమ్ సాల్ట్ మాను కణజాలంలోకి చొచ్చుకు పోయి అందులోని తేమను పూర్తిగా లాగేస్తుంది. దీంతో పోషకాల సరఫరా నిలిచిపోయి.. జీవశక్తి హరించు కుపోతుంది. ఆయా కాలాలను బట్టి.. భారీ మాను మొదళ్లు చనిపోవడానికి నెల నుంచి రెండు నెలల వరకు పడుతుంది. పని తొందరగా పూర్తవడానికి.. మూడు వారాలకు ఒకసారి ఎప్సమ్ సాల్ట్‌ను రంధ్రాల్లో వేసుకోవచ్చు. మాను మొదలు చనిపోయిన తరువాత.. తొందరగా తొలగించాలంటే తగులబెట్టాలి. లేదా ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ (ఈఎంవోలు), లాక్టో బ్యాక్టీరి యాను కలిపిన నీటిని ఇవే రంధ్రాల్లో పోస్తే సూక్ష్మజీవులు కర్రను పూర్తిగా కుళ్లబెడతాయి. తక్కువ ఖర్చుతో పని పూర్తవుతుంది. పర్యావరణానికి హాని జరగదు. - జిట్టా బాల్‌రెడ్డి, సాగుబడి డెస్క్


