breaking news
Elangovan
-
‘రాధాకృష్ణన్‌తో లాభం లేదు.. ఇండియాకు మనం గట్టి అభ్యర్థిని నిలబెడదాం’
సాక్షి, చెన్నై: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఇండియా కూటమిలో చర్చలు జరుగుతున్నాయి. కూటమి తరఫున ఎవరిని బరిలో నిలపాలి అనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన వ్యక్తినే ఎంపిక చేయాలని డీఎంకే సీనియర్ నాయకుడు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. సదరు నేత అంతటితో ఆగకుండా.. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌తో తమిళనాడుకు ప్రయోజనం లేదని చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది.వివరాల ప్రకారం.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించే అంశంపై విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు సోమవారం సమావేశమయ్యారు. కూటమి పార్లమెంటరీ పక్ష నేతలు.. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో డీఎంకే సీనియర్ నాయకులు ఇళంగోవన్ స్పందించారు. మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడం కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది భారత ఉప రాష్ట్రపతి పదవి. రాధాకృష్ణన్ బీజేపీ అభ్యర్థి.. ఆర్ఎస్ఎస్ వ్యక్తి. ఆయన తమిళనాడుకు చెందిన వ్యక్తి అయినప్పటికీ మా రాష్ట్రానికి ప్రత్యేకంగా జరిగే మంచి ఏమీ ఉండదు. దీన్ని భాష ద్వారా మాత్రమే కాకుండా రాజకీయంగా చూడాలి.#WATCH | Chennai, Tamil Nadu: On Maharashtra Governor CP Radhakrishnan announced as NDA's Vice Presidential candidate, DMK Leader TKS Elangovan says, "He is an RSS man. He is a BJP candidate. You should view this politically, not as per language...I don't know why the poor man… pic.twitter.com/I1IxxxH2Ij— ANI (@ANI) August 18, 2025బీజేపీ నేతృత్వంలోని బీజేపీ.. ఇప్పటికే పలుమార్లు తమిళులను అవమానించింది. బీజేపీ.. తమిళుల కోసం పనిచేయలేదు. కేంద్రంలోని పెద్దలు.. తమిళనాడు విద్యార్థులకు ఎటువంటి సాయం అందించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా డీఎంకే నుంచే అభ్యర్థి ఉంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అందుకే రాధాకృష్ణకు పోటీగా తమిళనాడు నుంచే.. అది కూడా డీఎంకే నుంచి అభ్యర్థి ఎంపిక చేయాలని కోరుతున్నాను అని అన్నారు. చివరగా.. ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఇండియా బ్లాక్ తీసుకున్న నిర్ణయానికే తమ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఇండియా కూటమిలో కొంత మంది నేతలు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టకూడదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బీహార్ ఎన్నికలు దగ్గరలో ఉన్నందున అధికార పక్షం క్రాస్ ఓటింగ్ ద్వారా తమ బలాన్ని పెంచుకుంటే.. అది బీహార్ ఓటర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వారు భావించారు.కూటమి మల్లగుల్లాలు..కాంగ్రెస్ వర్గాల సమాచారాల ప్రకారం.. విపక్ష అభ్యర్థి కాంగ్రెస్ నుంచే ఉండాలనే నిబంధన ఏమీ లేదు. మిత్రపక్షాలు తటస్థ, స్వచ్ఛమైన నేపథ్యం ఉన్న అభ్యర్థి పేరును సూచిస్తే, కాంగ్రెస్ కూడా దానికి అంగీకరించే అవకాశం ఉంది. అయితే బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా ఒక అభ్యర్థిని నిలబెట్టి, సిద్ధాంతపరమైన పోరాటాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ కోరుకుంటుంది. సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ.. ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం అంటే బీజేపీకి స్వేచ్ఛగా మార్గం ఇవ్వడమేనని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ విషయంపై రాహుల్ గాంధీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ ఈ నెల 19న సాయంత్రం ఢిల్లీకి తిరిగి వచ్చి మళ్లీ 21న బీహార్ వెళ్లనున్నారు. ఈ సమయంలో అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. -
ముందు మీ రాష్ట్రాల్లో తగ్గించమనండి
న్యూఢిల్లీ: పెట్రోల్‌పై వ్యాట్ తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీల నాయకులు స్పందించారు. ముందుగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సుంకాలు తగ్గించేలా చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ముందుగా కర్ణాటక, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వాలను పెట్రోల్-డీజిల్‌పై పన్నులు తగ్గించమని అడగాలని అన్నారు. కేంద్రం అత్యధిక ఎక్సైజ్ సుంకం విధించి రూ. 27 లక్షల కోట్లు వసూలు చేసిందని, తప్పనిసరిగా రాష్ట్రాలకు సబ్సిడీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రతి సంవత్సరం రూ. 1 లక్ష కోట్ల ఇంధన సబ్సిడీ ఇచ్చారని గుర్తు చేశారు. మా రాష్ట్రాలే దొరికాయా? ఇంధనంపై పన్నులు తగ్గించాలని ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాలను మాత్రమే ప్రధాని మోదీ ఉటంకిస్తున్నారని డీఎంకే ఎంపీ టీకేఎస్ ఇలంగోవన్ అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లేదా కర్ణాటక పన్నులు తగ్గించాలని ఆయన అనరని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న సుంకాలు రాష్ట్రాలు వసూలు చేసే దానికంటే 3 రెట్లు ఎక్కువని ఆయన వెల్లడించారు. (చదవండి: పెట్రోల్ ధరలపై మోదీ కీలక వ్యాఖ్యలు) ఏకీకృత విధానం కావాలి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్వహించిన సమావేశాన్ని రాజకీయ సభలా ప్రధాని మోదీ మార్చేశారని జార్ఖండ్ ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా విమర్శించారు. కరోనా నియంత్రణకు గురించి తీసుకోవాల్సిన చర్యల కంటే.. పెట్రోల్-డీజిల్ పన్నుల గురించి ప్రధాని ఎక్కువగా మాట్లాడారని అన్నారు. పెట్రోలు, డీజిల్, ఎల్పీజీలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి.. దేశవ్యాప్తంగా ఒకే ధర అమలయ్యేలా ఏకీకృత విధానం తీసుకురావాలని సూచించారు. (చదవండి: ద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలంటూ మోదీకి లేఖ) -
బాసుమతి జొన్న!
బాసుమతి బియ్యం సువాసనకు పెట్టింది పేరు. అదేవిధంగా మరికొన్ని రకాల దేశీ వరి వంగడాలు కూడా సువాసనను వెదజల్లుతుంటాయి. అయితే, సువాసనను వెదజల్లే జొన్న వంగడం కూడా ఒకటి ఉంది! హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) కృషితో ఇది వెలుగులోకి వచ్చింది. ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ ఎం. ఇలంగోవన్ సంప్రదాయ జొన్న వంగడాలపై వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి అధ్యయనం చేస్తున్న క్రమంలో మధ్యప్రదేశ్‌లో ‘బాసుమతి జొన్న’ గురించి తెలిసింది. ఛత్తర్పూర్ జిల్లా బిజావర్ సమీపంలోని కర్రి, సర్వ గ్రామాల ప్రజలు సువాసన కలిగిన జొన్న గురించి చెప్పారని డాక్టర్ ఎం. ఇలంగోవన్ తెలిపారు. దీన్ని ‘బాసుమతి జొన్న’ అని వారు పిలుస్తూ ఉన్నారు. అయితే, అప్పటికే ఇది దాదాపు అంతరించిపోయింది. అతికష్టం మీద నాలుగైదు కంకులు దొరికాయి. ఆ తర్వాత కాలంలో అదే జిల్లాలోని కటియ, కెర్వన్ గ్రామాల్లో కూడా ఈ జొన్న కనిపించింది. ఎస్.బి.బి.ఎ.డి.హెచ్.2 అనే జన్యువు సువాసనకు కారణమని పరిశోధనలో తేలిందని డాక్టర్ ఇలంగోవన్ తెలిపారు. సువాసన కలిగి ఉండే తిండి గింజలకు దేశ విదేశీ మార్కెట్లలో మంచి గిరాకీ ఉంటుందన్నారు. ఆ గ్రామాలలో కొందరు రైతులకు ఇచ్చి సాగు చేయించదలిచామని డా. ఇలంగోవన్ (elangovan @millets.res.in) ‘సాక్షి’కి చెప్పారు. ఈ వంగడం బాగా వ్యాప్తిలోకి వస్తే ఆయా గ్రామాలకు ఆదాయం కూడా సమకూరుతుంది. అంతరించిపోతున్న అరుదైన జొన్న వంగడాన్ని తిరిగి సాగులోకి తెస్తున్న ఐఐఎంఆర్‌కు జేజేలు! డా. ఇలంగోవన్ -
ఎమ్మెల్యేలు ఆమెను ఎన్నుకోవచ్చు.. మరి ప్రజలు!
చెన్నై: ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా వ్యవహరించరాదని డీఎంకే ఎంపీ టీకేఎస్ ఇలాంగోవన్ అన్నారు. శశికళ ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్న నేపథ్యంలో.. ‘ఎమ్మెల్యేలు శశికళను ఎన్నుకోవచ్చు. అయితే ప్రజలు ముఖ్యమంత్రిగా ఆమెను అంగీకరిస్తారా అన్నది చూడాలి’ అని ఇలంగోవన్ అన్నారు. ముఖ్యమంత్రి మార్పు అనేది ఏఐఏడీఎంకే పార్టీ అంతర్గత వ్యవహారమన్న ఇలంగోవన్.. 2011లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే తమిళనాడు భవిష్యత్తు నాశనం అయిందని విమర్శించారు. -
వీసీ పదవికి రూ.14 కోట్ల లంచం !
చెన్నై: వీసీ పదవికి రూ.14 కోట్ల వరకు లంచం చేతులు మారుతున్నట్లు టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన చెన్నై సత్యమూర్తి భవన్లో మంగళవారం ఉదయం రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ జాతీయ జెండాను ఆవిష్కరించి పార్టీ వర్గాలకు, ప్రజలకు మిఠాయిలను పంచిపెట్టారు. సేవాదళ కాంగ్రెస్ నిర్వహించిన పెరేడ్‌ను తిలకించారు. అనంతరం ఇళంగోవన్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయని, ప్రజలు అధికార మార్పుకు సన్నద్ధమయ్యారన్నారు. అవినీతి రహిత పాలన అందజేయాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఏర్పాటు కానున్న ప్రభుత్వంలో కాంగ్రెస్ ముఖ్య భాగస్వామ్యం వహిస్తుందన్నారు. రాష్ట్రంలోగల విద్యాసంస్థలు సక్రమంగా పనిచేయడం లేదని, విద్యా సంస్థల ద్వారా ప్రభుత్వం ధనార్జనకు పాల్పడుతోందని విమర్శించారు. వర్సిటీ వైస్ చాన్సలర్ పదవికి రూ.12 కోట్ల నుంచి రూ.14 కోట్ల వరకు లంచం తీసుకుంటున్నారని, ఈ విధంగా ఎంపికయ్యే వైస్ చాన్సలర్లు వ్యాపారుల్లా ప్రవర్తిస్తున్నట్లు తెలిపారు. పేద, దళిత వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు సుముఖంగా లేరని తెలిపారు. అందుచేత విద్యారంగంలో అవినీతికి పాల్పడని ప్రతిభావంతులకు అవకాశం కల్పించాలని అభిప్రాయపడ్డారు. నటుడు రజనీకాంత్‌కు గతంలోనే పద్మవిభూషణ్ వస్తుందని భావించామని, అయితే ఆలస్యంగా ఆ పదవి అతన్ని వరించిందన్నారు. ఈ అవార్డు లభించడంతో ఆయన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కోశాధికారి నాసే రామచంద్రన్, నటి కుష్బు, గోపన్న తదితరులు పాల్గొన్నారు. -
'రజనీ రాజకీయాలలోకి రాకపోవడమే మంచిది'
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకూడదని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేవీకేఎస్ ఇళంగోవన్ అన్నారు. రజనీకాంత్‌ను చేర్చుకునేందుకు బీజేపీతోపాటు ఇటీవల కాంగ్రెస్ నుంచి తప్పుకున్న జీకే వాసన్ కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అయితే ఆయన రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలలో ఆయన అభిమానులు ఉన్నారన్నారు. తమిళనాడు ప్రజలంతా ఆయన్ను గౌరవిస్తారని చెప్పారు. అయితే, రజనీకాంత్ తోపాటు లౌకిక వాదానికి కట్టుబడిన పౌరులెవరైనా కాంగ్రెస్‌లో చేరితే తాము స్వాగతిస్తామని ఇళంగోవన్ అన్నారు. **