El narasimhan
-
గవర్నర్తో బాబు భేటీ
-
గవర్నర్ సలహాదారుల నియామకం
-
గవర్నర్ నరసింహన్ కు సీఎం కిరణ్ లేఖ
వివాదస్పద నామినేటెడ్ ఎమ్మెల్సీల ఎంపిక వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఎమ్మెల్సీల నామినేషన్ల వ్యవహారంపై గవర్నర్ నరసింహన్ కు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. ఎమ్మెల్సీలుగా తాను సూచించిన నలుగురి పేర్లను ఆమోదించాల్సిందిగా లేఖలో సీఎం కిరణ్ కోరారు. సీఎం సూచించిన నలుగురి పేర్లలో మూడింటికి ఇటీవల గవర్నర్ ఆమోదం తెలిపారు. సీఎం సూచించిన నాలుగవ అభ్యర్థి రఘురాం రెడ్డిని పక్కన పెట్టారు. తాను సూచించిన రఘురామిరెడ్డి పేరును ఆమోదించాల్సిందిగా సీఎం లేఖలో విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ సూచించిన పేర్లను కాకుండా సీఎం కిరణ్ తన సన్నిహితుల పేర్లను సూచించారంటూ విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. -
గవర్నర్ దసరా శుభాకాంక్షలు
హైదరాబాద్: విజయదశమి సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదివారం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సంతోషదాయకమైన దసరా పర్వదినాన మానవాళిపై దుర్గామాత తన చల్లని ఆశీర్వచనాలను కురిపించాలని ఆకాంక్షించారు. ఆనందాన్ని పంచాలి: సీఎం కిరణ్ రాష్ట్ర ప్రజలకు, దేశ, విదేశాలలోని తెలుగువారందరికీ సీఎం కిరణ్ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని వర్గాల ప్రజలకు దసరా పండుగ ఆనందాన్ని పంచాలని ముఖ్యమంత్రి తన సందేశంలో అభిలషించారు. కొత్త వెలుగులు నింపాలి: జగన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుప్రజలందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.