గవర్నర్ దసరా శుభాకాంక్షలు | governor narasimhan extends Dasara greetings | Sakshi
Sakshi News home page

గవర్నర్ దసరా శుభాకాంక్షలు

Oct 14 2013 1:28 AM | Updated on Jul 25 2018 4:09 PM

విజయదశమి సందర్భంగా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆదివారం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్: విజయదశమి సందర్భంగా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆదివారం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సంతోషదాయకమైన దసరా పర్వదినాన మానవాళిపై దుర్గామాత తన చల్లని ఆశీర్వచనాలను కురిపించాలని ఆకాంక్షించారు.
 
 ఆనందాన్ని పంచాలి: సీఎం కిరణ్
 
  రాష్ట్ర ప్రజలకు, దేశ, విదేశాలలోని తెలుగువారందరికీ సీఎం కిరణ్ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని వర్గాల ప్రజలకు దసరా పండుగ ఆనందాన్ని పంచాలని ముఖ్యమంత్రి తన సందేశంలో అభిలషించారు.
 
 కొత్త వెలుగులు నింపాలి: జగన్
 
  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుప్రజలందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement