ప్రధాని మోదీ విజయదశమి శుభాకాంక్షలు | PM Narendra Modi Greets Nation On Vijayadashami - Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ విజయదశమి శుభాకాంక్షలు

Oct 24 2023 9:46 AM | Updated on Oct 24 2023 12:51 PM

PM Narendra Modi wish Nation on Dussehra - Sakshi

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా. ఈ సందర్భంగా దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్రమైన ఈ పండుగ ప్రతికూల శక్తులను అంతం చేయడంతో పాటు మనం జీవితంలో మంచిని అలవరచుకోవాలనే సందేశాన్ని అందిస్తుందని ప్రధాని ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దసరా సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.  దేశ శ్రేయస్సుతో పాటు సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం, ముఖ్యంగా అణగారిన వర్గాల సంక్షేమం కోసం కలిసి పనిచేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు. దేశంలోని తూర్పు, దక్షిణాది రాష్ట్రాల్లో మహిషాసురునిపై దుర్గాదేవి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా జరుపుకుంటారన్నారు. దేశంలోని ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల్లో ఈ పండుగను రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారన్నారు. 
ఇది కూడా చదవండి: ఆర్‌ఎస్‌ఎస్‌ విజయదశమి వేడుకలు
 

Advertisement
 
Advertisement
Advertisement