breaking news
Effect of inflation
-
ఉద్యోగాలపై ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్! తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?
ముంబై: ఉద్యోగ మార్కెట్‌పై జూన్ త్రైమాసికం(క్యూ1)లో ద్రవ్యోల్బణ ప్రభావం ఏమీ లేదని ఇండీడ్ ఇండియా క్వార్టర్లీ హైరింగ్ ట్రాకర్ నివేదిక తెలిపింది. తమ నియామకాలు, ఉద్యోగుల వేతనాలపై ద్రవ్యోల్బణం ప్రభావం లేదని 89 శాతం కంపెనీలు చెప్పాయి. ఉద్యోగార్థుల్లో ప్రతి 10 మందికి గాను ఆరుగురు తమపై ద్రవ్యోల్బణ ప్రభావం లేదని చెప్పినట్టు ఇండీడ్ తన నివేదికలో తెలిపింది. 1,229 ఉద్యోగ సంస్థలు, 1,508 మంది ఉద్యోగుల అభిప్రాయాలను ఇండీడ్ పరిగణనలోకి తీసుకుంది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కంపెనీల ఉద్యోగ నియామకాల్లో 29 శాతం వృద్ధి నమోదైంది. అంతక్రితం మార్చి త్రైమాసికంలో వృద్ధి 20 శాతాన్ని మించింది. 37 శాతం మంది ఉద్యోగార్థులు ఉద్యోగం కోసం చూడడం లేదంటే సంస్థను మార్చాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఇది మార్చి త్రైమాసికంలో 46 శాతంగా ఉంది. ఐటీ, హెల్త్‌కేర్, ఈకామర్స్ ఇక ముందూ వృద్ధిని చూపిస్తాయని.. 5జీ రాకతో రానున్న త్రైమాసికాల్లో టెలికంలోనూ ఉద్యోగ నియామకాలు పెరుగుతాయని ఇండీడ్ నివేదిక అంచనా వేసింది. ఫుల్‌టైమ్ కోరుకునే వారు 63 శాతం మంది ఉద్యోగాలు కోరుకునే వారిలో 63 శాతం మంది ఫుల్‌టైమ్ పనికోసం చూస్తున్నారు. పార్ట్‌టైమ్ పనిని కోరుకునే వారు 26 శాతంగానే ఉన్నారు. ఇక కాంట్రాక్టు ఉద్యోగాల కోసం చూస్తున్నవారు 11 శాతంగా ఉన్నారు. జూన్ త్రైమాసికంలో 19 శాతం కంపెనీలు కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకున్నాయి. ఐటీ/ఐటీఈఎస్ రంగం ఎక్కువ మందికి ఉపాధినిచ్చింది. ఈ రంగంలో 91 శాతం కంపెనీలు జూన్ క్వార్టర్లో నియమకాలు చేపట్టాయి. మార్చి త్రైమాసికంలో 83 శాతం కంపెనీలే నియామకాలు చేపట్టడం గమనార్హం. -
గణాంకాలు, విదేశీ సంకేతాలే కీలకం
న్యూఢిల్లీ: చివరి దశకు చేరిన కార్పొరేట్ ఫలితాలు, ఆర్థిక గణాంకాలు, విదేశీ సంకేతాలే ఈ వారం మార్కెట్లకు దిక్సూచిగా నిలవనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. మంగళవారం(12న) జూన్ నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ)తోపాటు, జూలై నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు వెలువడనున్నాయి. ఇక గురువారం(14న) జూలై టోకు ధరల ఆధారిత ధరల(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం కారణంగా శుక్రవారం(15న) స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితంకానుంది. అమ్మకాలు కొనసాగుతాయ్... గత వారం మార్కెట్లలో కనిపించిన ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయని భావిస్తున్నట్లు రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. అయితే ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి 7,450 వద్ద మద్దతు లభిస్తుందని అంచనా వేశారు. క్యూ1 ఫలితాలు చివరి దశకు చేరిన ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ సంకేతాలు కీలకంగా నిలవనున్నాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఇరాక్ సంక్షోభంపై దృష్టిపెడతారని పేర్కొన్నారు. రిజల్ట్స్‌కు దిగ్గజాలు రెడీ ఈ వారం పలు దిగ్గజ కంపెనీలు క్యూ1(ఏప్రిల్-జూన్) ఫలితాలను ప్రకటించనున్నాయి. జాబితాలో సన్ ఫార్మా, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఐవోసీ, ఆయిల్ ఇండియా, హిందాల్కో, ఎన్ఎండీసీ, టాటా పవర్, సిప్లా, జేపీ అసోసియేట్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి. కాగా, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు కూడా సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. గడచిన శుక్రవారం(8న) డాలరుతో మారకంలో రూపాయి ఐదు నెలల కనిష్టమైన 61.74కు చేరగా, మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ నాలుగు వారాల కనిష్టం 25,329 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ స్వల్ప కాలంలో మార్కెట్ల నడకను టోకుధరలు, రిటైల్ ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు నిర్దేశిస్తాయని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇరాక్ మిల టెంట్ స్థావరాలపై వైమానిక దాడులకు ఆదేశించిన నేపథ్యంలో అంతర్జాతీయ పరిణామాలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని అత్యధిక శాతంమంది నిపుణులు వ్యాఖ్యానించారు. మరోవైపు ఉక్రెయిన్, గాజా ఆందోళనలు కొనసాగుతుండటం కూడా సెంటిమెంట్ బలహీనపడటానికి కారణమైనట్లు తెలిపారు. ఈ పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరల పెరుగుదలకు దారితీస్తున్నాయన్నారు.