breaking news
economist Amartya Sen
-
‘ఎన్నికల వేళ ఆ అంశాలను తెరపైకి తెచ్చారు’
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల ఏడాది రామ మందిర నిర్మాణం, శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం వంటి అంశాలు కీలకంగా ముందుకొచ్చాయని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ నరేంద్ర మోదీ సర్కార్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పక్కదారిపట్టి ఇలాంటి అంశాలను తెరపైకి తెచ్చారని వ్యాఖ్యానించారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించకపోవడం, ప్రజలను వేధించడం ఆమోదయోగ్యం కాదని, దేశంలో ప్రస్తుత పరిస్థితిలో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో పలు విశ్వవిద్యాలయాలు వాటి స్వేచ్ఛను, స్వతంత్రతను కాపాడుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఇతర సంస్థల పరిస్థితీ అలాగే ఉందని, చివరికి పాత్రికేయులు సైతం తమ స్వేచ్ఛను కోల్పోవడం ఆమోదయోగ్యం కాదన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీయేతర లౌకిక పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన గతంలో పిలుపుఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన క్రమంలో బీజేపీయేతర పార్టీల కూటమిలో చేరేందుకు వామపక్షాలు వెనుకాడరాదని సూచించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 31 శాతం ఓట్లు పొందిన పార్టీ రాజకీయాల్లో పెడపోకడలను ప్రోత్సహిస్తోందని అమర్త్య సేన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని ప్రజలు కాపాడుకోవాలని పిలుపు ఇచ్చారు. -
'యూపీఏ కంటే మోదీ సర్కార్ మరింత నిర్లక్ష్యం'
న్యూఢిల్లీ: విద్యా, వైద్య రంగాలను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త అమర్త్యసేన్ వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆరోగ్యాన్ని ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం కూడా విద్యా, వైద్యం, ఆరోగ్య రంగాలను నిర్లక్ష్యం చేసిందన్నారు. అయితే, గత యూపీఏ ప్రభుత్వం కంటే కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఈ రెండు రంగాలను మరింత నిర్లక్ష్యం చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశానికి చెందిన న్యూక్లియర్ ప్లాంట్లు చాలా ప్రమాదకరమని, కర్బన ఉద్ఘారాల నేపథ్యంలో పర్యావరణం దెబ్బతింటుందని ఆర్థికశాస్త్ర నిపుణుడు అమర్త్యసేన్ విచారం వ్యక్తం చేశారు.