breaking news
Ebola cases
-
మళ్లీ పడగ విప్పుతున్న ప్రాణాంతక ఎబోలా..!
జెనీవా: ప్రాణాంతక ఎబోలా మళ్లీ పడగ విప్పుతోంది. ఆఫ్రికా ఖండంలో ఎబోలా వ్యాప్తి మళ్లీ మొదలైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది. డెమొక్రటిక్ రిపబ్లిక ఆఫ్ కాంగోలో వైరస్ వ్యాప్తి వెలుగులోకి వచ్చిందని తెలిపింది. ఆఫ్రికా ఈశాన్య ప్రాంతమైన ఈక్వెటర్ ప్రావిన్స్‌లోని మబండకా అనే పట్టణంలో ఎబోలా కేసు నమోదైంది. ఈ ప్రావిన్స్‌లో 2018 నుంచి ఎబోలా స్థానికంగా వ్యాప్తి చెందడం ఇది మూడోసారి. ఈ దేశంలో 1976నుంచి 14 సార్లు ఎబోలా వ్యాపించింది. రెండు వారాల క్రితమే వ్యాధి వ్యాప్తి ప్రారంభమైందనీ, ప్రస్తుతం దానిని అదుపు చేయడానికి అన్ని చర్యలు చేపట్టామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. చదవండి👉🏾 మొట్టమొదటిసారిగా.. యూఎస్‌లో పోర్నోగ్రఫీపై కోర్సు ‘ఇప్పటి వరకు ఒక కేసును ఎబోలాగా అధికారికంగా ధ్రువీకరించారు. 31 ఏళ్ల రోగిలో ఈనెల 5వ తేదీన ఎబోలా లక్షణాలు కనిపించాయి. వారం తర్వాత స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆ తర్వాత ఏప్రిల్ 21న ఎబోలా చికిత్సా కేంద్రంలోని ఐసీయూలో చేర్పించారు. కానీ, ఒక రోజు తర్వాత అతడు మరణించాడు. వైద్య సిబ్బందిలో ఎబోలా లక్షణాలు కనిపించడంతో వెంటనే వారు పరీక్షల కోసం నమూనాలను ఇచ్చారు. ఇక ఎబోలాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలను గౌరవ ప్రదంగా నిర్వహించారు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. చదవండి👉🏻 ట్రిపుల్ బొనాంజా.. ఒకే కాన్పులో ఇద్దరు కాదు ముగ్గురు -
లైబీరియాలో తగ్గుతున్న ఎబోలా కేసులు
పశ్చిమ ఆఫ్రికా దేశాలను వణుకుపుట్టించిన భయంకరమైన వైరస్ ఎబోలా. దీని ధాటికి ఆప్రికా దేశాలు అట్టడుగిపోయాయి. రోజురోజుకీ వైరస్ వ్యాప్తి తీవ్రత అధికమవుతుండటంతో దీని బారిన పడి జనం పిట్టలా రాలిపోతున్నారు. ఈ వైరస్ తీవ్రతతో ప్రక్క దేశాలు సైతం భయం గుప్పిట్లో బ్రతుకుతున్నాయి. దక్షణాఫ్రికాలోని లైబీరియాలో ఎబోలా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) బుధవారం వెల్లడించింది. ఎబోలా కేసుల రేటు క్రమంగా తగ్గుతున్నట్టు కనిపిస్తోందని పేర్కొంది. అయితే అంటువ్యాధిలా ప్రబలిన ఎబోలా వైరస్ వ్యాప్తి నిజానికి తగ్గుముఖం పట్టిన ధోరణి కనిపిస్తుందని తెలిపింది. ఎబోలా ఇన్ఫెక్షన్ తీవ్రత ప్రస్తుతం తగ్గినట్టు కనిపించినా దాని తీవ్రత చాలాకాలం వరకు ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. వైరస్ తీవ్రత తగ్గటం ఆశాజనకంగా ఉన్నా అది పూర్తిగా నిర్మూలన అయినట్టు భావించలేమని డబ్ల్యూహెచ్ఓ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బ్రూష్ ఐల్వార్డ్ విలేకరులతో చెప్పారు. ప్రస్తుతం జెనీవాలో ఎబోలా అదుపులో ఉన్న మళ్లీ వైరస్ విజృంభించే అవకాశం ఉందని ఐల్వార్డ్ హెచ్చరించారు.