breaking news
Dronacharya awardee
-
ద్రోణాచార్య అవార్డు గ్రహీతపై పోక్సో కేసు
ముంబైలో 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 45 ఏళ్ల ద్రోణాచార్య అవార్డు గ్రహీత, జిమ్నాస్టిక్స్ కోచ్‌పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విలే పార్లేలోని ఓ జిమ్నాస్టిక్స్ కేంద్రంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.పోలీసుల వివరాల ప్రకారం.. ఇంటి వద్ద చదువుకుంటున్న సమయంలో కోచ్ వాట్సాప్ ద్వారా బాలికకు ‘హాయ్’ అంటూ సందేశం పంపాడు. అనంతరం ఆమెను జిమ్నాస్టిక్స్ కేంద్రానికి రావాలని, కలవడానికి ఖాళీగా ఉన్నావా అని అడిగాడు. కోచ్ నుంచి సందేశం రావడంతో బాలిక అతడిని సంప్రదించిందని సమాచారం.బాలిక జిమ్‌కు వెళ్లినప్పుడు అక్కడ కోచ్ ఒక్కడే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అధికారిక పనికి సంబంధించిన విషయం ఉంటుందని భావించి వెళ్లిన బాలికను తన చెప్పులు లోపలికి తీసుకురావాలని, అనంతరం తలుపు లోపలి నుంచి లాక్ చేయాలని కోచ్ చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఆ తర్వాత బాలికపై కోచ్ లైంగిక వేధింపులకు ప్రయత్నించాడని, అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ హెచ్చరించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాలిక పేర్కొంది.ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సహాయంతో ఫిర్యాదుఘటనతో భయాందోళనకు గురైన బాలిక తన పాఠశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. బాలిక ఫిర్యాదు ఆధారంగా విలే పార్లే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.మైనర్ బాలికకు సంబంధించిన కేసు కావడంతో పోలీసులు పోక్సో చట్టంలోని నిబంధనల ప్రకారం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పరిస్థితులు, ఆరోపణలపై ఆధారాలు, ఇతర వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
తల్లిదండ్రులే నాకు స్ఫూర్తి
ఓరుగల్లు బిడ్డగా గర్విస్తున్నాను క్రీడలతో ఐదు ఖండాలు తిరిగాను ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్ వరంగల్ స్పోర్ట్స్ : మా అమ్మ, నాన్న మల్లమ్మ, ఉప్పలయ్య స్ఫూర్తితోనే నేను ఇంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించానని ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్ అన్నారు. వరంగల్ అథ్లెటిక్స్ అసోసియేషన్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నాగపురి రమేష్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత రమేష్ మాట్లాడుతూ ఓరుగల్లు బిడ్డను అయినందుకే తాను ఉన్నతస్థాయికి చేరుకున్నానని తెలిపారు. తాను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండేందుకు ముందు అమ్మ, నాన్నలు కారణమని, తర్వాత చిన్ననాటి స్నేహితులని చెప్పారు. ప్రభుత్వం అవకాశమిస్తే అథ్లెటిక్స్‌తో పాటు ఇతర క్రీడల కోసం జిల్లాలో అకాడమీ ఏర్పాటు చేస్తానని తెలిపారు. మూడంచెల క్రీడా విధానంతో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను ఇంటర్లో ఉన్నప్పుడు కనీసం హైదరాబాద్‌కు కూడా వెళ్లేవాడిని కాదని.. క్రీడాకారుడిగా ఇప్పటివరకు ఐదు ఖండాలు తిరిగానని.. క్రీడల గొప్పతనం ఇదేనని చెప్పారు. అర్జున అవార్డు గ్రహీత పిచ్చయ్య తర్వాత ద్రోణాచార్య అవార్డు తాను అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేష్ వరంగల్ బిడ్డగా తెలంగాణ ప్రతిష్టను ఖండాంతరాలకు చాటి చెప్పాడన్నారు. ఆయన అకాడమీ ఏర్పాటు చేస్తే ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సాయం అందిస్తామన్నారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో నూతన క్రీడాపాలసీని సీఎం కేసీఆర్ తీసుకు రానున్నారని చెప్పారు. అథ్లెటిక్స్ అసోసియేషన్జిల్లా కార్యదర్శి సారంగపాణి అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో డీఎస్డీఓ ఇందిర, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, సబియా సబహత్, బోడ అనయ్య, టీఆర్ఎస్ నాయకులు గుడిమల్ల రవికుమార్, ఇండ్ల నాగేశ్వర్రావు, మార్నేని రవీందర్రావు, కాంగ్రెస్ నాయకుడు బొద్డిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పింగిళి రమేష్‌రెడ్డి, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌బ్యాడ్మింటన్ జాతీయ అంపైర్ కొమ్ము రాజేందర్, నాగకిషన్, బరుపాటి గోపి, కోచ్‌లు శ్రీమాన్, శ్రీధర్, రమేష్, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.


