-
సఫాయి అన్న.. నీకు సలాం అన్న
సాక్షి, సనత్‌నగర్(హైదరాబాద్): సఫాయి అన్న.. నీకు సలాం అన్న.. అంటూ వారి సేవలను గుర్తించి మూడుసార్లు వేతనాలు పెంచిన మొదటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాత్రమేనని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. డ్రైవర్స్ కమ్ ఓనర్ స్కీం కింద సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ సెంటర్ కేంద్రంగా నగర వ్యాప్తంగా 1,350 స్వచ్ఛ ఆటో టిప్పర్లను సోమవారం మంత్రులు ప్రారంభించారు. వీరిలో మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్‌లతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం 250 మంది లబ్ధిదారులకు స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బెస్ట్ సిటీగా హైదరాబాద్.. ► గతంలో 2015లో స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా 2,500 స్వచ్ఛ ఆటో టిప్పర్లను ఏకకాలంలో తీసుకువచ్చామని గుర్తుచేశారు. దేశంలో స్వచ్ఛభారత్, స్వచ్ఛ సర్వేక్షణ్ అమలుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ బెస్ట్ సిటీగా నిలిచిందన్నారు. ► ఎప్పటికప్పుడు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తెల్లవారుజామున 3– 4 గంటల నుంచే పరిశ్రమిస్తున్న మున్సిపల్ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, స్వచ్ఛ ఆటోడ్రైవర్లకు, ఇతర వాహనాల సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. స్వచ్ఛ ఆటో టిప్పర్లను ప్రవేశపెట్టకముందు నగరం నుంచి ప్రతిరోజూ 3,500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేదన్నారు. వీటిని ప్రవేశపెట్టిన తర్వాత 6,500 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ జరుగుతోందన్నారు. దక్షిణ భారతంలోనే అతిపెద్ద ప్లాంట్.. ► వాహనాల ద్వారా సేకరించిన చెత్తను తడి, పొడి చెత్తను వేరు చేసి విద్యుత్పాదనకు జవహర్‌నగర్‌లో 20 మెగావాట్ల ప్లాంట్‌ను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. మరో 28 మెగావాట్ల ప్లాంట్‌కు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చాయన్నారు. దాని పనులు కూడా ప్రారంభమై పూర్తి చేసుకుంటే మొత్తం 48 మెగావాట్లతో దక్షిణ భారతంలోనే అతిపెద్ద ప్లాంట్‌గా నగరం నిలవనున్నదన్నారు. కార్పొరేటర్లు, అధికారులు తమ పరిధిలో క్షేత్ర స్థాయిలో పర్యటించి మెరుగైన పారిశుద్ధ్యం కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సంతోష్, ప్రియాంక అలా, జోనల్ కమిషనర్ రవికిరణ్, జాయింట్ కమిషనర్ సంధ్య, కార్పొరేటర్లు కొలను లక్ష్మీబాల్‌రెడ్డి, మహేశ్వరి శ్రీహరి, డీఎంసీ వంశీకృష్ణ, ఏఎంహెచ్ఓ భార్గవ నారాయణ్, మహీంద్రా కంపెనీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
వెయ్యి మంది నిరుద్యోగులకు క్యాబ్‌లు: ఈటల
గచ్చిబౌలి: వెయ్యిమంది నిరుద్యోగులకు క్యాబ్‌లు ఇప్పిస్తామని, ప్రతి ఒక్కరు వృత్తిని ప్రేమించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ క్యాబ్ డ్రైవర్లకు సూచించారు. గురువారం గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో ఉబెర్ అవార్డులను ఆయన ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ.. చదువుకున్న వెయ్యిమంది నిరుద్యోగులకు డ్రైవర్ కమ్ ఓనర్ స్కీం కింద క్యాబ్‌లు ఇప్పిస్తామని చెప్పారు. వాహనం కొనుగోలుకు రూ.5 లక్షలు బ్యాంక్ రుణం ఇస్తే 60 శాతం సబ్సిడీ, ఐదు లక్షలకు పైగా లోన్ ఇస్తే 50 శాతం సబ్సిడీ అందిస్తామని వెల్లడించారు. రూ.2 లక్షల లోన్ ఇస్తే 70 శాతం సబ్సిడీ అందజేస్తామని తెలిపారు. క్యాబ్ డ్రైవర్ వృత్తి నామోషీగా భావించవద్దని సూచించారు. అనేక మంది చదువుకున్నవారు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలు లేనప్పుడు ప్రైవేట్ ఉగ్యోగాలలో సెటిల్ అవుతున్నారని పేర్కొన్నారు. ఉబెర్ క్యాబ్ సహకారంతో నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. వృత్తిని సామాజిక సేవగా భావించాలని అన్నారు. అత్యాధునిక పరిజ్ఞానంతో ఉబెర్ క్యాబ్ ప్రయాణికులకు చేరువగా ఉందన్నారు. ఖాళీ సమయాల్లో క్యాబ్ డ్రైవర్లు ఉబెర్‌లో పనిచేసుకునే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
Advertisement