ఆనంద్‌కు తొలి ‘డ్రా
బిల్బావో (స్పెయిన్): బిల్బావో ఫైనల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొలి ‘డ్రా’ నమోదు చేశాడు. లెవాన్ అరోనియన్ (ఆర్మేనియా)తో మంగళవారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. తొలి రెండు రౌండ్లలో నెగ్గిన ఆనంద్ ప్రస్తుతం 7 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.