breaking news
Drake
-
అర్జెంటీనా గెలవదని 14 కోట్లు పందెం.. డ్రేక్ శాపం ఫలిస్తుందా?
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా, స్పెయిన్ తలపడుతున్న వేళ ప్రపంచవ్యాప్తంగా భారీ బెట్టింగ్‌లు నమోదవుతున్నాయి. అర్జెంటీనా టైటిల్ నిలబెట్టుకుంటుందంటూ కొంతమంది పందేలు కాస్తుంటే.. మరికొంత మంది మాత్రం ఈసారి స్పెయిన్ టైటిల్ అందుకొని 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతుందంటూ భారీ బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఈ బెట్టింగ్‌ల విలువ కూడా కోట్ల రూపాయల్లో ఉండడం గమనార్హం. ప్రపంచం మొత్తం బెట్టింగ్‌లు వేసినప్పటికీ, కెనడియన్ రాపర్ డ్రేక్ గ్రహమ్ వేసే పందెం మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. గతంలో డ్రేక్ మద్దతు ఇచ్చిన జట్లు లేదా ఆటగాళ్లు ఓడిపోవడం జరిగింది. తాజాగా అర్జెంటీనా ఫిఫా టైటిల్‌ను గెలవదంటూ డ్రేక్ 1.5 అమెరికన్ మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 14.5 కోట్ల రూపాయలు) పందెం కాయడం సంచలనం కలిగించింది. మరి డ్రేక్ శాపం ఫలిస్తుందా అన్నది ఫైనల్ తర్వాత తేలనుంది.'డ్రేక్ శాపం' అంటే?👉డ్రేక్ శాపం అనేది ఒక క్రీడా మూఢనమ్మకం. దీని ప్రకారం, డ్రేక్ బహిరంగంగా మద్దతు ఇచ్చిన అథ్లెట్లు, ఫైటర్లు లేదా జట్లు తరచుగా కీలకమైన మ్యాచ్‌లలో ఓడిపోవడాన్ని అభిమానులు గమనించారు.👉చాలా సందర్భాల్లో, ఆటగాళ్లు కెనడియన్ ర్యాపర్‌తో ఫోటోలు దిగిన తర్వాత ఆయా జట్లు ఓటమిని చవిచూశాయి.👉ఈ మూఢనమ్మకం కారణంగా, చాలా మంది క్రీడాభిమానులు డ్రేక్ మద్దతును అపశకునంగా భావిస్తారు.👉ఇప్పుడు అతను అర్జెంటీనాపై తన పందెం వేయడంతో, ఈ చర్య ప్రపంచ కప్ ఫైనల్‌కు ముందు ఆ జట్టు మద్దతుదారులలో ఆందోళనను రేకెత్తించింది.లెక్కచేయని అర్జెంటీనా ఫ్యాన్స్..అయితే అర్జెంటీనా అభిమానులు మాత్రం డ్రేక్ పందేన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. 2022 ఖతార్ ప్రపంచకప్‌లోనూ ఫైనల్లో ఫ్రాన్స్ చేతిలో అర్జెంటీనా ఓడిపోతుందంటూ డ్రేక్ గ్రహమ్ ఒక మిలియన్ డాలర్లు (సుమారు రూ. 10 కోట్లు) పందెం కాసి చేతులు కాల్చుకున్నాడు. డ్రేక్ శాపానికి తిరుగుండదని బీరాలు పలికాడు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. ఆ ప్రపంచకప్‌లో మెస్సీ సేన ఫిఫా టైటిల్ గెలవడంతో డ్రేక్ అంచనా తప్పి అపఖ్యాతి పాలయ్యాడు. అయితే తాజాగా ఫిఫా 2026 టోర్నీలో అర్జెంటీనా మరోసారి ఫైనల్ చేరిన క్రమంలో డ్రేక్ మరోసారి భారీ పందెం కాసినప్పటికీ ఈసారి కూడా అతడి అంచనా తప్పుతుందని అర్జెంటీనా అభిమానులు బల్లగుద్ది జోస్యం చెబుతున్నారు. ఈసారి కూడా మెస్సీ సేన డ్రేక్ మూడ నమ్మకాన్ని బద్దలుకొట్టి నాలుగోసారి ఫిఫా టైటిల్‌ను ఎగురేసుకుపోతుందని పేర్కొన్నారు.మెస్సీ సేనకు వ్యతిరేకంగా..ఆరంభం నుంచి ఈసారి ఫిఫా టోర్నీలో అర్జెంటీనా గెలవకూడదనే ప్రయత్నాలు కొనసాగుతూ వచ్చాయి. ఆరంభ పోటీల్లో అనామక జట్టు కేప్‌వెర్డె.. అర్జెంటీనాను ఓడిస్తుందంటూ ఒక ఆధ్యాత్మికవేత్త చేసిన ప్రకటన వైరల్‌గా మారింది. కానీ రియాల్టీకి వచ్చేసరికి అర్జెంటీనా సునాయాసంగా కేప్వెర్డెను ఓడించింది. ఈసారి ఫిఫాలో విస్తృతంగా ప్రచారం జరిగిన మరో మూడనమ్మకం ఏంటంటే.. ప్రముఖ యూట్యూబర్ ఐషో స్పీడ్ తాను మద్దతు ఇచ్చిన ప్రతీ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడంతో, అతడికి అపశకునం అనే బిరుదు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్, అర్జెంటీనా మ్యాచ్‌కు ఐషోస్పీడ్ అర్జెంటీనా జెర్సీ ధరించి వారికి మద్దతు ఇచ్చాడు. కానీ మెస్సీ సేన ఐషో స్పీడ్ అపశకునాన్ని సైతం ఛేదించి సెమీస్‌లో అడుగుపెట్టింది. అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరగనున్న ప్రతిష్టాత్మక ఫిఫా ఫైనల్ మ్యాచ్‌కు మెట్‌లైఫ్ స్టేడియం వేదిక కానుంది. భారత కాలమాన ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.Read: ఫిఫా ఫైనల్‌కు ముందు మెస్సీ చివరి సందేశం! -
రేసిజానికి అర్థం మార్చేసింది!
చేర్పు మొక్కకి శ్రద్ధగా అంటు కడతారు. కలిసిపోవాలి. కొత్తవి వికసించాలి. యూ.ఎస్.లో అలా లేదు. శ్రద్ధగా అంటు విడగొడుతున్నారు! ‘‘షిట్.. నల్లవాళ్లను కలుపుకోవడమా!’’ సి..స్ట..మే..టì...క్.. రేసిజం!! పైకి కనిపించని జాత్యహంకారం. డిక్షనరీలో ఇంత లోతైన అర్థం లేదు. పాతను తీసి, ఇప్పుడా లోతును చేర్చబోతోంది వెబ్‌స్టర్. అదీ ఒక విద్యార్థిని మాట మీద! యూనివర్సిటీ నుంచి కెన్నెడీ మిచమ్ ఫ్రెష్‌గా బయటికి వచ్చిందని చెప్పడానికి లేదు. నల్లజాతి అమ్మాయి. స్కూల్లో, కాలేజ్‌లో, యూనివర్సిటీలో నలిగి నలిగి.. ‘అమ్మ దేవుడా’ అని డిగ్రీతో బయటపడింది. తెల్ల చూపులు, తెల్ల మాటలు, తెల్ల సోషల్ డిస్టెన్స్లు.. అన్నీ అయి, అయోవాలోని డ్రేక్ విశ్వవిద్యాలయం నుంచి అకడమిక్ క్యాప్‌తో గేటు దాటగానే.. మినియాపలీస్లో పెద్ద పిడుగు. అదిరిపడింది. జార్జి ఫ్లాయిడ్ విషాద మరణం! అదురుపాట్లు మిచమ్కు కొత్తేం కాదు. జాత్యహంకారానికి అలవాటు పడలేకపోతోంది. మిస్సోరీలోని ఫ్లోరిసెంట్లో ఉంటుంది తను. అక్కడికి దగ్గర్లోనే ఫెర్గూసన్. 2014లో మైఖేల్ బ్రౌన్ అనే పద్దెనిమిదేళ్ల నల్లజాతి యువకుడిని ఒక పోలీసు అధికారి కాల్చి చంపింది ఫెర్గూసన్లోనే. నేటి ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ ఉద్యమానికి నాంది అది. మిచమ్కి అప్పుడు పదహారేళ్లు. ఇంటికొచ్చాక పెద్దవాళ్లను అడిగింది.. ‘ఒక మనిషిని అలా ఎలా చంపేస్తారు?’ అని. ‘రేసిజం’ అన్నారు. ఆ మాటకు అర్థం కోసం ‘మెరియం వెబ్‌స్టర్’ డిక్షనరీలో వెతికింది. పుట్టిన జాతి నుంచి సంక్రమించే ఆధిక్యభావన అని ఉంది! ఆ అర్థం కరెక్టు కాదనిపించింది మిచమ్కు. ఆధిక్యభావన ఉంటే ఉండొచ్చు.. మనిషిని మనిషిలా చూడాలి కదా.. అనుకుంది. అమెరికాలో అత్యధికంగా విక్రయం అయ్యే నూటా ఎనభై ఐదేళ్ల నాటి మెరియం వెబ్‌స్టర్ డిక్షనరీని గొప్ప భాషా పండితులే రూపొందించి ఉండొచ్చు. కానీ బయట కనిపించే రేసిజానికి, డిక్షనరీలో కనిపిస్తున్న అర్థం సరిపోవడం లేదు ∙∙ ‘రేసిజం’ అంటే డిక్షనరీలో ఉన్న అర్థం కరెక్టేనా అని ప్రొఫెసర్లను అడిగింది మిచమ్. ‘అవును కరెక్టే కదా’ అన్నారు. ‘పైపై అర్థం కాదు సర్, వాస్తవ పరిస్థితికి ఆ అర్థం సరిపోతుందా?’ అని మళ్లీ అడిగింది. రెండోసారి వాళ్లు సమాధానం చెప్పలేదు. సోషల్ మీడియాలో ఈ టాపిక్‌ని తెచ్చింది. ‘నీకర్థం కాదులే’ అని కొందరన్నారు. ‘చదువుకోడానికి నీకు రిజర్వేషన్ ఉంది కదా. అదే రేసిజం’ అని నవ్వారు కొందరు. వాళ్ల మాటలు కూడా మిచల్కు రేసిజంలానే అనిపించాయి. కానీ అవి డిక్షనరీ అర్థం పరిధిలోకి రానివి! వాళ్ల మాటల్నే సరిగా నిర్వచించలేనప్పుడు జార్జిఫ్లాయిడ్‌ను చంపేసిన పోలీసు మోకాలిలోని జాత్యహంకారానికి మెరియం వెబ్‌స్టర్ సరైన అర్థాన్ని ఎలా చెప్పగలుగుతుంది? ఫ్లాయిడ్ మే 25న చనిపోయాడు. మిచల్ మే 28న ఆ డిక్షనరీ పబ్లిషర్లకు మెయిల్ పెట్టింది. ‘‘మీ డిక్షనరీలో రేసిజం అనే మాటకు ఉన్న అర్థం తప్పు. దానిని మార్చాలి’’ అని తను అనుకున్న అర్థం ఏమిటో రాసి పంపింది. వెంటనే వెబ్‌స్టర్ ఎడిటర్ ఆమెకు రిప్లయ్ ఇచ్చారు. ‘‘ఆగస్టులో మార్కెట్లోకి వచ్చే డిక్షనరీలో రేసిజానికి మా పాత అర్థాన్ని తొలగించి, మీ కొత్త అర్థాన్ని చేరుస్తున్నాం’’ అని తెలిపారు! ‘ఐ వాజ్ సూపర్ హ్యాపీ’ అంటోంది మిచమ్ ఆ రిప్లయ్‌ని చూసినప్పుడు తనకేం అనిపించిందో చెబుతూ. రేసిజాన్ని వెబ్‌స్టర్ ‘ఆధిక్య భావన’ అంది. మిచమ్ ‘అల్పులనే భావన’ అంది. అల్పులు అనే భావన మనసులో లేకపోతే అధిక్యం అనే భావనే ఉండదని మిచమ్ ఉద్దేశం. నల్లవాళ్లకు ఎందులోనూ అధికారం లేకుండా చేసేందుకు, ఒక ప్రణాళిక ప్రకారం (సి..స్ట..మే..ట...క్..గా) సాగుతున్న వివక్షే రేసిజం అనే అర్థం రావాలని మిచమ్ తపన. ఆ తపనని మెరియం వెబ్‌స్టర్ డిక్షనరీ గుర్తించి, గౌరవించింది. -
ఆమెను పెళ్లిచేసుకోవాలనుకుంటున్నా..
గతకొంతకాలంగా ప్రణయసీమల్లో విహరిస్తున్న పాప్ సింగర్ రిహాన్నా, ర్యాపర్ డ్రాకే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా? అంటే సన్నిహిత వర్గాలు అవుననే అంటున్నాయి. రిహాన్నాను పెళ్లిచేసుకోవాలని డ్రాకే కృతనిశ్చయంతో ఉన్నాడంట. కొంతకాలం ప్రేమించుకొని ఆ తర్వాత విడిపోయి.. మళ్లీ ఇప్పుడు రొమాన్స్ చేసుకుంటున్న ఈ జంట తాజాగా ఎంటీవీ వీడియో మ్యూజిక్ అవార్డు వేడుకలో తమ మధ్య ఉన్న ప్రేమను చాటుకున్నారు. తాను రిహాన్నాతో ప్రేమలో ఉన్నట్టు 29 ఏళ్ల డ్రాకే ఈ వేడుకలో ప్రకటించాడు. ఇందుకు రిహాన్నా సిగ్గుపడుతూ తలూపింది. ఈ నేపథ్యంలో రిహాన్నాను పెళ్లి చేసుకోవాలని డ్రాకే కోరుకుంటున్నాడని, ఇద్దరూ పెళ్లికి సిద్ధంగా ఉన్నారని, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలన్నది వారే నిర్ణయం తీసుకుంటారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.


