breaking news
Diwali bombs
-
ఢిల్లీలో దీపావళి ధమాకా..?
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దీపావళికి టపాసుల మోత మోగే అవకాశాలున్నాయి. వాయు కాలుష్యం దృష్ట్యా ఏళ్లుగా కొనసాగుతున్న సంపూర్ణ నిషేధంపై బీజేపీ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ప్రజల మతపరమైన, సాంస్కృతిక మనోభావాలను గౌరవిస్తూ, పర్యావరణానికి హాని కలగని రీతిలో హరిత (గ్రీన్) టపాసులకు అనుమతి ఇవ్వాలని యోచిస్తోంది. ఈ మేరకు టపాకాయలపై నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. గ్రీన్ కాకర్స్కే అనుమతి! సంపూర్ణ నిషేధం బదులుగా, ప్రభుత్వం నిర్దేశించిన, ధ్రువీకరించిన గ్రీన్ క్రాకర్స్‌ను మాత్రమే పరిమిత సమయం పాటు కాల్చేందుకు అనుమతించాలని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించనుంది. పండుగ ఉత్సాహాన్ని దెబ్బతీయకుండా, అదే సమయంలో కాలుష్య నియంత్రణకు పెద్దపీట వేసేలా ఈ మధ్యేమార్గం ఉత్తమమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ తమ ప్రథమ ప్రాధాన్యాలని, అందుకే కేవలం తక్కువ ఉద్గారాలు వెలువరించే హరిత టపాసుల వైపే మొగ్గు చూపుతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. ఫలించని సంపూర్ణ నిషేధం కొన్నేళ్లుగా అమలు చేస్తున్న సంపూర్ణ నిషేధం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని ప్రభుత్వం వాదించనుంది. నిషేధం ఉన్నప్పటికీ, ప్రజలు అక్రమ మార్గాల్లో ప్రమాదకరమైన, అధిక కాలుష్యాన్ని వెదజల్లే టపాసులను కొనుగోలు చేసి కాలుస్తున్నారని, దీనివల్ల కాలుష్య తీవ్రత తగ్గకపోగా కొన్నిసార్లు మరింత పెరుగుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కఠినమైన నిషేధం కంటే నియంత్రిత పద్ధతిలో గ్రీన్ క్రాకర్స్‌ను అనుమతించడమే ఆచరణాత్మక పరిష్కారమని బీజేపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచి్చంది. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించి, గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతిస్తే నిబంధనల అమలులో ఏమాత్రం ఉపేక్షించబోమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నగరం అంతటా పటిష్ట నిఘా ఏర్పాటు చేయనున్నారు. -
భీతావహం.. పేలిన దీపావళి బాంబులు
టెక్కలి: ఒక అరుగు ధ్వంసమైపోయింది. పరిసరాలన్నీ రక్తసిక్తమయ్యాయి. వీధంతా భీతావహంగా కనిపించింది. ఇద్దరు ఒళ్లంతా గాయాలతో రోదిస్తున్నారు. టెక్కలిలోని కచేరీ వీధిలో బుధవారం కనిపించిన దృశ్యాలివి. మధ్యాహ్నం 1 గంట నుంచి 1.20 వరకు ఈ ప్రాంతం భయానకంగా మారింది. దీపావళి కోసం బాంబులు తయారు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు అవి పేలడంతో ఒక బాలుడితో పాటు మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. టెక్కలి గొల్లవీధికి చెందిన వాకాడ హరి అనే బాలుడు, సందిపేట మూర్తి, సందిపేట సాయిగోపాల్‌తో కలిసి స్థానిక కచేరీ వీధిలోని ఓ మారుమూ ల ప్రాంతంలో బాణసంచా తయారు చేస్తున్నారు. దీని కోసం ఒడిశాలోని పర్లాఖిముడి నుంచి ముడి సరుకులు తెప్పించారు. వీధి అరుగుపై కూర్చుని బాంబులు తయారు చేస్తుండగా అకస్మాత్తుగా అవి పేలిపోయాయి. ఆ ధాటికి బాలుడు హరి, యువకుడు మూర్తి అరుగు మీద నుంచి కిందకు తుళ్లిపోయారు. మరో యువకుడికి కూడా గాయాలయ్యాయి. అరుగంతా ధ్వంసమైపోయింది. పక్క భవనంలోని అద్దాలు సైతం పగిలిపోయాయి. దీపావళి రోజులు కావడంతో బాంబులు పేలిన శబ్దం విని అంతా ఎక్కడో బాణసంచా కాలుస్తున్నారనే అనుకున్నారు. అయితే ఒళ్లంతా తీవ్రమైన గాయాలతో హరి, మూర్తిలు గట్టిగా ఏడవడంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని వారికి సపర్యలు చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో టెక్కలి ఎస్ఐ ఎన్.కామేశ్వరరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని 108 సాయంతో క్షతగాత్రులను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి తల్లిదండ్రులు సంఘటనా స్థలం వద్దకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. హరి, మూర్తిలను మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు పంపించారు. స్వల్పంగా గాయపడిన సాయిగోపాల్ నుంచి వివరాలు సేకరించారు. రిమ్స్‌లో బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో రాగోలు జెమ్స్‌కు తరలించారు. సమాచారం తెలుసుకున్న క్లూస్ టీమ్ టెక్కలి చేరుకుని వివరాలు సేకరించారు. బాంబు పేలిన సంఘటన పై టెక్కలి పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణాలు తీసిన సరదా
సాలూరు: ఎంతో ఆనందంగా దీపావళి జరుకోవాలని ఆ పిల్లలు ఆశించారు. దానికి కోసం ముందుగానే బాణసంచా తయారీ ప్రారంభించారు. వారు తయారు చేసుకుంటున్న బాంబులకే బలైపోవడంతో ఆ ఇళ్లలో విషాదం అలుముకుంది. పట్టణంలోని చిన్నవీధిలో బిరుసు అప్పలస్వామి పక్క ఇంటి మేడపైకి అతని కుమారుడు బిరుసు కామేశ్వరరావు, అతని స్నేహితుడు గోక సతీష్ శనివారం ఉదయం దీపావళి బాంబులు తయారు చేసుకునేందుకు వెళ్లారు. గోడబాంబు తయారు చేసేందుకు కామేశ్వరరావు అధిక మొత్తంలో మందుగుండును కట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రమాదవశాత్తు బాంబు పేలడంతో అతని రెండు చేతులూ ఛిద్రమైపోయాయి. పక్కనే ఉన్న అతని తమ్ముడు బిరుసు గణేష్(9)కు ముఖం, ఛాతీలపై గాయాలయ్యాయి. బాలుడిని 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. అలాగే బాంబుల తయారీ చూద్దామన్న ఆసక్తితో వెళ్లిన మాచర్ల అనిల్‌కుమార్(16)కు కూడా ముఖం, ఛాతీలపై గాయాలయ్యాయి. వైద్యుల సూచన మేరకు అతన్ని విశాఖపట్నం తరలిస్తుండా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనలో ఐదో తరగతి చదువుతోన్న గోక సతీష్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అలాగే అక్కడే ఉన్న పల్లికల సుధీర్, రాకూరి ప్రదీప్, గోలిపల్లి రాజేష్‌కుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వైద్య సిబ్బంది తీరుపై ఆగ్రహం క్షతగాత్రుల వైద్యానికి అవసరమైన మందులను బయట కొనుక్కోవాలని చెప్పడంతో బాధితుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే రాజన్నదొరతో చెప్పారు. అలాగే 108 వాహనంలో డీజిల్ వేయించమంటున్నారని, పేదలమైన తమకు అదెలా సాధ్యమవుతుందని బాధితుల తరఫున వార్డు కౌన్సిలర్ మజ్జి అప్పరావు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే రాజన్నదొర నేరుగా జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మృతు డు గణేష్ తల్లి దండ్రులు అప్పలస్వామి, కళావతిలను పరామర్శించారు. వీరి మరో కుమారుడు బిడ్డ కామేశ్వరరావు తీవ్రంగా గాయపడడంతో మెరుగైన వైద్యసేవలు అందేలా చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. పరామర్శిం చిన వారిలో మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు ఉన్నారు. విచారణ జరిపిన ఏఎస్పీ విషయం తెలుసుకున్న పార్వతీపురం ఏఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ చిన్నవీధిలోని ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించి, విచారణ జరిపారు. పట్టణ ఎస్ఐ మారూఫ్, సీఐ దేముళ్లు ఘటన జరిగిన తీరుతెన్నులను వివరించారు. అనంతరం ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మందుల కొరత, వైద్యుల తీరుపై విచారణ జరిసిస్తాం పార్వతీపురం సబ్‌కలెక్టర్ శ్వేతామహంతి స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడికి ప్రభుత్వాస్పత్రి వైద్యులను రప్పిం చారు. ఆస్పత్రిలో మందులు లేవని చెప్పడంపై, వైద్యుల పనితీరుపై తీవ్ర విమర్శలు వినవస్తున్నాయని మండిపడ్డారు. చిన్నపాటి ప్రమాదానికి కూడా కనీస ప్రథమ చికిత్స కూడా చేయకుండా రిఫర్ చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని ఈ విషయమై విచారణ జరిపిస్తామన్నారు. రూ 5.లక్షలు పరిహారం ఇవ్వాలి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహా రం ఇవ్వాలని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని మెరుగైన వైద్య సేవలు అందివ్వాలని వైద్యులను ఆదేశించారు. క్షతగాత్రులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పరిహారం అందివ్వాల్సిన అవసరముందన్నారు. వయసు తక్కువగా ఉందని సాయమందించేందుకు వెనుకాడకూడదని, ఆపద్భం ధు పథకంతోపాటు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందేలా చూస్తామన్నారు. ఆడుకుంటున్నాడనుకుని... నీటికి వెళ్లాను...’ మృతుడు గణేష్ తల్లి కళావతి రోదన చూసి అక్కడి వారు చలించిపోయారు. ‘ఆడుకుంటున్నాడని.. నీటికి వెళ్లా ను..’ ఇంతలో ఘోరం జరిగిపోయిందంటూ ఆమె రోది స్తున్న తీరు అందరికీ కంట నీరు తెప్పించింది. మరోబిడ్డ కామేశ్వరరావునైనా కాపాడండయ్యా అంటూ ఆ దంపతులు రోదించడం కలిచివేసింది. వీరికి మరో ముగ్గురు పిల్లలుండగా అందులో పెళ్లీడు వయసున్న ఆడపిల్ల ఉంది. అందొచ్చాడనుకుంటే... అలాగే మరో మృతుడు అనిల్‌కుమార్ తల్లి మరియమ్మ వేదన వర్ణనాతీతంగా మా రింది. ‘భర్త దూరమైనా నిబ్బరంతో పిల్లలను పెంచుకున్నాను. అందుకొచ్చావనుకుంటే అందనంత దూరం వెళ్లిపోయావా’ అంటూ ఆమె గుండెలవిసేలా రోదించా రు. ఆమెకు ఇద్దరు కుమారులు.


