breaking news
districts development
-
4 ‘ఐ’లపైనే దృష్టి: మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ శనివారం దేశవ్యాప్తంగా ఉన్న వెనుకబడిన బ్లాక్‌ల అభివృద్ధి కోసం ఉద్దేశించిన అభిలషణీయ బ్లాక్ పథకం(అస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం)ను ప్రారంభించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి పథకంలో మాదిరిగానే ఈ కార్యక్రమంలో కూడా భారత్ అభివృద్ధికి నాలుగు స్తంభాలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్(మౌలికరంగం), ఇన్వెస్ట్మెంట్(పెట్టుబడి), ఇన్నోవేషన్(ఆవిష్కరణ), ఇంక్లూజన్(సమ్మిళితం)లపైనే దృష్టి సారించాలన్నారు. రాష్ట్రాల చీఫ్ సెక్రటరీల రెండో జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధాని శనివారం ప్రసంగించారు. ప్రపంచ సప్లై చైన్‌ను స్థిరతను సాధించేందుకు దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయన్నారు. ఇందుకోసం చిన్న, మధ్య శ్రేణి పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ విషయంలో రాష్ట్రాలే చొరవచూపాలన్నారు. అసంబద్ధ అనుమతులు, కాలం చెల్లిన చట్టాలు, నిబంధనలను పక్కనబెట్టాలని చీఫ్ సెక్రటరీలను కోరారు. -
వెనకబడ్డ జిల్లాల అభివృద్ధికి కృషి
సాక్షి, అమరావతి: వెనకబడ్డ జిల్లాల్లో అభివృద్ధిపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కలెక్టర్లు తదితరులతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. వివిధ అంశాల్లో ప్రగతిపై నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా తమ తమ జిల్లాల్లో ప్రగతిని ఆయా జిల్లాల కలెక్టర్లు వివరించారు. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాల కొండయ్య, పాఠశాల విద్యా శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్, ఐ అండ్ పీఆర్ కమిషనర్ టి విజయ్‌కుమార్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సుపరిపాలనకు రోడ్‌మ్యాప్
► రాబోయే పదేళ్లకు ప్రణాళికలు రూపొందించండి ► కొత్త కలెక్టర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం ► జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితాలు ప్రజలకు అందాలి ► ప్రతి జిల్లాకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలి ► అవినీతి అంతం కావాలి.. లంచం ఇవ్వకుంటే పనికాదన్న భావన పోవాలి.. రైతులు అడగ్గానే ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాలి ► విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించాలని సూచన ► రాబోయే పదేళ్లకు ప్రణాళికలు రూపొందించండి: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితాలు ప్రజలకు అందేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొత్త కలెక్టర్లు, ఉన్నతాధికారులను ఆదేశించారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలతో చిన్న విభాగాలు ఏర్పడ్డాయని, కలెక్టర్లు, ఇతర అధికారులకు పర్యవేక్షణ సులువైం దని అన్నారు. ‘నో యువర్ డిస్ట్రిక్ట్స్–ప్లాన్ యు వర్ డిస్ట్రిక్ట్’ (మీ జిల్లా గురించి తెలుసుకోండి.. మీ జిల్లాకు ప్రణాళిక రూపొందించండి) అన్న నినాదంతో జిల్లాల వారీగా ప్రణాళికలు తయారు కావాలని సూచించారు. స్థానిక వనరులు, అవసరాలను గుర్తించి ఏ జిల్లాలో ఏం చేయాలనే విషయంపై అవగాహనకు రావాలని పేర్కొన్నారు. రాబోయే 8–10 ఏళ్లకు ప్రణాళిక సిద్ధం చేసి ఇప్పట్నుంచే పని ప్రారంభించాలని ఆదేశించారు. అడ్డదిడ్డంగా కాకుం డా ఓ పద్ధతి ప్రకారం పాలన సాగేందుకు అవసరమైన రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలన్నారు. పరిపాలనా విభాగాల పునర్వ్యవస్థీకరణ జరిగిన నేపథ్యంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం క్యాంపు కార్యాలయంలో సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీనియర్ అధికారులు బీపీ ఆచార్య, నర్సింగ్‌రావు, శాంతికుమారి, జనార్దన్‌రెడ్డి, రాహుల్ బొజ్జా, కరుణ, రఘునందన్, సత్యనారాయణరెడ్డి, స్మితా సబర్వాల్, ప్రియాంక వర్గీస్, భూపాలరెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఆదర్శంగా ఎర్రవల్లి, నర్సన్నపేట ‘‘నేను దత్తత తీసుకున్న ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో ‘అందరి కోసం అందరం’ అనే దృక్పథంతో సామూహిక వ్యవసాయం చేస్తున్నాం. ఆ గ్రామాలను తెలంగాణకు ఆదర్శంగా నిలుపుతాం. వాటి స్ఫూర్తితో మిగతా గ్రామాలు బాగుపడాలన్నది నా ఉద్దేశం’’ అని సీఎం అన్నారు. ‘‘రాష్ట్రంలో ఏ శాఖ ద్వారా ఏ కార్యక్రమం అమలవుతోంది. దాని లక్ష్యాలు.. ఉద్దేశాలేంటి? కలెక్టర్ల ద్వారా ఆశిస్తున్నదేంటి? సంక్షేమ కార్యక్రమాల అమలుకు కలెక్టర్లు తీసుకోవాల్సిన చర్యలేంటి? తదితర అంశాలపై చర్చించేందుకు త్వరలోనే కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తాం’’ అని తెలిపారు. కలెక్టర్లందరూ పద్ధతిగా పని చేయాలి ‘‘కొత్త జిల్లాలకు కలెక్టర్లుగా వెళ్లిన వారంతా యువకులు. పని చేయాలనే ఉత్సాహంతో ఉన్నారు. వీరందరూ పద్ధతి ప్రకారం ఒకే స్ఫూర్తితో పని చేస్తే అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. ప్రజలు మార్పును గమనిస్తారు’’ అని సీఎం అన్నారు. సీనియర్ అధికారులు యువతరానికి సలహాలు సూచనలు ఇవ్వాలని, మార్పు తీసుకొచ్చే పనిలో కలెక్టర్లే సమన్వయ కర్తలుగా ఉండాలన్నారు. ‘‘జిల్లా పరిధిలో ఏ శాఖ ద్వారా ఏ కార్యక్రమం జరిగినా వాటిని కలెక్టరే పర్యవేక్షించాలి. కొత్త పాలనా విభాగాలు రావటంతో పనిభారం తగ్గింది. ఆ మేరకు పనితీరులో ప్రభావం, సమర్థత కనిపించాలి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతీ ఒక్కరికి అందేలా చూడాలి. కుటుంబం ప్రాతిపదికగా కార్యక్రమాలు అమలు చేయాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ప్రణాళికకు అనుగుణంగా నిధులు ‘‘ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన వనరులుంటాయి. ఒక్కో ప్రాంత ప్రజలకు ఒక్కో రకమైన అవసరాలుంటాయి. వాటికి తగినట్లు మన ప్రణాళిక ఉండాలి. అధికారులు ముందుగా జిల్లా సమగ్ర స్వరూపాన్ని తెలుసుకోవాలి. అవసరాలు గుర్తించి, వనరులను ఉపయోగంలోకి తేవాలి’’ అని సీఎం సూచించారు. ప్రతీ జిల్లాకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని వివరించారు. అవినీతిని రూపు మాపాలి ‘‘రాష్ట్రంలో అవినీతి, రుగ్మతలు పో వాలి. డబ్బులివ్వకపోతే పనికాదనే భావన పోవాలి. రెవెన్యూ, మున్సిపాలిటీ, సర్వే విభాగాల్లో లంచం ఇవ్వకుండా పని జరి గితే ప్రజలకు అవినీతి రహిత పాలన అం దినట్లు లెక్క’’ అని సీఎం అన్నారు. ‘‘ట్రాన్స్ఫార్మర్లు కోరిన వెంటనే రైతులకు చేరాలి. రెవెన్యూ కార్యాలయాల్లో మ్యుటేషన్లు, పహాణీ నకళ్లు, సర్టిఫికెట్లు సకాలం లో అందాలి. గ్రామాల్లో గుడుంబా మహమ్మారి పారిపోవాలి. ప్రజల ఆరోగ్యం మెరుగుపడాలి. రైతులకు ప్రభుత్వం అం డగా నిలుస్తుంది. అధికారులు అదే స్ఫూర్తి తో సహకరించాలి. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించే ప్లాన్ చేయాలి. గిట్టుబాటు ధర అందేలా చూడాలి. వ్యవసాయ శాఖ అవసరమైన సూచనలు, సలహాలు అందించాలి. ఆ శాఖలో కొత్తగా నియమితులయ్యే ఉద్యోగుల సేవలను క్షేత్రస్థాయిలో బాగా ఉపయోగించుకోవాలి. తప్పు ఎక్కడ జరుగుతుందో కనిపెట్టి నివారించగలగాలి. టీఎస్ ఐపాస్ తరహాలో ఎప్పుడు ఎక్కడ ఏం జరగాలనే స్పష్టత ఉండాలి. విధాన రూపకల్పన ఎంత బాగున్నా.. దాన్ని అమలు చేసేందుకు సరైన దృక్పథం లేకుంటే పథకాలు సత్ఫలితాలు ఇవ్వవు. అందుకే అనుసరించే దృక్పథమే కీలకం’’ అని అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
సహకార సంఘాలు బలోపేతం కావాలి
ఒంగోలు : సహకార సంఘాలు బలోపేతం కావాలని పీడీసీసీ బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్‌బాబు అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక పీడీసీసీ బ్యాంకు సమావేశమందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 67 ప్రాథమిక సహకార సంఘాల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుకు రూ. 6 లక్షల ప్రోత్సాహకాన్ని ఆయన ఈ సందర్భంగా అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో సహకార సంఘాల పరిస్థితిపై సర్వే జరుగుతుందన్నారు. సంఘాలు కేవలం రుణాలపైనే ఆ«ధారపడకుండా ధాన్యం, కందుల కొనుగోలు, ఇతరత్రా వ్యాపారాల ద్వారా కూడా ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి సహకార సంఘం కేవలం మూడు నెలలపాటు కష్టపడి ధాన్యం కొనుగోలు ద్వారా కోటిరూపాయల ఆదాయాన్ని ఆర్జించిందని, ప్రకాశం జిల్లాలో రావినూతల సొసైటీ చేపడుతున్న వ్యాపారాలను పరిశీలించేందుకు జిల్లాలోని పలు సంఘాలు కూడా సందర్శిస్తున్నాయన్నారు. లేని పక్షంలో మండలానికో సొసైటీ కాదు.. చివరకు నియోజకవర్గానికి ఒక సహకార కేంద్రం ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. జిల్లా సహకారశాఖ అధికారి శ్రీకాంత్ మాట్లాడుతూ కేరళలో ఒక్కో సొసైటీ సీఈవో రూ. 70 వేలకుపైగా జీతం తీసుకుంటున్నారంటే అందుకు కారణం వారు చేపట్టిన వ్యాపారా«భివృద్ధే అన్నారు. కనుక జిల్లాలోని సహకార సంఘాల సీఈఓలు కూడా వారి పరిధిలోని ప్రజల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలుస్తూ వ్యాపారాన్ని పెంచుకోవాలని, తద్వారా వారు కూడా ఆకాశమే హద్దుగా జీతాలు తీసుకునే సౌలభ్యం ఏర్పడుతుందన్నారు. డీఆర్ ఓఎస్డీ శీతారామయ్య మాట్లాడుతూ జిల్లాలో 35 సంఘాలు బలహీనంగా ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, వాటిని బలోపేతం చేసేందుకు త్రీమెన్ కమిటీ ఏర్పడిందన్నారు. కొన్ని సంఘాలు జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల రూ. 4 కోట్లకుపైగా రుణాలు పేరుకుపోయాయని, వాటికి ఇక ప్రభుత్వం నుంచి రుణమాఫీ వర్తించే అవకాశమే లేదని న్యాయ పరమైన చర్యలతో వసూలుకు సిద్ధం కావాలని సూచించారు. ఓఎస్డీ రావెళ్ల మోహన్‌రావు మాట్లాడుతూ ఐసీడీపీ ద్వారా రూ. 17 కోట్ల ఆర్థిక సాయాన్ని పొంది సకాలంలో వినియోగించుకున్న 67 సంఘాలకు రూ. 6 లక్షల ఇన్సెంటివ్ వచ్చిందన్నారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈవో కుంభా రాఘవయ్య, డీఆర్ ఇందిరాదేవి, ఐసీడీపీ సీపీవో సుబ్బారావులు పాల్గొని పలు సూచనలు చేశారు.