breaking news
	
		
	
  DGP Additional charges
- 
  
    
                
      ప్రసాదరావుకు డిజిపిగా అదనపు బాధ్యతలు
 - 
      
                   
                               
                   
            ప్రసాదరావుకు డిజిపిగా అదనపు బాధ్యతలు

 హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డెరైక్టర్ జనరల్ డాక్టర్ ప్రసాదరావుకు డిజిపిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీగా దినేష్ రెడ్డి పదవీ కాలం ఈ రోజుతో ముగిసింది. ఈరోజు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రసాదరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
 
 కొత్త డీజీపీగా ప్రసాదరావు పేరు దాదాపుగా ఖరారైందని భావిస్తున్న సమయంలో ప్రస్తుతానికి ఆయనకు అదనపు బాద్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 


