breaking news
Designation President
-
సీనియర్ న్యాయవాదికి షోకాజ్ నోటీస్
న్యూఢిల్లీ: అనుచిత ప్రవర్తన ఆరోపణలెదుర్కొంటున్న సీనియర్ న్యాయవాది రిషి మల్హోత్రాకు షోకాజ్ నోటీసు పంపాలని సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ నిర్ణయించింది. ఆయనకు ఇచ్చిన సీనియర్ హోదాను ఎందుకు తొలగించరాదో తెలిపాలని కోరనుంది. సీనియర్ లాయర్‌కు సుప్రీంకోర్టు ఫుల్‌బెంచ్ ఇలా నోటీసు ఇవ్వడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అధ్యక్షతన జరిగిన సమావేశంలో సుప్రీం జడ్జీలందరూ హాజరై ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. షోకాజ్ నోటీసు ఇవ్వాలని సెక్రటరీ జనరల్ భరత్ పరాశర్‌ను కోరారు. సీనియర్ హోదాను రద్దు చేసుకునేందుకు ముందుగా వాదనను వినిపించేందుకు మల్హోత్రాకు ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 20వ తేదీన ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్‌ల ధర్మాసనం మల్హోత్రా తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఎన్నిసార్లు హెచ్చరించినా కోర్టును తప్పుదోవ పట్టించడం మానుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. శిక్షాకాలం పూర్తి కాకమునుపే ఖైదీలను విడిపించే ప్రయత్రాల్లో భాగంగా వాస్తవాలను దాచినట్లు మల్హోత్రాపై ఆరోపణలు చేసింది. ఆయనకు ఇచ్చిన సీనియర్ గుర్తింపు రద్దు చేసే విషయాన్ని ప్రధాన న్యాయమూర్తికే వదిలేస్తున్నామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఫుల్ బెంచ్ షోకాజ్ నోటీసు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. కాగా, మల్హోత్రాకు సుప్రీంకోర్టు 2024 ఆగస్ట్ 14న సీనియర్ లాయర్ హోదా ఇచ్చింది. -
జపాన్ కొత్త చక్రవర్తిగా నరుహితో
టోక్యో: జపాన్‌కు 126వ చక్రవర్తిగా నరుహితో మంగళవారం అర్ధరాత్రి బాధ్యతలు చేపట్టారు. ఆయన తండ్రి అకిహితో (85) క్రైసెంథమమ్ సింహాసనం నుంచి దిగిపోవడంతో జపాన్‌కు నరుహితో తదుపరి చక్రవర్తి అయ్యారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన రాజ్యం జపాన్. 59 ఏళ్ల నరుహితో బుధవారం శాస్త్రోక్తంగా సింహాసనాన్ని అధిష్టిస్తారు. కొత్త చక్రవర్తిగా నరుహితో బాధ్యతలు చేపట్టడంతో జపాన్‌లో మంగళవారం అర్ధరాత్రి నుంచే రీవా (అందమైన సామరస్యం) శకం ప్రారంభమైంది. నరుహితో చక్రవర్తిగా ఉన్నంతవరకు కాలాన్ని రీవా శకంగా పేర్కొంటారు. అకిహితో 30 ఏళ్లపాటు జపాన్ చక్రవర్తి పదవిలో ఉన్నారు. ఒక చక్రవర్తి పదవి నుంచి తనంతట తాను తప్పుకోవడం జపాన్‌లో గత 200 ఏళ్లలో ఇదే తొలిసారి. పదవి నుంచి దిగిపోయే ముందు ఆయన తన చివరి రాజప్రసంగం చేశారు. జపాన్ ప్రజలకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అకిహితోకు వీడ్కోలు పలికేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. అయితే వర్షం రావడంతో వేడుకలకు విఘాతం కలిగింది. జపాన్ వ్యాప్తంగా ప్రజలు ఈ వేడుకలను పెద్ద తెరలపై వీక్షించారు. అకిహితో చక్రవర్తిగా చాలా బాగా పనిచేశారనీ, కొత్త చక్రవర్తి కూడా ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తాడని తాము విశ్వసిస్తున్నామని పలువురు ప్రజలు తెలిపారు. కాగా, కొన్నిచోట్ల రాచరిక వ్యవస్థను వ్యతిరేకించే వారికి, సమర్థించే వారికి మధ్య స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
‘సారీ’ పేరు మారింది
ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడి హోదాలో తమ సమావేశాలకు హాజరు కావచ్చో లేదో తెలపాలంటూ సెప్టెంబరు 12వ తేదీన బీసీసీఐ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. అయితే అందులో శ్రీనివాసన్ తండ్రి పేరు నటేశన్ అయ్యర్‌గా ప్రస్తావించారు. ఈ పేరుగల వ్యక్తి చెన్నైలో ఓ ప్రముఖ ఆడిటర్. ఎన్.శ్రీనివాసన్ తండ్రిపేరు నారాయణ స్వామి. తర్వాత బోర్డు లాయర్లు కాకతాళీయంగా ఈ పిటిషన్‌ను చూస్తే తప్పు కనిపించింది. వెంటనే లబోదిబో మంటూ మళ్లీ కోర్టుకు పరిగెత్తారు. తమ పిటిషన్లో పేరు తప్పుగా రాసిన విషయాన్ని ప్రస్తావిస్తూ సెప్టెంబరు 23న దానిని సరిదిద్దుకుని తిరిగి మరో పిటిషన్ సమర్పించారు.