-
కరోనా కొత్త రూపాంతరం దడ! ... ఇప్పటి వరకు 25 కేసులు నమోదు!
Deltacron Cases Found In UK: కరోనా వైరస్ కొత్త రూపాంతరం గురించి ప్రపంచ ఆరోగ్య నిపుణులు ఆందోళనకు గురవుతున్నారు. ఇది డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల లక్షణాలను ప్రదర్శిస్తున్నందున డెల్టాక్రాన్‌గా నిపుణలు వ్యవహరించారు. అంతేకాదు డెల్టాక్రాన్‌గా పిలుస్తున్న ఈ హైబ్రిడ్ వేరియంట్‌ని యూకేలో తొలిసారిగా గుర్తించారు. అయితే ఈ వేరియంట్ ఎంతగా వ్యాప్తి చెందుతుంది, ఎంతవరకు ప్రమాదకరమైనది అనే విషయాలను అధికారికంగా ఇప్పటివరకు యూకే నిపుణులు వెల్లడించలేదు. అయితే సెకండ్‌వేవ్‌లో డెల్టా వేగంగా వ్యాపించి ఎంతలా ప్రాణాంతకంగా మారిందో తెలిసిందే. మూడోవేవ్‌లో ఒమిక్రాన్ అంత ప్రభావంతంగా వ్యాప్తి చెందకపోయినప్పటికి మరింత ప్రమాదకారి మాత్రం కాలేదు. అలాగే మరణాల సంఖ్య, కేసుల సంఖ్య తక్కువే. ఈ మేరకు ఈ డెల్టాక్రాన్ వేరియంట్‌ను గత ఏడాది చివర్లో సైప్రస్‌లో లియోనిడోస్ కోస్ట్రికిస్ అనే పరిశోధకుడు మొదటిసారిగా కనుగొన్నారు. యూనివర్శిటీ ఆఫ్ సైప్రస్‌లో పనిచేస్తున్న లియోనిడోస్ కోస్ట్రికిస్ తన బృందం ఈ డెల్టాక్రాన్కి సంబంధించి సుమారు 25 కేసులను గుర్తించినట్లు పేర్కొన్నారు. అంతేకాదు 25 డెల్టాక్రాన్ కేసుల సీక్వెన్సులు జనవరి 7, 2022న వైరస్‌లో మార్పులను ట్రాక్ చేసే అంతర్జాతీయ డేటాబేస్ అయిన GISAIDకి పంపించారు కూడా. కానీ కొంతమంది నిపుణులు మాత్రం ఇది "ల్యాబ్ ఎర్రర్‌గా" తోసిపుచ్చారు. ఈ క్రమంలో ఇంపీరియల్ కాలేజ్ లండన్ బార్క్లే లాబొరేటరీలో పరిశోధనా సహచరుడు థామస్ పీకాక్ కూడా డెల్టాక్రాన్ అంత ప్రభావవంతమైనది కాదని స్పష్టంగా తెలుస్తుందని అన్నాడు. కానీ కోస్ట్రికిస్ తన వాదనను సమర్థించటమే కాక కరోనా వైరస్ కొత్త రూపాంతరం అయిన ఈ హైబ్రిడ్ వేరియంట్ డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్ల కంటే వేగంగా వ్యాపిస్తుందంటూ హెచ్చరిస్తున్నాడు. మరోవైపు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒమిక్రాన్ వేరియంట్ చాలా దేశాల్లో వేగంగా సంక్రమించే అత్యంత ప్రమాదకర వేరియంట్‌గా ఉందని పేర్కొనడం గమనార్హం. (చదవండి: కుక్క గర్భవతి అనుకుని ఆసుపత్రికి తీసుకెళ్లాడు... ఆశ్చర్యపోయిన వైద్యులు) -
Deltacron: మరో కొత్త వేరియంట్ డెల్టాక్రాన్!
కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌తో ఇప్పటికే ప్రపంచం అల్లాడుతుంటే.. మరొకవైపు కొత్త వేరియంట్ వెలుగుచూసింది. సైప్రస్‌లో ఈ వేరియంట్‌ను గుర్తించారు. దీనికి ‘డెల్టాక్రాన్’ అని పేరు పెట్టారు. ఇందులో డెల్టా వేరియంట్ లక్షణాలు, ఒమిక్రాన్ లక్షణాలు ఉండటంతో ప్రస్తుతానికి డెల్టాక్రాన్‌గా పేరుపెట్టారు. ఇంకా శాస్త్రీయంగా పేరుపెట్టాల్సి ఉంది. అయితే కొత్త రకం వేరియంట్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెపుతున్నారు. మరోవైపు డెల్టాక్రాన్ వేరియంట్ ప్రభావం ఎంత ఉంటుందో ఇప్పుడే చెప్పాలమని మరికొందరు అంటున్నారు. సైప్రస్‌లో సేకరించిన నమూనాల్లో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లకు సంబంధించిన 10 మ్యూటేషన్లు గుర్తించినట్లు తెలుస్తోంది. కరోనా చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన బాధితుల నుంచి కొన్ని నమూనాలు, సాధారణ జనం నుంచి కొన్ని నమూనాలు సేకరించిన తర్వాత దీనిని కనుగొన్నారు. కాగా, దీని మ్యూటేషన్ల స్థాయి ఎక్కువగా ఉందని ఈ వేరియంట్‌ను కనుగొన్న సైప్రస్ యూనివర్శిటీ వైరాలజీ నిపుణుడు లియోండస్ కోస్టిక్రిస్ తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ అరుదైన పురస్కారం
మండుటెండను లెక్కచేయని అభిమానం...!
ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
మండుటెండను లెక్కచేయని అభిమానం..!
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
మరోసారి పీఠమెక్కేదెవరో..?
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
Actor Nani HD Stills: వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement