breaking news
deficted mlas
-
రాజీనామా చేశారని లీకులెందుకు?: వైవీ సుబ్బారెడ్డి
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జీవితమంతా ఎమ్మెల్యేలను కొనడమేనని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించటం ఏపీ సీఎంకు కొత్తకాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. చంద్రబాబు దిగజారుడుతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరి కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన నలుగురు ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, అమర్నాథ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, సుజయ్ కృష్ణ రంగారావు ఒకవేళ నిజంగానే రాజీనామా చేస్తే ఆమోదించాలన్నారు. అయితే ఆ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని లీకులివ్వడమేంటని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన నేతలకు ఏపీ కేబినెట్ లో చోటు కల్పించడం దారుణమని పేర్కొన్నారు. ఫిరాయింపుల అంశంపై రెండు, మూడు రోజుల్లో రాష్ట్రపతి, ప్రధానిని కలుస్తామని చెప్పారు. ఈ నెల 7న అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అన్ని పార్టీల నేతలను కలిసి ఏపీలోని పరిస్థితులను వివరించనున్నట్లు తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు అనైతికమని, ఫిరాయింపుల వ్యవహారం ఒక్క పార్టీకి సంబంధించినది కాదని చెప్పారు. పార్టీ మారిన వారిపై నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 7న అన్ని నియోజక వర్గాలలో వైఎస్సార్ సీపీ చేపట్టనున్న ధర్నాలకు అందరు మద్దతివ్వాలని.. ప్రజాస్వామ్యవాదులంతా కలిసి రావాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. -
రాజీనామా చేశారని లీకులెందుకు?
-
ఇంతకీ రాజీనామా చేశారా.. లేదా?
-
ఇంతకీ రాజీనామా చేశారా.. లేదా?
వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రి పదవులు కట్టబెట్టారు. అయితే, అసలు వీళ్లు తమ పదవులకు రాజీనామాలు చేశారా లేదా అన్న విషయం మాత్రం ఇంతవరకు తెలియడం లేదు. నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్లుగా వదంతులైతే వస్తున్నాయి గానీ, ఎక్కడా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం లేదు. వాళ్ల రాజీనామా లేఖలు ముఖ్యమంత్రి వద్ద ఉన్నాయా, అసెంబ్లీ స్పీకర్ వద్ద ఉన్నాయా అన్న విషయం కూడా తెలియడం లేదు. ఎవరైనా సరే పార్టీ మారినప్పుడు ముందు తామున్న పార్టీ ద్వారా సంక్రమించిన అన్ని పదవులకు రాజీనామా చేయడం పద్ధతి. అలా చేయించకపోగా.. మొత్తం 21 మంది ఎమ్మెల్యేలకు పచ్చ కండువాలు కప్పి తమ పార్టీలోకి తీసుకున్న చంద్రబాబు నాయుడు.. వాళ్లలో నలుగురిని ఏకంగా కేబినెట్లోకి తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటివాళ్లు సైతం.. అసలు ఇది ఏ పార్టీ మంత్రివర్గం అని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. సొంత పార్టీలో బోలెడంత మంది సీనియర్లు, ఆశావహులు కూడా ఉన్నప్పటికీ వాళ్లందరినీ కాదని నలుగురు వేరే పార్టీ ఎమ్మెల్యేలకు పదవులు ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇప్పుడు వాళ్ల రాజీనామాలపై సరికొత్త డ్రామాకు చంద్రబాబు తెరతీశారు. సాంకేతికంగా వాళ్లు రాజీనామా చేసినట్లు చూపించి, వాటిని స్పీకర్ ఇంకా ఆమోదించనట్లుగా చెబితే సరిపోతుందని చూస్తున్నట్లు తెలుస్తోంది. తామైతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసినట్లు వాళ్లు చెప్పుకోవడానికి ఒక అవకాశం కల్పించడం, ఆ రాజీనామా లేఖలను తమ వద్దే ఉంచుకోవడం ద్వారా మళ్లీ ఎన్నికలు వచ్చేవరకు వాళ్ల పదవులను భద్రంగా ఉంచడం అనే వ్యూహాన్ని టీడీపీ నేతలు అమలుచేస్తున్నారని అంటున్నారు. అసలు నిజంగా ఈ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారా లేదా అన్న విషయం కూడా ఇంతవరకు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. దాంతో రాష్ట్ర రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన నలుగురు ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, అమర్నాథ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, సుజయ్ కృష్ణ రంగారావు రాజీనామా చేశారా లేదా అనే విషయాన్ని స్పీకర్ కార్యాలయం కూడా ఇంతవరకు ప్రకటించలేదు. దాంతో ఈ విషయంలో ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతోంది. గతంలో తలసాని శ్రీనివాస యాదవ్ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబట్టిన చంద్రబాబు ఇప్పుడు చేసింది ఏంటని విమర్శిస్తున్నారు.