breaking news
the decision
-
అనుకున్న పనులు పూర్తవుతాయి
అక్టోబర్ 3 నుంచి 9 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) మీ ఆత్మవిశ్వాసం పాళ్లు పెరగడం మూలంగా మీ శక్తి సామర్థ్యాలు ఇనుమడిస్తాయి. ఈ సామర్థ్యాన్ని, తెలివితేటలను ఉపయోగించి పెండింగ్ పనులు పూర్తి చేయండి. ఏవిషయంలోనూ సరైన నిర్ణయం తీసుకోకుండా ఊగిసలాడే మీ ధోరణిని మాని, బాధ్యతగా పని చేయండి. తలిదండ్రులు, భార్య, పిల్లల పట్ల ప్రేమగా, బాధ్యతగా మెలగండి. కలిసొచ్చే రంగు: బ్లూ టారస్ (ఏప్రిల్ 21-మే 20) జీవితంలో సంభవించనున్న భారీ మార్పులకు ఈ వారంలో పునాది పడుతుంది. ఎప్పుడు టూర్లో ఉంటారో, ఎప్పుడు ఇంట్లో ఉంటారో తెలియనంతగా టూర్లకు తిరగాల్సి వస్తుంది. అనుకోని సంఘటనల వల్ల ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. పెండింగ్ పనులు పూర్తి చేయడం కోసం మీ శక్తి సామర్థ్యాలన్నింటినీ ఒడ్డాల్సి రావచ్చు. కలిసొచ్చే రంగు: రెడ్ జెమిని (మే 21-జూన్ 21) మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలనే ఇస్తాయి. అయితే మీరు బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం అవసరం. ఆకస్మిక ప్రయాణం ఉండవచ్చు. మీరు మనసులో చేస్తున్న ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీ సలహాల వల్ల కొందరు బాగుపడతారు. ఈ వారం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. కలిసొచ్చే రంగు: పాచిరంగు క్యాన్సర్ (జూన్22-జూలై 23) గతాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి, వర్తమానంలో జీవించడం మంచిది. త్వరలో మిమ్మల్ని విజయం వరిస్తుంది. వారసత్వపు ఆస్తి ద్వారా మీకు కొంత డబ్బు చేతికందుతుంది. ఆ వచ్చిన డబ్బును కొత్త ప్రాజెక్టులో మదుపు చేయాలన్న ఆలోచన చేస్తారు. మీ ఆలోచన ఫలిస్తుంది. మీ కెరీర్‌కు ఇది మంచి మలుపు అవుతుంది. ఇది మీకు అనుకూల సమయం. కలిసొచ్చే రంగు: ఎలో లియో (జూలై 24-ఆగస్టు 23) రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ధైర్యంగా రిస్క్ తీసుకుని పని చేస్తే మీకు అంతా సానుకూలమవుతుంది. పెద్ద ముందడుగు వేసే ముందు అది పాతాళంలోకి కూరుకుపోయేలా చేస్తుందో, ఆకాశంలోకి ఎగిరేలా చేస్తుందో మనకు తెలియదు కదా! ఈ వారం ప్రోత్సాహకరమైన వార్తలు అందుతాయి. మాంచి రొమాన్స్ కూడా ఉండచ్చు. కలిసొచ్చే రంగు: పీచ్ వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీకోసం ఒక మంచి వార్త ఎదురు చూస్తుంటుంది. అయితే ఆ వార్తలోని అంశం కన్నా, ఆ వార్తను అందించే వారే మీకు ముఖ్యం. పనిప్రదేశంలో చాలాకాల ంగా మీరు పడుతున్న ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంతకాలంగా మీకు ఉన్న ప్రతికూలతలన్నీ అనుకూలతలుగా పరిణమిస్తాయి. వారంలో విస్తృతంగా ప్రయాణాలు ఉండ చ్చు. కలిసొచ్చే రంగు: ఆరంజ్ లిబ్రా(సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) మీ క ష్టాలు, కడగండ్లను కాసేపు పక్కన బెట్టి కెరీర్ మీద దృష్టి పెడ్టడం మంచిది. మీ పనిని సాధ్యమైనంత వేగంగా, సంతోషంగా చేయండి. అవే సానుకూలపడతాయి. మీకున్న ఆర్థిక వనరులను పరిపుష్టం చేసుకుంటారు. స్నేహితులు, బంధువులు, కుటుంబంతో ఉన్న సామరస్యత ఇందుకు ఉపకరిస్తుంది. కలిసొచ్చే రంగు: బ్లూ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) కెరీర్ పరంగా మీరు తీసుకున్న ఒక నిర్ణయం మీ జీవితాన్నే మలుపు తిప్పవచ్చు. గతజ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. కొద్దిపాటి ఒడుదొడుకులున్నా, జీవితం సాఫీగానే నడుస్తుంది. మీరు చేసిన పనులన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. అనవసర ఆందోళన మాని పనిని చేపట్టండి. కలిసొచ్చే రంగు: వ యొలెట్ శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల మూలంగా మీరు ఎంతో కోల్పోయినట్లుగా, నష్టపోయినట్లుగా భావిస్తారు కానీ, అంతే మొత్తంలో ఆదాయం కూడా లభించినట్లు తెలుసుకుని ఊరట పొందుతారు. ఆత్మీయులైన కొందరు తమ సూచనలు, సలహాలతో మిమ్మల్ని మంచి దారిలో నడిపిస్తారు. అవివాహితులకు వివాహ సూచనలు కనిపిస్తున్నాయి. కలిసొచ్చే రంగు: బ్రౌన్ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) కొన్ని బంధాలు, బంధుత్వాలు, సంబంధీకుల మూలంగా ఏర్పడ్డ సమస్యలు పరిష్కారమవుతాయి. మీ కోరిక నెరవేరుతుంది. మీ అచంచలమైన కృషితో కెరీర్ కలను సాకారం చేసుకుంటారు. కాంట్రాక్టు వ్యవహారాలలో అప్రమత్తత అవసరం. ఒప్పంద పత్రాలపై గుడ్డిగా సంతకాలు చేయవద్దు. కలిసొచ్చే రంగు: లెమన్ ఎల్లో పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20) కెరీర్ పరంగా మీరు కన్న కలలను, కోరికలను నెరవేర్చుకుంటారు. మీ మొండితనాన్ని తగ్గించుకోవడం మంచిది. మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. మీరు చేసే ఒక ప్రయాణం మూలంగా ప్రయోజం పొందుతారు. శుభవార్తలు వింటారు. అపరిచితులను గుడ్డిగా నమ్మవద్దు. క లిసొచ్చేరంగు: ఆరంజ్ ఇన్సియా కె.టారో అండ్ ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) అనుకున్న పనులు పూర్తవుతాయి. వాటి గురించి దిగులు పడక్కర్లేదు. బంధువులు వస్తూపోతూ ఉండే కారణంగా ఆత్మీయబంధం బాగుంటుంది. కొంత పెట్టుపోతలకు వ్యయం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికంగా ఆలోచించుకుని ఉండడం మంచిది. ఒక అనుకోని పని ద్వారా ఆదాయం లభించే అవకాశం వుంది. కాబట్టి ఇబ్బంది పడే పరిస్థితి లేదు. టారస్ (ఏప్రిల్ 21-మే 20) దైవకార్యాల పట్ల ఆసక్తీ, ఆధ్యాత్మిక ప్రసంగాల విషయంలో ఇష్టం, యధాశక్తి దానధర్మాలు చేయాలనే బుద్ధీ కలుగుతుంది. ఇది మంచి పరిణామం! ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు చేతికందే అవకాశముంది. గతంలో ప్రారంభించిన పనులు కొంతవరకు నెరవేరే వీలుంది. అయితే ఈవారంలో చేసే కొత్త ప్రయత్నాల వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. జెమిని (మే 21-జూన్ 21) ఎందుకో తెలీకుండా అనవసర వ్యయం వచ్చిపడుతుంది. తప్పనిసరి వ్యయమైన కారణంగా పొదుపు చేసుకున్న సొమ్ము నుండి తగ్గుదల తప్పదు. ఈవారంలో మీ విలువైన సమయం ధనం... దాదాపుగా సద్వినియోగమవుతుందనే చెప్పాలి. మీ సంయమన స్వభావం మీకు మనోధైర్యాన్ని ఇస్తుంది. క్యాన్సర్ (జూన్22-జూలై 23) ఎంత ప్రయత్నించినా, మీ మానాన మీరు పోతున్నా ఏదో ఒక చిక్కు ఎదురవడం, మీ గురించి అపనింద ఒకటి ప్రచారంలోకి రావడంవల్ల మానసికంగా కొంత వ్యధపడే అవకాశముంది. చేసిన పనినే తిరిగి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి బాగా ఆలోచించిన మీదనే ఏ పనినైనా చేపట్టండి. ఏదేమైనా ఈవారం అంత గొప్పగా లేదనుకుని ధైర్యంతో ఉండడానికి సిద్ధంకండి. లియో (జూలై 24-ఆగస్టు 23) ప్రస్తుత గ్రహస్థితి కారణంగా ప్రతిపనీ వాయిదా పడుతూ, చివరి క్షణం వరకూ కూడా అవుతుందా? కాదా? అనే మనోవ్యధ ఉన్నా, చివరికి పూర్తవుతుంది. చేస్తున్న పనినిగానీ, వృత్తిని గానీ, స్థలాన్ని గానీ మార్చడం ఈ మాసంలో అనుకూలం కాదు. బయటి వ్యక్తుల మాటలను వినకుండా కుటుంబ సభ్యుల్ని దృఢం చేసుకోవడం అవసరం. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) ఏవిధమైన అనారోగ్యం లేకున్నా, ఉందేమోననుకునే భయం; ఎక్కడీ వెళ్లడం మీకిష్టం లేకున్నా, అవసరం లేకున్నా ‘ఊరు మారడం మంచిదేమో’ అనే భయంతో కూడిన ఊహ రావచ్చు. ఆవిధమైన ఆలోచనే సరికాదని గ్రహించండి. ఓ క్షణంలో ఎంతో ధైర్యంతో ఉండి, మరుక్షణం లోనే తెలియని అధైర్యంతో ఉంటారు. అయితే ఏ హానీ, వ్యతిరేకతా జరగదని గ్రహించండి. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ఈవారం మీకు అనుకూలంగా ఉండొచ్చు. అనుకున్న ఆలోచనలన్నీ అమలయ్యేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. కుటుంబ విషమ సమస్య ఒకటి మనసును తొలుస్తూనే, వాయిదా పడుతూ వెళ్తుంది. ఓ గట్టి సమస్యకి పరిష్కారాన్ని వెదికే సమయంలో ‘తొందరపడి ఓ నిర్ణయం తీసుకున్నారేమో’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం మంచిది. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) కోపాన్ని ప్రదర్శించడానికి సమయాన్ని, సందర్భాన్నీ గమనించుకోవలసి ఉండడమే కాక, మీ భావాన్ని సున్నితంగా వ్యక్తీకరించవలసిన అవసరం ఉంది. లోపల హాలాహలం దాగినా పైకి ప్రశాంతంగా కన్పించే తీరుగా ద్విపాత్రాభినయం చేయని పక్షంలో చిక్కులు తప్పవు. మీ ప్రతిపనినీ గమనిస్తూ శత్రువులున్నారనే యదార్థాన్ని గ్రహించండి. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) వ్యవసాయదారులకు మంచి ఆనందాన్ని కలిగిస్తుంది. కొత్త చదువుల్ని చదవాలనే ఊహలు మీకు కలిగే సమయం ఇది. అవకాశముంటే మీకు ప్రయోజనపడతారనుకున్న పెద్దలకోసం ప్రయాణాలని సిద్ధం చేసుకోవచ్చు. పొగడ్తలకు లొంగిపోవద్దు. నిత్య పూజని మరవద్దు. కలుగుతున్న శుభ పరిణామాలకి అహంకరించవద్దు. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) అనుకున్న కోరిక ఎంతో శ్రమ మీద నెరవేరే అవకాశముంది. ఎవరేమనుకున్నా వాటిని పట్టించుకోకండి. వాటిద్వారా మీ ఏకాగ్రత చెడడమే కాక, మీ వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభని చూపించలేరు. పొదుపు పాటించడం అవసరం. కుటుంబ సభ్యుల మెప్పుకోసం అనవసర ప్రయాణాలూ, కొనుగోళ్లూ వద్దేవద్దు. కొత్త వ్యాపారం మెల్లగా పెరిగే అవకాశముంది. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) గ్రహస్థితి సామాన్యంగా ఉన్న కారణంగా పనుల్లో పెద్ద కదలిక ఉండక, నిరుత్సాహకరంగా అనిపించవచ్చు. కనిపించిన ప్రతి వ్యక్తినీ నమ్మి కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలను చర్చించడం సరికాదు. బంధుమిత్రులెవరైనా మీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోతే, నిర్ద్వంద్వంగా ఖండించడం కాకుండా లౌక్యంగా తప్పించుకోవడం మంచిది. పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) కుటుంబ సభ్యులూ, పెద్దలు కలిసి మీ కుటుంబానికి సంబంధించిన వ్యవహారాన్ని ఒక కొలిక్కి తేవడం మీకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మీనరాశికి చెందిన మీరు భార్య అయితే మీ శ్రీవారికీ, మీరు భర్త అయితే మీ శ్రీమతికీ ఆరోగ్యం విషయంలో అనవసర ఆందోళనపడే పరిస్థితి రావచ్చు. సంతానం చదువులో రాణిస్తూ, మీ ఆనందాన్ని ఇనుమడింపచేస్తారు. -
కేఎంఎఫ్ అధ్యక్షుడిగా రవీంద్ర?
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కర్ణాటక పాడి సమాఖ్య (కేఎంఎఫ్) అధ్యక్షుడుగా దావణగెరె జిల్లా హరపనహళ్లి ఎమ్మెల్యే ఎంపీ. రవీంద్ర ఎన్నిక కావచ్చని తెలిసింది. దివంగత మాజీ మంత్రి ఎంపీ ప్రకాశ్ తనయుడైన రవీంద్రను అభ్యర్థిగా ఎంపిక చేయడంపై సహకార శాఖ మంత్రి హెచ్ఎస్. మహదేవ ప్రసాద్ నివాసంలో రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివ కుమార్, న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్రలు సోమవారం రాత్రి సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ నాయకుడు పీ. నాగరాజ్ కూడా ఆ పదవిని ఆశిస్తున్నందున, వెంటనే నిర్ణయం తీసుకోలేక పోయినట్లు తెలిసింది. రాష్ట్రంలో మొత్తం 13 ప్రధాన పాడి సంఘాలకు డెరైక్టర్లు ఉండగా, వీరిలో 11 మంది కాంగ్రెస్ వారే. ఇద్దరి మధ్య పోటీ ఉన్నందున బుధవారం కేఎంఎఫ్ అధ్యక్ష అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటిస్తామని సమావేశం అనంతరం మహదేవ ప్రసాద్ తెలిపారు. గతంలో కేఎంఎఫ్ అధ్యక్షుడిగా గాలి సోమశేఖర రెడ్డి కొనసాగగా, ఆయన పదవీ కాలం జులై 15తో ముగిసింది. సుమారు 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కు ఈ పదవి దక్కనుంది. కాగా అధ్యక్ష అభ్యర్థి ఎంపికపై తమ పార్టీ మద్దతుదార్లయిన డెరైక్టర్ల అభిప్రాయాలను సేకరించినట్లు మహదేవ ప్రసాద్ తెలిపారు.