breaking news
december 19th
-
19న ఎయిమ్స్‌కు శంకుస్థాపన
విజయవాడ: అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్ర సంస్థ (ఎయిమ్స్) నిర్మాణానికి కేంద్రప్రభుత్వం రూ.16,018 కోట్లు కేటాయించిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 19న మంగళగిరిలో ఎయిమ్స్ శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి చెప్పారు. మొత్తం 193 ఎకరాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎయిమ్స్ నిర్మాణం జరుగుతుందని వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతారని ఆయన తెలిపారు. -
19న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు
హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుటుంబంపై కేంద్ర ప్రభుత్వ వేధింపులకు నిరసనగా ఈ నెల 19న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన తెలపాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క నాయకులకు పిలుపునిచ్చారు. దేశంకోసం ప్రాణాలను అర్పించిన నెహ్రూ, గాంధీ వారసులను ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం వేధించాలని కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఇలాంటి వాటికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడబోమని ఉత్తమ్, భట్టి తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనాలని ఉత్తమ్ కోరారు.