19న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు | telangana congress party protests on all consistency on december 19th | Sakshi
Sakshi News home page

19న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు

Dec 13 2015 9:13 AM | Updated on Mar 18 2019 7:55 PM

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుటుంబంపై కేంద్ర ప్రభుత్వ వేధింపులకు నిరసనగా ఈ నెల 19న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది.

హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుటుంబంపై కేంద్ర ప్రభుత్వ వేధింపులకు నిరసనగా ఈ నెల 19న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన తెలపాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క నాయకులకు పిలుపునిచ్చారు. దేశంకోసం ప్రాణాలను అర్పించిన నెహ్రూ, గాంధీ వారసులను ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం వేధించాలని కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఇలాంటి వాటికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడబోమని ఉత్తమ్, భట్టి తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనాలని ఉత్తమ్ కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement