-
రెండేళ్ల తర్వాత తల్లిని కలుసుకున్న హీరోయిన్..
Nikamma Debutante Shirley Setia Meet Her Mother After 2 Years: యంగ్ హీరో నాగశౌర్య నటించిన 'కృష్ణ వ్రిందా విహారి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ప్రముఖ న్యూజిలాండ్ సింగర్ షిర్లీ సేథియా. తాజాగా 'నికమ్మ' అనే మూవీతో బాలీవుడ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలో శిల్పా శెట్టి కుంద్రా, అభిమన్యు దాసాని కూడా నటించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే షిర్లీ వాళ్ల అమ్మను కలిసి సుమారు రెండేళ్లు అవుతుంది. రెండేళ్ల తర్వాత తాజాగా తన తల్లిని కలుసుకుంది షిర్లీ సేథియా. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నుంచి ఇండియాకు వచ్చిన తన తల్లిని రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లింది షిర్లీ. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో పుట్టిపెరిగిన షిర్లీ, సినీ పరిశ్రమలో ప్రవేశించాలన్న తన తల్లి కోరికను నెరవేర్చినందుకు ఆమె ఇండియాకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే తన కూతురును వెండితెరపై చూసేందుకు షిర్లీ తండ్రి ఈ వారం చివర్లో వస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి షిర్లీ మాట్లాడుతూ 'నా సినిమా విడుదల కానున్న సందర్భంగా నా తల్లిదండ్రులు నావైపు నిలబడేందుకు ఇండియాకు వస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేను వారిని కొవిడ్‌కు ముందు 2020లో చివరిసారిగా కలిశాను. చాలాకాలం గడిచింది. ఈ జూన్ 17 నాకు చాలా పెద్ద రోజు.' అని తెలిపింది షిర్లీ సేథియా. చదవండి: డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు.. పార్టీ లోపలి వీడియో వైరల్.. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
హీరోను తెగ పొగిడేస్తున్న హీరోయిన్
హైదరాబాద్ : భలే భలే మగాడివోయ్ చిత్రం ఇచ్చిన కిక్‌తో మాంచి ఊపు మీదున్న టాలీవుడ్ హీరో నానిని పొగడ్తలతో ముంచేస్తోంది హీరోయిన్ మెహరీన్. అతనితో కలిసి నటించడం తన అదృష్టమని పొంగిపోతోంది. నాని హీరోగా వస్తున్న 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' తో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న మెహరీన్... నానితో వర్క్ చేయడం చాలా అద్భుతమైన అనుభవాన్ని మిగిల్చిందంటోంది. సెట్స్ లో తొలిరోజు తనకు నాని చాలా హెల్ప్ చేశాడని మురిసిపోతోంది ఈ పంజాబీ భామ. ఈ సినిమాలో తమ ఇద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా అద్భుతంగా పండిందని తెలిపింది. నాని నుండి తాను చాలా నేర్చుకున్నానని చెబుతోంది. నానీ హీరోగా వచ్చిన 'ఎవడే సుబ్రహ్మణ్యం, , భలే భలే మగాడివోయ్ లాంటి సినిమాలు చూశాననీ అద్భుతంగా ఉన్నాయంటూ కొనియాడింది. ఆ సినిమాలు చూసిన తరువాత అతనిపై గౌరవం మరింత పెరిగిందని మెహరీన్ ప్రశంసించింది. మరీ ముఖ్యంగా ఈగ సినిమాలోని అతని నటనకు ఫిదా అయిపోయానంటోంది. పనిలో పనిగా దర్శకుడు హను రాఘవపూడిపైన అమ్మడు పొగడ్తలు కురిపించింది. హను విజన్ ఉన్న దర్శకుడని వ్యాఖ్యానించింది. తాను అనుకున్న అవుట్ పుట్ వచ్చేదాకా రాజీ పడకుండా వర్క్ చేయడం అతని ప్రత్యేకత అని చెప్పుకొచ్చింది. రెండు రోజుల పరిశీలన తరువాత తనను ఈ పాత్రకు ఎంపిక చేయడం తన అదృష్టమని పేర్కొంది. ఈ సినిమాలో తాను మహాలక్షి పాత్రలో లంగా వోణీ గెటప్‌లో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తానని చెప్పింది. ఈ అమ్మడు ఇప్పటికే తెలుగు లో రెండు తమిళంలో ఒక ప్రాజెక్టులకు సైన్ చేసి జోరుమీద ఉంది. కాగా అనంతపురం బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ మూవీలో నాని... నందమూరి బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తాడట. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్ మంచి మార్కులు కొట్టేసింది. త్వరలోనే ఆడియో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 5న విడుదల చేయాడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement