breaking news
DE office
-
విద్యుత్ కార్యాలయంలో భారీ చోరీ
తూప్రాన్: డివిజన్ కేంద్రంలోని పోతరాజ్‌పల్లి సమీపంలో రహదారి పక్కన ఉన్న విద్యుత్ డీఈ కార్యాలయంలో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. తూప్రాన్ డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు, విద్యుత్ డీఈ సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం.. డివిజన్ పరిధిలోని గ్రామాల్లో వసూలు చేసిన కరెంట్ బిల్లుల నగదు రూ.16.39 లక్షలను రెండు బ్యాగుల్లో ఉంచి కార్యాలయంలోని లాకర్లో శనివారం రాత్రి భద్రపరిచారు. కార్యాలయం ప్రధాన గేటు తాళాన్ని, లాకర్లను దొంగలు గుణపం సహాయంతో పగలగొట్టి నగదును దోచుకెళ్లారు. కార్యాలయంలోని పై అంతస్తులో నిద్రిస్తున్న సిబ్బంది ఈ విషయాన్ని ఆదివారం ఉదయం గుర్తించి, సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల వేలిముద్రలను క్లూస్ టీమ్ సేకరించినట్లు డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు తెలిపారు. -
డీఈ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు
సుల్తానాబాద్, న్యూస్‌లైన్ : చివరి భూముల్లో వేసిన ఆరుతడి పంటలకు సైతం నీరందడం లేదంటూ స్థానిక ఎస్సారెస్పీ డీఈ కార్యాలయాన్ని శనివారం రైతులు ముట్టడించారు. డీ86 కెనాల్ ఆయకట్టు రైతులు ధర్నాకు దిగారు. రైతుల ధర్నా విషయం తెలుసుకున్న అధికారులు పోలీసులు వచ్చే వరకు కార్యాలయానికి చేరుకోలేదు. పోలీసులు చేరుకున్నాక వచ్చిన డీఈ రాముతో రైతులు వాగ్వాదానికి దిగారు. నీరందక పంటలు ఎండిపోయేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చొప్పదండిలో 1050 క్యూసెక్కుల నీరు వదిలి అన్ని డీపీలు మూసివేస్తే చివరి భూములకు నీర ందుతుందన్నారు. ఉప కాలువలు మూసివేయకపోవడంతో హుస్సేమియా, మానేరువాగులోకి నీరు వృథాగా పోతుందన్నారు. 72 గంటల పాటు 1050 క్యూసెక్కుల నీరు వదులుతామని డీఈ హామీతో రైతులు ఆందోళన విరమించారు. ఆందోళనలో రైతులు పడాల కుమారస్వామి, ఎం.లింగయ్య, కె.మల్లారెడ్డి, రఘుపతి, సమ్మారావు, రవీందర్‌రెడ్డి, మాదన్న, రాజు, రమేశ్, సది, శంకర్, కొమురయ్య, మొండయ్య, రాయమల్లు, కుమార్, శ్రీను, రవి, ఓదేలు పాల్గొన్నార