breaking news
daylight robbery
-
పట్టపగలే చోరీ
వలిగొండ : పట్టపగలు ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలతో పాటు బైక్ ను కూడా ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే... నల్గొండ జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీకి చెందిన దంతూరి సత్తెయ్య అనే వ్యక్తి తన కూమార్తెతో హైదరాబాద్కు వెళ్లారు. కాగా ఇంట్లో సత్తెయ్య భార్య ఒక్కరే ఉన్నారు. అయితే ఆమె కూరగాయల కోసం మార్కెట్కు వెళ్లి వచ్చేసరికి దొంగతనం జరిగింది. ఇంట్లో ఉన్న 2 తులాల బంగారు ఆభరణాలు, ఒక హీరోహోండా బైక్ మాయమయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టపగలు కోఠి బస్టాండ్లో భారీ దోపిడీ