breaking news
date extend
-
‘మనూ’ బీఈడీ దరఖాస్తు గడువు పెంపు
హైదరాబాద్: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాయం(మనూ)లో బీఈడీ కోర్సు(దూర విద్య) ఆన్లైన్ దరఖాస్తును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు డైరెక్టర్ కె.ఆర్.ఎక్బాల్ అహ్మద్ బుధవారం తెలిపారు. ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 5 నుంచి 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. -
ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు గడువు పెంపు
నేటి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు చేపట్టిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ఈరోజు (సోమవారం) సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జేఓఎస్ఏఏ) పేర్కొంది. తొలుత ఈ నెల 5 వరకే వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చిన జేఓఎస్ఏఏ.. ఆదివారం ఉదయం మార్పు చేసిన షెడ్యూలును వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చింది. 7వ తేదీన విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. 8 నుంచి 12వ తేదీ వరకు విద్యార్థుల నుంచి అంగీకారం తీసుకుంటారు.