breaking news
Dara Singh
-
ఏకంగా 20 చిత్రాల్లో.. రిషబ్ శెట్టి కంటే ముందు హనుమాన్‌గా నటించిన నటులెవరో తెలుసా?
హనుమాన్ను కేవలం దైవంగానే కాదు.. పిల్లల దృష్టిలో సూపర్ హీరోగానూ వెండి తెర ఆవిష్కరించింది. ప్రశాంత్ వర్మ ‘హను-మాన్’ చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న జై హనుమాన్ చిత్రంలో కన్నడ నటుడు, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమాన్‌గా కనిపించబోతున్నట్లు మేకర్స్ లుక్ రివీల్ చేశారు. అయితే..గతంలోనూ కొందరు నటులు వెండి తెరపై హనుమంతుడి అవతారంలో ఆడియొన్స్‌ను మెప్పించే ప్రయత్నమూ చేశారు. వాళ్లెవరంటే..దేవ్‌దత్తా నాగేఆదిపురుష్(2023).. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్.. రెబల్ స్టార్ ప్రభాస్‌ను రాముడి(రాఘవ)గా చూపించిన ప్రయత్నం. అయితే ఆకట్టుకోని విజువల్స్, పైగా కంటెంట్ విషయంలోనూ ఆ చిత్రం తీవ్ర విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంది. ఈ చిత్రంలో మరాఠీ నటుడు దేవ్‌దత్తా నాగే.. హనుమంతుడి(భజరంగ్) పాత్రలో నటించాడు. కానీ, ఆ క్యారెక్టర్ కూడా ఇంటర్నెట్లో నవ్వులపాలవ్వడంతో ఆయన కష్టం వృథా అయ్యింది.ఏ. జనార్ధన రావుతెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆంజనేయస్వామి పాత్రలకు రిఫరెన్స్‌గా ఈయన్ని చూపిస్తుంటారు. ఏకంగా 20 చిత్రాల్లో ఆ పాత్రలో నటించారాయన. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టిన జనార్ధన రావు.. 1955లో మిస్టర్ ఇండియా టైటిల్ దక్కించుకున్నారు. కమలాకర కామేశ్వర రావు తీసిన వీరాంజనేయ (1968)చిత్రంలో తొలిసారి ఆయన హనుమాన్ పాత్రలో నటించారు. అయితే తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆ ప్రభావంతో దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు హనుమంతుడి పాత్రల విషయంలో ఆయనకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు దర్శకనిర్మాతలు. అలా.. శ్రీ రామాంజనేయ యుద్ధం, సంపూర్ణ రామాయణం, శ్రీ కృష్ణ సత్య, ఎన్టీఆర్ సూపర్‌మేన్.. చిత్రాలు ఈనాటికి ఆయన హనుమంతుడి రూపాన్ని ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేశాయి. రాజనాలతెలుగు విలన్లలో అగ్రతాంబూలం అందుకున్న తొలి నటుడు.. బహుశా ఇంటి పేరునే స్క్రీన్ నేమ్‌గా మార్చుకున్న తొలి నటుడు కూడా ఈయనేనేమో!(రాజనాల కాళేశ్వర రావు). అయితే 1400కి పైగా అన్ని రకాల జానర్ చిత్రాల్లో నటించిన రాజనాల.. హనుమాన్‌గా కనిపించిన ఒకే ఒక్క చిత్రం ‘శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం’(1972). కానీ, ఆ పాత్రలో మరిచిపోలేని అభినయం కనబర్చారాయన.దారా సింగ్మల్లు యోధుడిగానే కాదు.. ఇటు నటుడిగా, దర్శకుడిగా.. అటు రాజకీయాల్లోనూ రాణించారీయన. ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లో ఏళ్ల తరబడి రాణించిన దారా సింగ్.. ఆ తర్వాత సినీ రంగం వైపు అడుగులేశారు. భజరంగబలి(1976) చిత్రంలో తొలిసారి హనుమాన్‌గా అలరించి.. ఆ తర్వాత రామానంద సాగర్ ‘రామాయణ్’లో హనుమాన్ క్యారెక్టర్లో జీవించి.. భారతీయ బుల్లితెర చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారాయాన. చిరంజీవిఆంజనేయ స్వామికి కొణిదెల శివశంకర్ వరప్రసాద్‌కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అప్పటికే అగ్రతారగా వెలుగొందుతున్న టైంలో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో ఓ ఫైట్ పోర్షన్లో హనుమాన్‌గా అలరించారాయన. అంతేకాదు.. హనుమాన్(2005) యానిమేటెడ్ చిత్రంలో ఆ పాత్రకు తెలుగు వెర్షన్లో వాయిస్ ఓవర్ కూడా అందించారు.నిర్భయ్ వాద్వాతెలుగులో జనార్ధన రావుకు ఎలాగైతే హనుమాన్ క్యారెక్టర్లు గుర్తింపు తెచ్చి పెట్టాయో.. హిందీ టీవీ సీరియల్స్‌లో ఈ యువ నటుడికి అదే విధంగా ఆ పాత్ర మంచి గుర్తింపు ఇచ్చింది. సంకట మోచన్ మహాబలి హనుమాన్(2015-17)లో తొలిసారి హనుమంతుడి పాత్రలో నటించిన నిర్భయ్‌కు.. ఆ తర్వాత మరో రెండు సీరియల్స్‌లోనూ ఆ రోల్ దక్కింది. ఈ ఏడాది ప్రారంభమైన శ్రీమద్ రామాయణ్‌లోనూ ఆయన హనుమాన్ రోల్లోనే నటిస్తున్నారు.ప్రశాంత్ శెట్టిప్రశాంత్ శెట్టి.. ఈ పేరు పెద్దగా ఎవరికీ పరిచయం లేకపోవచ్చు. రిషబ్ శెట్టిగా అప్పటిదాకా కన్నడ ఆడియొన్స్‌ను మాత్రమే అలరిస్తూ వచ్చిన ఈ మల్టీ టాలెంట్ పర్సన్(నటుడు, స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్).. కాంతారతో ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకట్టుకున్నాడు. స్వీయ దర్శకత్వంలో కాంతారను తీసి.. జాతీయ అవార్డుతో పాటు ఫిల్మ్‌ఫేర్, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులనూ దక్కించుకున్నాడు. బహుశా ఆ గుర్తింపే ఆయనకు జై హనుమాన్‌లో హనుమాన్ క్యారెక్టర్ దక్కడానికి ఓ కారణం అయ్యి ఉండొచ్చు కూడా!.ಕನ್ನಡ ನೆಲದ ವರಸುತ ಆಂಜನೇಯನ ಆಶೀರ್ವಾದದೊಂದಿಗೆ ಭಾರತ ಇತಿಹಾಸದ ಸರ್ವಶ್ರೇಷ್ಠ ಭಾವವೊಂದನ್ನು ತೆರೆಯ ಮೇಲೆ ತರಲಿದ್ದೇವೆ.ನಿಮ್ಮೆಲ್ಲರ ಪ್ರೀತಿ ಬೆಂಬಲ ಆಶೀರ್ವಾದ ಎಂದಿನಂತೆ ಸದಾ ಇರಲಿ - ಜೈ ಹನುಮಾನ್A vow from the Tretayuga, bound to be fulfilled in the Kaliyuga🙏We bring forth an epic of loyalty, courage and… pic.twitter.com/Zvgnt1tGnl— Rishab Shetty (@shetty_rishab) October 30, 2024ఇంకా ఎవరైనా నటీనటులను మరిచిపోయి ఉంటే.. వాళ్లు ఏ భాషకు చెందిన వాళ్లైనా సరే కామెంట్ సెక్షన్లో వాళ్ల పేర్లను మీరు తెలియజేయొచ్చు. -
బీజేపీ పెద్దలకు అఖిలేశ్ యాదవ్ గట్టి ఝలక్
-
స్టంట్ హీరో దారా సింగ్...
దారా సింగ్ అంటే రుసుం-ఏ- హింద్. అంతటి పహిల్వాన్ మరొకడు లేడని పేరు. బహుశా అప్పట్లో పండితులు పామరులు అన్న తేడా లేకుండా భారతదేశం అంతటికీ తెలిసిన ఆటగాడు ఇతడొక్కడేనేమో. అమృత్‌సర్‌కు ముప్పై కిలోమీటర్ల దూరంలో పుట్టాడు. ఆరడుగుల 2 అంగుళాల పొడవు, 120 కిలోల బరువు, 53 అంగుళాల విశాలమైన ఛాతీ... పహిల్వాన్‌గా రాణించడానికి ఇంతకుమించి ఏం కావాలి. అయితే దేశంలో ఉండగా ఈ పని సాధ్యం కాలేదు. సింగపూర్‌లో బాబాయి పని చేస్తుంటే అతడితో పాటు వెళ్లి అక్కడ తగిన తిండి దొరికే పరిస్థితి ఏర్పడ్డాక పహిల్వాన్‌గా మారాడు. అప్పటికే ‘హెర్క్యులస్’ వంటి సినిమాలు కలెక్షన్లు కురిపిస్తున్నాయి. ఇండియన్ హెర్క్యులస్ కోసం తమిళ, ఉత్తరాది నిర్మాతలు వెతుకుతున్నారు. దారాసింగ్ వాళ్ల కళ్లల్లో పడ్డాడు. ఎవరో వచ్చి సినిమాల్లో చేస్తావా అడిగితే ‘స్టంట్స్ వరకూ చేస్తాను. యాక్టింగ్‌కు ఇంకొకరిని పెట్టుకోండి’ అన్నాడట. అంతటి అమాయకుడు. హీరో అంటే యాక్టింగు, స్టంట్సు అన్నీ చేయాలి అని ఒప్పించారు. రిటైర్ అయిన పహిల్వాన్లు ఆర్థిక బాధలు పడటం అప్పటికే గమనించిన దారాసింగ్ సినిమాల్లో చేయడం వల్ల నాలుగు డబ్బులు వస్తే చివరి రోజుల్లో పనికొస్తాయని ఒప్పుకున్నాడు. అప్పట్లో ఉర్దూ వాడకం ఎక్కువగా ఉండేది. దారాసింగ్‌కు రాదు. మొదటి నాలుగు సినిమాల్లో డబ్బింగ్ చెప్పించి ఐదో సినిమా నుంచి పూర్తి స్థాయి హీరోని చేశారు. దారాసింగ్ వల్ల కింగ్ కాంగ్, శాంసన్, డాకూ మంగళ్‌సింగ్ వంటి స్టంట్ సినిమాలు ప్రేక్షకులు చూడగలిగారు. ఆయన పక్కన ఎవరూ చేయకపోతే ముంతాజ్ చాలా సినిమాలు చేసి ఆయనను నిలబెట్టింది. దారాకు కుస్తీలో వరల్డ్ చాంపియన్‌షిప్ ఉంది. రాజ్యసభకు నామినేట్ అయిన తొలి ఆటగాడు ఆయన. రామాయణం సీరియల్లో హనుమంతుడిగా వేయడం వల్ల ఆబాలగోపాలానికి మరోమారు దగ్గరయ్యాడు. దారా అంటే భారత్ బలం. కండ. దేహ ధారుడ్యం. 2012లో 83 ఏళ్ల వయసులో మరణించిన ఆయన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోగలిగిన భాగ్యశాలి. -
ఆ మాటలు గురునాథ్, విందూలవే!
తేల్చిన సీఎఫ్ఎస్ఎల్ న్యూఢిల్లీ: చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్, బాలీవుడ్ నటుడు విందూ దారా సింగ్‌లు స్పాట్ ఫిక్సింగ్ సందర్భంగా మాట్లాడిన మాటలు.. వారి వాయిస్ శాంపిల్స్‌తో సరిపోయాయని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) తేల్చింది. దీంతో ఈ కేసులో కొంత పురోగతి రానుంది. ఈ కేసును విచారిస్తున్న ముద్గల్ కమిటీ తమ తుది నివేదికను ఈనెల 30న సుప్రీం కోర్టుకు అందజేయనుంది. బుకీలకు సమాచారాన్ని చేరవేస్తూ మ్యాచ్‌లపై గురు బెట్టింగ్‌లు కాసేవాడని కమిటీ నివేదికలో గురునాథ్‌పై ఆరోపణలు చేసింది. అయితే ఇప్పుడు సీఎఫ్ఎస్ఎల్ ఫలితం ఈ ఆరోపణలకు కొంత బలాన్ని చేకూర్చనుంది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌కు పాల్పడిన అందరి భాగోతాలను పూర్తి స్థాయిలో ఈ నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. నవంబర్ 10న ఈ కేసు విచారణకు రానుంది.