breaking news
Dandiya game
-
దాండియా బీట్స్
దాండియా ఆటలు ఆడ.. సరదా పాటలు పాడ.. అంటూ భాగ్యనగరం ఉత్సాహంతో ఊగిపోతోంది. దసరా నవరాత్రుల్లో సిటీని ఉత్సాహంలో ముంచెత్తడానికి దాండియా ఆట సిద్ధవువుతోంది. ఒత్తిడిని చిత్తు చేస్తూ ఉత్తేజాన్ని నింపుతున్న ఈ ఆట అందరికీ లేటెస్ట్ ఎంజాయ్‌మెంట్‌గా వూరింది. టీనేజర్ల నుంచి మేనేజర్ల వరకు అంతా దీనికే సై అంటున్నారు. ఆరోగ్యం అదనపు బోనస్‌గా వస్తోందని గృహిణులు, బిజినెస్ వుమెన్ సైతం దాండియూపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే దాండియా నేర్పే శిక్షణ కేంద్రాలూ నగరంలో పెరిగారుు. ఇలా ఓ కేంద్రంలో దాండియా, గార్భా సాధన కోసం వచ్చిన మహిళలను పలకరిస్తే ఆసక్తికరమైన విషయాలను ‘సిటీ ప్లస్’తో పంచుకున్నారు. ‘దాండియాతో ఒత్తిడి దూరమవుతుంది. మనసూ ప్రశాంతంగా ఉంటుంది. దాదాపు నెలరోజుల పాటు ఈ నృత్యం చేయడం వల్ల మంచి ఫిట్నెస్ వస్తుంది. ఈ నెల 25 నుంచి జరిగే నవరాత్రి ఉత్సవాల్లో దాండియా ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అంటున్నారు ఆహార్ కుటీర్ రెస్టారెంట్ వర్కింగ్ పార్టనర్ అర్చన. చురుగ్గా కదలాల్సిన ఈ ఆటపై గృహిణులు, వృద్ధులు సైతం వుక్కువ చూపడం విశేషం. ‘కొన్ని నెలల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కాలికి గాయమైంది. ఫిజియో థెరపీ చేశారు. ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే ఇబ్బందిగా ఉండేది. దాండియా సాధన వల్ల ఇప్పుడు చురుగ్గా నడవగలుగుతున్నా’ అంటూ ఇందులోని ఫిట్నెస్ మంత్ర గురించి చెప్పారు బేగంపేటలో ఉండే గృహిణి గీత. ఐదు పదులు దాటినా పట్టుదలతో దాండియూ నేర్చుకున్న లక్ష్మి (కూకట్పల్లి) నిజంగా యూత్‌కు స్ఫూర్తి. ‘నా వయస్సు 55 ఏళ్లు. దాండియా ప్రాక్టీసు వల్ల చిన్ననాటి ఎనర్జీవచ్చినట్టు అనిపిస్తోంది. ఆత్మవిశ్వాసంతో నేర్చుకున్నా’నని ఆమె ఆనందం నిండిన కళ్లతో చెబుతారు. సిటీజనులే కాదు.. వివిధ జిల్లాల నుంచీ అనేకవుంది దాండియూలో శిక్షణ తీసుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. అలా వచ్చినవారే శ్రీకాకుళంలోని హోటల్ నాగావళి జారుుంట్ మేనేజర్ రాధ. ‘దాండియూ ఆడితే నలుగురిలో గుర్తింపు రావడంతో పాటు శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటాం. అందుకే ఇక్కడకు వచ్చా’ అన్నారామె. - వాంకె శ్రీనివాస్ -
దిల్దార్ దాండియా
దసరా వస్తోంది... నవరాత్రుల్లో నగరాన్ని ఊపేయడానికి దాండియా ఆటా రెడీ అంటోంది. కోకనట్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ‘దిల్దార్ దాండియా’ నిర్వహిస్తోంది. షామీర్పేట్ మల్లిక గార్డెన్స్‌లో తొలిసారి అతి పెద్ద ఈవెంట్‌కు రంగం సిద్ధమయింది. బంజారాహిల్స్ హోటల్ తాజ్ దక్కన్లో మంగళవారం నిర్వహించిన ఈ మెగా ఈవెంట్ టికెట్ లాంచింగ్ కలర్ఫుల్గా సాగింది. దాండియా నృత్యాలు, మోడళ్ల ఫ్యాషన్ షోలతో పాటు మిసెస్ సౌత్ ఏషియా రుచికాశర్మ, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ మెరుపులు స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సందర్భంగా ‘దిల్దార్ దాండియా’ వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. ఈ నవరాత్రి సంబరాల్లో మహిళలు, ఏడేళ్ల లోపు పిల్లలకు ప్రవేశం ఉచితమని వారు తెలిపారు. ఇక దాండియా, గర్బా ఆడేవారిని ఉత్సాహ పరిచి ప్రోత్సహించేందుకు బహుమతులూ అందిస్తామన్నారు. ఆగకుండా గర్బా డ్యాన్స్ చేసే వారిలోంచి ఒకరు ప్రతిరోజు హోండా యాక్టివా గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే... చివరి రోజు లక్ష రూపాయల వరకూ నగదు బహుమతులు కూడా గెలుచుకోవచ్చు. ఫొటోలు: ఠాకూర్ -
దండియా మస్తీ
శరద్కాంతులు రాకముందే సిటీలో నవరాత్రి సంబురాలు మొదలయ్యాయి. దాండియా ఆటలతో పడుచుల పాటలు పోటీపడ్డాయి. గార్బాడ్యాన్స్తో ఘాగ్రా, చోలీ డిజైనింగ్స్‌లో మెరిసిన మగువలు సందడి చేశారు. ‘ప్రీ నవరాత్రి వార్మప్’ సందర్భంగా శుక్రవారం ఎ లా లిబర్టీ బంకెట్ హాల్లో కళ్లు చెదిరే నృత్యంతో అదరహో అనిపించారు. సంజయ్‌లీలా భన్సాలీ రామ్‌లీలా మూవీలోని ఓ పాటకు బొమ్మ తుపాకులు చేతపట్టి యువతులు డ్యాన్స్ చేశారు. కొరియోగ్రాఫర్ మీనా మెహతా, శశి నహతా నిర్వహించిన ఈ కార్యక్రమం ఫ్యాషన్ రంగులద్దుకున్న సంప్రదాయ హంగులను ఏకకాలంలో కళ్లముందుంచింది.