breaking news
Dance Floor
-
నోట్లు నిజం.. కోట్లు అబద్ధం
వధువు అడుగు పెడుతుంటే అక్షతలు చల్లడం ఆచారం.. కానీ అక్కడ ఆకాశం నుంచి నోట్ల వర్షం కురిసింది. డ్యాన్స్ ఫ్లోర్ అడుగు కనిపించనంతగా కరెన్సీ తివాచీ పరచుకుంది. ఫిబ్రవరి 14న పంజాబ్‌లోని తార్న్ తరణ్‌లో జరిగిన ఒక వివాహం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆ పెళ్లిలో ఏకంగా రూ.10 కోట్లను వానలా కురిపించారన్న వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.అసలేం జరిగిందంటే.. వైరల్ అవుతున్న వీడియోలో వరుడు సంచుల్లోంచి నోట్ల కట్టలను తీసి గాలిలోకి విసురుతుంటే, అతిథులు కూడా అతనితో జత కలిసారు. చూస్తుండగానే ఆ ప్రాంగణమంతా కరెన్సీ మయమైపోయింది. ఆ్రస్టేలియాలో ట్రక్కుల వ్యాపారం చేసే వరుడి కుటుంబం కావడంతో, ఆ ఆడంబరం చూసి నెటిజన్లు ఆ మొత్తం రూ.8.5 కోట్ల నుండి రూ.10 కోట్ల వరకు ఉంటుందని లెక్కలు కట్టేశారు. ఇది పంజాబీ సంప్రదాయంలో భాగమే అయినా, ఈ స్థాయి ధన ప్రదర్శన అందరినీ విస్మయానికి గురిచేసింది.అవి పది రూపాయల నోట్లే! అయితే, ఈ ‘కోట్ల’కథనంపై వరుడి కుటుంబం, ఈవెంట్ మేనేజర్లు తీవ్రంగా స్పందించారు. ఇది కేవలం వ్యూస్ కోసం జరిగిన అతిశయోక్తి అని వారు కొట్టిపారేశారు. ‘మేము సంబరాల్లో భాగంగా డబ్బులు విసిరిన మాట వాస్తవమే, కానీ అది రూ.2 లక్షలు మాత్రమే. సోషల్ మీడియా దీనిని కోట్లకు పెంచేసింది’.. అని వరుడి సోదరుడు స్పష్టం చేశారు. ఆ నోట్లలో ఎక్కువ భాగం పది రూపాయల నోట్లేనని, వాటితో పాటు కొన్ని డాలర్లు కూడా ఉన్నాయని డీజే యజమాని వివరించారు. మొత్తం విలువ రూ.2.5 లక్షల నుండి రూ.4 లక్షల లోపే ఉంటుందని తేలి్చచెప్పారు.సోషల్ మీడియా కనికట్టే! వ్యూస్, లైకుల కోసం సోషల్ మీడియా ఎంతటి కలి్పత గాథలనైనా అల్లుతుందని ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. కళ్లముందు నోట్ల తివాచీ కనిపించినా, ఆ మెరుపు వెనుక ఉన్నది కోట్ల సంపద కాదు.. కేవలం ప్రచారపు ఆర్భాటమే. నిజం నిలకడ మీద తెలుస్తుందని చెప్పడానికి ఈ ‘క్యాష్ పారీ్ట’ఒక ఉదాహరణ. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భాంగ్రా బీట్ కు కెనడా ప్రధాని స్టెప్పులు..!
ప్రజల మనిషిగా పేరొంది... కెనడా దేశానికి కొత్తగా ఎన్నికైన ప్రధాని జస్టిన్ ట్రూడో భాంగ్రా డ్యాన్సుతో వీక్షకుల మనసు దోచుకున్నారు. ప్రధాని హోదాలోనూ ఆయన సాధారణ వ్యక్తిగా కలసిపోయారు. సంప్రదాయ కుర్తా పైజమా ధరించి, డ్చాన్స్ ఫ్లోర్ పై నృత్యకారిణులతో పదం కలిపారు. పంజాబీ జానపద నృత్యంగా పేరొందిన భాంగ్రా డ్యాన్స్ కు లయబద్ధంగా స్టెప్పులు వేసి అందర్నీ, విస్మయానికి, ఆశ్చర్యానికి గురిచేశారు. ఇండియన్ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మాంట్రియల్ ఈవెంట్ లో 43 ఏళ్ల గ్రూవింగ్ ఓ పంజాబీ పాటకు చేసిన డ్యాన్స్.. యూట్యూబ్ లో విడుదలైంది. వేదికపై జరుగుతున్న నృత్య కార్యక్రమంలో భాగంగా ఓ మహిళతో కలసి ట్రూడో.. పాటకు అనుగుణంగా పదాలు కలుపుతూ తానూ ఓ ఏస్ డ్యాన్సర్ అని నిరూపించుకున్నారు. ట్రూడో చూపించిన ఉత్సాహానికి అక్కడివారంతా ముగ్ధులయ్యారు. వారంతా ఒక్కొక్కరుగా వేదికపైకి వచ్చి ఆయనతో పాటు డ్యాన్స్ లో పాలుపంచుకున్నారు. అక్టోబర్ 19న ఓ కొత్త అధ్యాయానికి తెరలేపి.. 43 ఏళ్ల వయసులోనే ప్రధాని అయిన రెండో వ్యక్తి ట్రూడో. ఈ సందర్భంగా ఆయన తనకు మద్దతు ఇచ్చినవారికి వారికి కృతజ్ఞతలు తెలిపారు.అదేరోజు మాట్రియల్లో జర్రీ సబ్వే స్టేషన్ సందర్శించిన ఆయన అక్కడికి వచ్చిన వారందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి.. వారితో కలసి ఉత్సాహంగా తీసుకున్న సెల్ఫీలను ఓ వెబ్ సైట్ పోస్ట్ చేసింది. 1968 నుంచి 1979 వరకు, తిరిగి 1980 నుంచి 1984 వరకు కెనడా ప్రధానిగా ఉన్న.. కెనడా మాజీ ప్రధాని పియర్ ట్రుడో కుమారుడే.. ఈ ప్రజా వ్యక్తి జస్టిన్ ట్రుడో.


