breaking news
cv Anand
-
సీవీ ఆనంద్ నియామకంపై ఐఏఎస్‌ల అసంతృప్తి
సీఎంకు మెమోరాండం ఇవ్వాలని నిర్ణయం హైదరాబాద్: పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను నియమించడంపై ఐఏఎస్‌లు అసంతృప్తితో ఉన్నారు. దీనిపై ఐఏఎస్ అసోసియేషన్ సీఎం కేసీఆర్‌ను కలసి మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించింది. సీఎంతో అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యతను ఐ అండ్ పీఆర్ కమిషనర్ నవీన్‌మిట్టల్‌కు కట్టబెట్టారు. పౌర సరఫరాల శాఖ పరిధిలో అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు పనిచేయాల్సి ఉంటుం ది, జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది. గతంలో ఇలాంటి ఆనవాయితీ లేకపోవడం, ఐపీఎస్‌ల పరిధిలో ఐఏఎస్‌లు పనిచేయడం సమంజసంగా లేదని, ఎవరి జాబ్ చార్ట్‌లు వారికి ఉన్నాయని అసోసియేషన్ సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలున్నాయి. త్వరలో రవాణాశాఖకు కమిషనర్‌గా ఐపీఎస్‌ని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఐఏఎస్‌ల అసోసియేషన్ తమ అభిప్రాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడం తప్పనిసరని భావిస్తోంది. -
అడిషనల్ డీజీగా సీవీ ఆనంద్
సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు అదనపు డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. దీంతో పాటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కొనసాగేలా బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో రెండో అతిపెద్ద విస్తీర్ణం గల సైబరాబాద్ కమిషనరేట్‌లో శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన కీలక పాత్రపోషిస్తున్నారు. తక్కువ సిబ్బందితో ఎఫెక్టివ్ పోలీసింగ్‌తో నేరాలు అదుపు చేయగలిగారు. 1991 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన ఆనంద్‌కు పదోన్నతి రావడంపై పోలీసు వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి.