breaking news
Current Reservation
-
రైల్వేశాఖ సరికొత్త కార్యక్రమం.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్
ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైలులో సీటు లేదా బెర్త్ దక్కని ప్రయాణికులు ఆఖరి నిమిషంలో అంటే చార్ట్ తయారైన తర్వాత కూడా సీటు పొందే అవకాశం కల్పిస్తోంది. ఖాళీ బెర్త్‌ల గురించిన సమాచారాన్ని రైల్వే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అందిస్తోంది.హాజీపూర్ రైల్వే జోన్లో ఈ సదుపాయం ప్రారంభమైంది. రైళ్లలో ఖాళీగా ఉన్న సీట్ల గురించి సమాచారాన్ని జోన్ పరిధిలోని ఐదు రైల్వే డివిజన్లలోనూ ఫేస్బుక్, ఎక్స్ (ట్విటర్)లో ఇస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఇంట్లో కూర్చొనే రైలులో ఖాళీగా ఉన్న సీట్ల గురించి నాలుగు గంటల ముందుగానే తెలుసుకుంటారు. ఏ రైలులో ఏ తరగతిలో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో తెలుసుకునే వీలుంది.రిజర్వేషన్ ఇలా.. రిజర్వేషన్ చార్ట్ తయారైన తర్వాత, ఖాళీగా ఉన్న సీట్లను కేటాయించే కరెంట్ రిజర్వేషన్ ఆన్లైన్లో జరగదు. ఇందుకోసం స్టేషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లాలి. దానాపూర్ రైల్వే డివిజన్ నుంచి బయలుదేరే రైళ్ల ప్రస్తుత స్థితిని తెలిపే వ్యవస్థను ప్రారంభించారు. రైలు ఎక్కడ నుండి బయలుదేరుతుందో అదే స్టేషన్ నుండి కరెంట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. అలాగే రైలు ఆలస్యమైతే ఆ రైలు ఏ స్టేషన్ గుండా వెళుతుందో తెలిసిపోతుంది. అంతే కాదు ఏ ప్రత్యేక రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ రోజు నడుస్తుందనే సమాచారాన్ని కూడా ఇక్కడ అందజేస్తున్నారు.మొబైల్లో మొత్తం సమాచారం రైలు రిజర్వేషన్ చార్ట్ తయారైన తర్వాత, అన్ని తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల పూర్తి సమాచారం ‘ఎక్స్’, ఫేస్బుక్ ద్వారా ప్రయాణికుల మొబైల్ ఫోన్ స్క్రీన్‌పైకి వస్తుంది. దీని ఆధారంగా ఖాళీ సీట్లకు అప్పటికప్పుడు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే రిజర్వేషన్‌కు రిజర్వేషన్, తత్కాల్ రిజర్వేషన్ టిక్కెట్ మధ్య వ్యత్యాసం ఉంది. రైలు బయలుదేరడానికి ఒక రోజు ముందు బుక్ చేసుకునేది తత్కాల్ టికెట్. అదే కరెంట్ రిజర్వేషన్ కోసం ఆ రైలు చార్ట్ సిద్ధమయ్యే వరకు వేచి ఉండాలి. చార్ట్ తయారు చేసిన తర్వాత ఖాళీగా ఉన్న సీట్ల స్థితని కూడా ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో తెలియజేస్తారు. -
పండగ వేళ గుండెల్లో రైళ్లు
పండక్కి ఊరెళ్లాలి. పిల్లలకు సెలవులిచ్చేశారు. అసలే పెద్ద పండగ. సొంతూళ్లో చేసుకోకపోతే సంతృప్తి ఉండదు. అందుకే విశాఖ రైల్వే స్టేషన్ ఇసుకేస్తే రాలనంతగా జనంతో నిండిపోయింది. నగరంలో వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడినవారే ఎక్కువ. వారంతా స్వస్థలాలకు పయనం కావడంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. శనివారం ఉదయం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ తీసుకునేందుకు పోటీ పడాల్సి వచ్చింది. గంటపాటు నిరీక్షిస్తేనే కానీ టికెట్ లభ్యం కాలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతలో ఆ రైలు వెళ్లిపోవడంతో సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌కు వెళ్లారు. ఆ తర్వాత వచ్చిన బొకారో, రత్నాచల్, ప్యాసింజర్ రైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. విశాఖ ఎక్స్‌ప్రెస్, గోదావరి, నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లకు వందలాదిమంది నిరీక్షణ జాబితాలోనే ప్రయాణిస్తున్నారు. కరెంట్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద వుండే జనరల్ బుకింగ్‌ను హుద్‌హుద్ తుపాను నుంచి మూసేశారు. దీంతో ప్రయాణికులంతా జనరల్ బుకింగ్ కౌంటర్ వద్దకు పరుగులు తీస్తున్నారు. ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు కూడా పనిచేయకపోవడంతో తోపులాట తప్పడం లేదు. -విశాఖపట్నం సిటీ