చిన్న జట్టు సంచలనం.. ఈక్వెడార్‌కు భారీ షాక్
ఫిఫా ప్రపంచకప్‌లో ఈక్వెడార్ ప్రయాణం ముగిసింది. నాకౌట్ దశకు చేరకుండానే ఇంటిబాట పట్టనుంది. టోర్నీలో భాగంగా ఆదివారం గ్రూప్-ఈలో కురాకావోతో జరిగిన మ్యాచ్‌ను ఈక్వెడార్ (0-0)తో డ్రా చేసుకుంది. నిర్ణీత సమయంలో ఇరుజట్లు గోల్ కొట్టడంలో విఫలమయ్యాయి. దీంతో మ్యాచ్ డ్రా కావడంతో ఇరుజట్లకు చెరో పాయింట్ లభించాయి. అయితే తొలిసారి ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న కురాకావో జట్టు ఒక పాయింట్ సాధించి టోర్నీలో ఖాతా తెరిచింది. మ్యాచ్ డ్రా చేసుకున్నప్పటికీ తనకంటే ఎన్నో రెట్లు మెరుగైన ఈక్వెడార్‌ను నిలువరించడం వారికి విజయంతో సమానం. మ్యాచ్‌లో ఈక్వెడార్ 15 సార్లు కురాకావో గోల్ పోస్టుపై దాడులు చేసింది. కురాకావో ఫుట్‌బాల్ జట్టుకానీ కురాకావో గోల్ కీపర్ 37 ఏళ్ల ఎలోయ్ రూమ్ వాటిని సమర్థంగా అడ్డుకొని మ్యాచ్ డ్రా కావడంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు ఎలోయ్ తన విన్యాసాలతో ఫిఫా ప్రపంచకప్‌లో కురాకావోకు ఒక పాయింట్ లభించేలా చేశాడు. ఫిఫా ప్రస్తుత ర్యాంకింగ్స్ ప్రకారం చూసుకుంటే ఈక్వెడార్ 29వ ర్యాంక్‌లో ఉంటే, కురాకావో మాత్రం 83వ ర్యాంకులో కొనసాగుతోంది. కేవలం లక్షా 56వేల జనాభా కలిగిన కురాకావో ఆడుతున్న తొలి ఫిఫా ప్రపంచకప్‌లోనే తమ ప్రదర్శనతో అందరి చేత శెభాష్ అనిపించుకుంది. ఒక ఓటమి, ఒక డ్రాతో ఆఖరిస్థానంలో ఉన్న కురాకావో అనధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. టోర్నీలో తమ చివరి మ్యాచ్‌ను జూన్ 26న ఐవరీకోస్ట్‌తో ఆడనుంది. మరోవైపు ఈక్వెడార్ కూడా టోర్నీ నుంచి వైదొలిగినట్లే. తమ చివరి మ్యాచ్‌ను గ్రూప్-ఈలో టాపర్‌గా ఉన్న జర్మనీతో జూన్ 26న ఆడనుంది.Que defesa do goleiro de Curaçao, sobrou até pra jornalista na beira do campo. pic.twitter.com/K2PHSSrHPM— Luiz Carlos Largo (@LARGOESPN) June 21, 2026 Cómo todos van con el portero después del partido Lo que significa para ellos ❤️ pic.twitter.com/8Fp1NNdo8F— Jeff (@JeffFcb14) June 21, 202637-year-old Eloy Room delivers a goalkeeping masterclass to secure Curaçao’s first-ever World Cup point 👏🔥 pic.twitter.com/9SVDhX8Xp2— OneFootball (@OneFootball) June 21, 2026చదవండి: దెబ్బతిన్న పులిలా రొనాల్డో.. ఆ మెరుపులెక్కడ?