breaking news
cross border firing
-
డురాండ్ లైన్ వద్ద భీకర కాల్పులు.. ఏడుగురు పాక్ సైనికులు మృతి!
అఫ్గానిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. వివాదాస్పద 'డురాండ్ లైన్' వెంబడి అఫ్గాన్ బలగాలతో జరిగిన భీకర కాల్పులలో దాదాపు ఏడుగురు పాకిస్థాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సరిహద్దు భద్రత, ఉగ్రవాద కదలికలపై ఇరు దేశాల మధ్య కొంతకాలంగా రాజుకుంటున్న ఉద్రిక్తతలే ఈ హింసాత్మక ఘర్షణకు దారితీశాయి.ఎక్కడ జరిగిందంటే?అఫ్గానిస్తాన్ పక్తియా ప్రావిన్స్ పరిధిలోని దండ్ పటాన్ జిల్లా, వ్యూహాత్మక ఖర్లాచీ గేట్, అలాగే టాప్ సార్, కొంజ్ అలీ ప్రాంతాలలో మధ్యాహ్నం సమయంలో ఈ భారీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ భీకర పోరు కారణంగా ఇరు దేశాల మధ్య సరిహద్దు వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయింది. సరిహద్దు గ్రామాల ప్రజలు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది.ఇరు దేశాల వాదనలు ఇవే..పాకిస్థాన్ ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా సరిహద్దులో అక్రమంగా అవుట్‌పోస్టులను నిర్మిస్తోందని, తమ భూభాగం వైపు నుంచి వచ్చిన పాక్ కాల్పులను తిప్పికొట్టామని అఫ్గాన్ భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ఎదురుకాల్పుల్లోనే పాక్ సైనికులు మృతి చెందినట్లు వెల్లడించాయి. మరోవైపు కుర్రమ్ జిల్లాలోని తమ చెక్పోస్టులపై అఫ్గాన్ సరిహద్దు గార్డులే తొలుత కాల్పులు జరిపారని పాక్ అధికారులు ఆరోపించారు. -
11 రోజుల్లో 35 వేల బుల్లెట్లు కాల్చారు!
-
11 రోజుల్లో 35 వేల బుల్లెట్లు కాల్చారు!
పాకిస్థాన్ వైపు నుంచి సరిహద్దుల్లో జరుగుతున్న కాల్పులకు మన సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) దీటుగా సమాధానం ఇస్తోంది. మనవైపు నుంచి కూడా అత్యంత భారీ స్థాయిలోనే కాల్పులు ఉంటున్నాయి. అక్టోబర్ 19వ తేదీ నుంచి పాకిస్థాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఉండటంతో దాదాపు ప్రతిరోజూ తుపాకుల మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. బీఎస్ఎఫ్ జరిపిన కాల్పులలో దాదాపు 15 మంది సైనికులు, మరికొందరు పౌరులు కూడా మరణించినట్లు తెలుస్తోంది. గడిచిన 11 రోజుల్లో బీఎస్ఎఫ్ దళాలు చిన్నపాటి ఆయుధాలతో 35 వేల బుల్లెట్లు కాల్చాయి. వీటిలో ఎంఎంజీలు, ఎల్ఎంజీలు, రైఫిళ్లు తదితరాలున్నాయి. ఇవి కాక.. 3000 దీర్ఘశ్రేణి మోర్టార్షెల్స్ను కాల్చాయి. ఇవి దాదాపు ఐదారు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదిస్తాయి. అలాగే తక్కువ దూరం వెళ్లగల మోర్టార్ షెల్స్ 2వేలు కాల్చాయి. ఇవి 900 మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయి. దీర్ఘశ్రేణి మోర్టార్ షెల్స్‌తో శత్రువుల స్థావరాలను ధ్వంసం చేస్తారని, చిన్న ఆయుధాలతో పాటు తక్కువ దూరం వెళ్లే మోర్టార్ షెల్స్‌ను ఉగ్రవాదులు, పాక్ రేంజర్లను లక్ష్యం చేసుకోడానికి ఉపయోగిస్తారని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. సరిహద్దులలో కాల్పులు ఎక్కువగా జమ్ము సెక్టార్లోనే జరిగాయి. ఇవి కూడా ప్రధానంగా రాత్రిపూటే ఎక్కువగా ఉంటున్నాయి. పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతూ, ఆ సమయంలో ఉగ్రవాదులు మన దేశంలోకి ప్రవేశించేందుకు వీలు కల్పిస్తున్నారు. అటువైపు నుంచి జరిపిన కాల్పులలలో బీఎస్ఎఫ్ జవాన్లు ముగ్గురు అమరులయ్యారు. ఈ 11 రోజుల్లో పాకిస్థాన్ దాదాపు 60 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిందని బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం శీతాకాలం సమీపిస్తుండటంతో బీఎస్ఎఫ్ దళాలకు మరింత ఎక్కువగా ఆయుధ సామగ్రి సరఫరా చేస్తున్నారు.


