breaking news
Craig Erwin
-
టి20 ప్రపంచకప్ కదా.. ఆ మాత్రం ఉండాల్సిందే
ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న టి20 ప్రపంచకప్‌కు జింబాబ్వే క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. జింబాబ్వేతో పాటు నెదర్లాండ్స్ కూడా అనుమతి సాధించింది. క్వాలిఫయింగ్ టోర్నీ (బి)లో ఈ రెండు జట్లు ఫైనల్ చేరాయి. బులవాయోలో జరిగిన తొలి సెమీ ఫైనల్లో జింబాబ్వే 27 పరుగుల తేడాతో పపువా న్యూ గినియాపై విజయం సాధించింది. జింబాబ్వే 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేయగా, న్యూ గినియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులే చేయగలిగింది. జింబాబ్వే జట్టు.. ఒకప్పుడు క్రికెట్లో ఒక వెలుగు వెలిగిన దేశం. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి మేటిజట్లను ఓడించి సంచలనాలు నమోదు చేసింది. గత దశాబ్ద కాలం వరకు జింబాబ్వే జట్టు మోస్తరుగానే రాణించింది. కానీ కొన్నేళ్ల నుంచి మాత్రం వారి ఆటతీరు నాసిరకంగా తయారైంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. క్రికెట్లో పేద దేశంగా పేరు పొందిన జింబాబ్వేలో ఆటగాళ్లకు, బోర్డుకు అంతర్గత వ్యవహారాల్లో విబేధాలు, జాతి వివక్ష లాంటి ఎన్నో అంశాలు చుట్టుముట్టాయి. ఒకప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ఉన్న జింబాబ్వే ఇప్పుడు కనీసం ఆ దరిదాపున కూడా రావడం లేదు. దీనికి తోడూ బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఐర్లాండ్ లాంటి దేశాలు క్రికెట్లో బాగా రాణిస్తున్నాయి. ఇవి కూడా జింబాబ్వేకు కొంత ప్రతీకూలమయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక టి20 ప్రపంచకప్ టోర్నీకి క్వాలిఫై అవడం పెద్ద ఘనత కిందే లెక్క. అందుకే జింబాబ్వే జట్టు దానిని ఒక పెద్ద పండుగలా సెలబ్రేట్ చేసుకుంది. మ్యాచ్ విజయం అనంతరం జింబాబ్వే ఆటగాళ్లు టి20 ప్రపంచకప్‌కు క్వాలిఫై అవ్వడాన్ని పెద్ద పండుగలా జరుపుకున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లంతా ఒక దగ్గరికి చేరి తమ బ్యాట్లను నేలకు కొడుతూ గట్టిగట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను జింబాబ్వే క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ''టి20 వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యామని తెలియగానే మా జట్టు సభ్యులు పెద్ద పండుగ చేసుకున్నారు.'' అంటూ ట్వీట్ చేసింది. ఇక జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ''టి20 ప్రపంచకప్‌కు అర్హత సాధించామంటే మాకు అది పెద్ద విషయం. ఈ సందర్భంగా నాకు మాటలు రావడం లేదు. మా కుర్రాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. సెమీఫైనల్లో 200 పరుగులు కొట్టినప్పటికి దానిని నిలుపుకునేందుకు బౌలర్లు అద్భుత కృషి చేశారు. ఇక ప్రస్తుతం దృష్టంతా ఆదివారం జరగనున్న క్వాలిఫయర్ ఫైనల్ పైనే ఉంది. ఆ మ్యాచ్‌లోనూ విజయం సాధించి గ్రూఫ్-ఏలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తాం. ఆ తర్వాత అక్టోబర్‌లో జరగనున్న టి20 వరల్డ్‌కప్‌పై దృష్టి పెడుతాం'' అంటూ కామెంట్ చేశాడు. #ICYMI: The lads celebrating after clinching a place at the ICC Men’s T20 World Cup 🏏 pic.twitter.com/ZoRQe57cz3 — Zimbabwe Cricket (@ZimCricketv) July 16, 2022 చదవండి: Yasir Shah: రీఎంట్రీలోనూ సంచలనమే.. పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు -
ఎర్విన్ అజేయ శతకం
∙ జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ 344/8 ∙ శ్రీలంకతో తొలి టెస్టు కొలంబో: శ్రీలంక పర్యటనలో జింబాబ్వే జట్టు తమ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ జట్టు తొలి టెస్టులోనూ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. క్రెయిగ్ ఎర్విన్ (238 బంతుల్లో 151 బ్యాటింగ్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతోచెలరేగడంతో లంకతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు ముగిసేసరికి 90 ఓవర్లలో 8 వికెట్లకు 344 పరుగులు సాధించింది. 70 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన స్థితిలో ఎర్విన్ తన అసమాన ఆటను చూపెట్టాడు. సికిందర్ రజా (47 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఐదో వికెట్‌కు 84 పరుగులు జత చేసి జట్టును ఆదుకున్నాడు. 146 బంతుల్లో కెరీర్లో రెండో సెంచరీ చేసిన ఎర్విన్ ఈ క్రమంలో తన అత్యధిక వ్యక్తిగత స్కోరు (146)ను కూడా అధిగమించాడు. ప్రస్తుతం క్రీజులో ఉన్న ట్రిపానో (45 బంతుల్లో 24 బ్యాటింగ్; 4 ఫోర్లు), ఎర్విన్ మధ్య ఇప్పటికే తొమ్మిదో వికెట్‌కు 62 పరుగులు జత చేరాయి. హెరాత్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.