breaking news
court duties boycott
-
సీఎం స్వార్థం కోసం హోదా తాకట్టు
నెల్లూరు (లీగల్): ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ నెల్లూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం కోర్టు విధులను బహిష్కరించారు. అనంతరం జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు ఫణిరత్నం మాట్లాడుతూ తన రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని విమర్శించారు. ప్రధాన కార్యదర్శి రోజారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో మోదీ, చంద్రబాబు సంయుక్తంగా తమ వాగ్దానాలతో ప్రజలను న మ్మించారని, ఇప్పుడు ఇద్దరు కలిసి ప్రజలను మోసగిస్తున్నారని దుయ్యబయ్యట్టారు. అనంతరం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఖాళీ ప్రదేశంలోని పిచ్చి మొక్కలను తొలగించారు. -
నేటి నుంచి కోర్టు విధుల బహిష్కరణ
న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగులు, లాయర్ల జేఏసీ నిర్ణయం ♦ 10 వరకు విధుల బహిష్కరణ ♦ 13న చలో హైకోర్టుకు పిలుపు సాక్షి, హైదరాబాద్: న్యాయాధికారుల కేటాయింపు వివాదం మరింత ముదురుతోంది. హైకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా చేస్తున్న న్యాయాధికారుల కేటాయింపులను రద్దు చేయాలంటూ సోమవారం నుంచి ఈ నెల 10 వరకు వరకు కోర్టు విధులను బహిష్కరించాలని న్యాయాధికారులు, న్యాయ శాఖ ఉద్యోగ సంఘాలు, న్యాయవాదుల జేఏసీ, ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ నిర్ణయించాయి. 13న సంయుక్తంగా చలో హైకోర్టు నిర్వహించాలని తీర్మానించా యి. న్యాయమూర్తులకు సంబంధించిన ప్రిలిమినరీ కేటాయింపును వెంటనే రద్దు చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాద సంఘాల ప్రతినిధులు ఆదివారం సిటీ సివిల్ కోర్టు ఆవరణలో సమావేశమయ్యారు. స్థానికత ఆధారంగానే న్యాయాధికారుల కేటాయింపులు జరగాలని డిమాండ్ చేశారు. ప్రిలిమినరీ కేటాయింపులు అమలైతే న్యాయాధికారుల ఉద్యోగాలను న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు(20శాతం కోటా) కోల్పోవాల్సి వస్తుం దని, ఈ కేటాయింపులతో 20 ఏళ్ల వరకు ఒక్క న్యాయాధికారి కూడా హైకోర్టు న్యాయమూర్తి అయ్యే అవకాశం లేదని పేర్కొన్నారు. ఈ నెల 13 లోగా ప్రిలిమినరీ కేటాయింపులు రద్దు చేయకపోతే.. న్యాయ శాఖ ఉద్యోగులంతా సామూహికంగా సెలవు పెట్టేందుకు అనుమతించాలని హైకోర్టును కోరాలని నిర్ణయించారు. తెలంగాణకు వెంటనే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులు, న్యాయ శాఖ ఉద్యోగులు, న్యాయాధికారులు ఒక్కతాటిపైకి వచ్చి పోరాటానికి దిగడం గమనార్హం. సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిరావు లక్కరావు, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సుబ్బయ్య, న్యాయాధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, వరప్రసాద్, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ ప్రసాద్, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.లక్ష్మారెడ్డి, తెలంగాణ అధ్యక్ష, కార్యదర్శులు జగన్నాథం, రాజశేఖర్‌రెడ్డి, రమణారావు, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గండ్ర మోహన్‌రావు, సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి, న్యాయవాదుల జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, కో-కన్వీనర్ శ్రీరంగరావు, ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.