breaking news
Cool pad
-
ఈ ఏడాది మరో ఆరు మోడళ్లు
కూల్‌ప్యాడ్ ఇండియా సీఈవో తాజుద్దీన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ల తయారీలో ఉన్న కూల్‌ప్యాడ్ ఈ ఏడాది మరో ఆరు మోడళ్లను మార్కెట్లోకి తేనుంది. 95 శాతం ఫోన్లు భారత్‌లోనే తయారు చేస్తున్నట్టు కంపెనీ సీఈవో సయ్యద్ తాజుద్దీన్ తెలిపారు. గురువారమిక్కడ నోట్–5 లైట్ మోడల్‌ను హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. 2016లో దేశవ్యాప్తంగా 30 లక్షల ఫోన్లను విక్రయించామంటూ... ఈ ఏడాది 50 లక్షల యూనిట్లను అమ్ముతామనే ఆశాభావం వ్యక్తం చేశారు. వీడియోకాన్‌కు చెందిన తయారీ కేంద్రాల్లో కూల్‌ప్యాడ్ స్మార్ట్ఫోన్లు తయారు చేస్తున్నామని, తయారీ సామర్థ్యాన్ని పెంచుతున్నామని తెలియజేశారు. అమ్మకాల పరంగా ఢిల్లీ, బెంగళూరు తర్వాత కంపెనీకి 15 శాతం వాటాతో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచిందన్నారు. తెలుగు రాష్ట్రాలతో సహా కొన్ని మార్కెట్లలో నాలుగు నెలల నుంచి ఆఫ్లైన్లోనూ మోడళ్లను విక్రయిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆఫ్‌లైన్ వాటా 20 శాతంగా ఉంది. -
మార్కెట్లోకి కూల్‌ప్యాడ్ మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్
ధర రూ.24,999 న్యూఢిల్లీ: చైనా మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ కూల్‌ప్యాడ్ శుక్రవారం కొత్త మొబైల్ ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. కూల్‌ప్యాడ్ మ్యాక్స్ పేరుతో అందిస్తున్న ఈ హ్యాండ్సెట్ ధర రూ.24,999 అని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌ను అమెజాన్‌డాట్‌ఇన్ ద్వారా విక్రయిస్తామని పేర్కొంది. ఈ ఫోన్లో వాట్సాప్, ఫేస్బుక్, మెసెంజర్లకు ఒక్కో దానికి రెండు అకౌంట్లు నిర్వహించుకునే ప్రత్యేకమైన ఫీచర్ ఉందని కూల్‌ప్యాడ్ ఇండియా సీఈఓ సయ్యద్ తాజుద్దీన్ తెలిపారు. 5.5 అంగుళాల డిస్ప్లే ఉన్న ఈ ఫోన్‌ను 1.5 గిగాహెర్ట్స్ ఆక్టకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమెరీ, 64 జీబీకు విస్తరించుకోగలిగే మెమెరీ, ఫోన్ వెనకవైపు 13 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 5 మెగా పిక్సెల్ కెమెరా, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. ఈ కంపెనీ భారత్‌లో ఆర్ అండ్ డీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది. ఈ ఏడాది చివరికల్లా ఈ ఆర్ అండ్ డీ సెంటర్‌ను బెంగళూరులో ఏర్పాటు చేస్తామని తాజుద్దీన్ పేర్కొన్నారు. భారత వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా లోకల్ ఫీచర్లను తమ ఫోన్లలో జత చేయడానికి ఈ ఆర్ అండ్ డీ సెంటర్‌ను అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. స్మార్ట్‌ఫోన్ల్ సంబంధిత యాప్, కంటెంట్ డెవలప్మెంట్లపై కూడా ఈ సెంటర్ దృష్టిసారిస్తుందని పేర్కొన్నారు. భారత్‌లో మొబైల్ ఫోన్లను అసెంబుల్ చేయడానికి వీడియోకాన్ కంపెనీతో ఈ కూల్‌ప్యాడ్ కంపెనీకి భాగస్వామ్యం ఉంది.