breaking news
Convertible Laptop
-
లెనోవా కొత్త ల్యాప్‌టాప్: టూ ఇన్ వన్
సాక్షి, బెంగళూరు: చైనాకు చెందిన బహుళజాతి టెక్నాలజీ కంపెనీ లెనోవా కొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. 'యోగా 920’ లిమిటెడ్ ఎడిషన్ వైబ్స్ కన్వర్టిబుల్ ల్యాప్‌టాప్‌ను మంగళవారం లాంచ్ చేసింది. దీని ధరను రూ .1,27,150 గా నిర్ణయించింది. దీన్ని ల్యాప్ టాప్ మోడ్, టాబ్లెట్ మోడ్, స్టాండ్ మోడ్ , టెంట్ మోడ్ ఇలా 2-ఇన్ -1 గా దీన్ని వాడుకోవచ్చని కంపెనీ చెప్పింది. కన్వర్టిబుల్ పీసీ కేటగిరీలో లెనోవా యోగా బ్రాండ్ లీడర్‌గా కొనసగుతోందని లెనోవా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ తాడాని వెల్లడించారు. తమ తాజా ఆవిష్కరణ యోగా 920 అల్ట్రా ప్రీమియం మోడల్ అని తెలిపారు. 2ఇన్ వన్ గ్లాస్ కన్వర్టిబుల్ పరికరంలో డిజిటల్ పిన్, ఫార్-ఫీల్డ్ టెక్నాలజీని జోడించినట్టు చెప్పారు. దీని వలన వినియోగదారులు నాలుగు మీటర్ల దూరంలో ఉన్నా, స్టాండ్ బై మోడ్‌లో ఉన్నా వాయిస్-యాక్టివేటెడ్ ఇంటిలిజెన్స్ అసిస్టెంట్ కోర్టానా ను యాక్టివేట్ చేసేకోచ్చని తెలిపారు. కంపెనీ వినియోగదారుల పోర్ట్‌ఫోలియోలో 2ఎక్స్ థండర్ బోల్టులు కలిగిన మొదటి డివైస్అని ప్రకటించారు. 4కే టచ్‌స్ర్కీన్ డిస్ ప్లే, 8వ జనరేషన్ ఇంటెల్ క్వాడ్ కోర్ యు-సిరీస్ ప్రాసెసర్స్ విత్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్, ట్విన్ థండర్ బోర్డ్ యూఎస్బీ టైప్-సి పోర్టు, డాల్బీ అట్మోస్ టెక్నాలజీ జెబీఎల్ స్పీకర్లు ,ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. ప్లాటినం కలర్లో ఆల్ మెటల్‌బాడీ డిజైన్‌తో వస్తున్న ఈ ల్యాప్‌టాప్ విండోస్ 10ఆపరేటింగ్ సిస్టం ఆధారితం. విండోస్ హెల్లోకి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫింగర్ ప్రింట్ రీడర్ కూడా ఉంది. -
ప్రపంచపు అతి పలుచని కన్వర్టబుల్ ల్యాప్‌టాప్!
‘యోగా 900ఎస్’ను ఆవిష్కరించిన లెనొవొ న్యూఢిల్లీ: చైనా టెక్నాలజీ దిగ్గజ కంపెనీ లెనొవొ తాజాగా తన యోగా సిరీస్‌లోనే ప్రపంచపు అతి పలుచనైన (12.8 మిల్లీమీటర్లు) కన్వర్టబుల్ ల్యాప్‌టాప్ ‘యోగా 900ఎస్’తో సహా పలు ఉత్పత్తులను మార్కెట్లో ఆవిష్కరించింది. ‘యోగా 900ఎస్’లో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, తక్కువ బరువు (999 గ్రాములు), 10.5 గంటల వీడియో ప్లేబ్యాక్, డాల్బీ ఆడియోను అందించే ఇంటెల్ కోర్ ఎం7 ప్రాసెసర్, క్రిస్టల్ క్లియర్ రిజల్యూషన్‌ను అందించే క్యూహెచ్డీ స్క్రీన్ (2,560x1,440) వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. వీటితోపాటు లెనొవొ కంపెనీ ఐడియాప్యాడ్ వై900, ఐడియాసెంటర్ వై900 ఆర్ఈ, లెనొవొ వై27జీ అండ్ వై27జీ ఆర్ఈ కర్వ్డ్ గేమింగ్ మానిటర్స్, ఐడియాసెంటర్ 610ఎస్, ఐడియాప్యాడ్ 700, 710ఎస్ వంటి తదితర ఉత్పత్తులను మార్కెట్లో ఆవిష్కరించింది. కంపెనీ ఈ ఉత్పత్తులన్నింటినీ జనవరి 6 నుంచి 4 రోజులపా టు లాస్ఏంజిలిస్లో జరగనున్న ‘ఇంటర్నేషనల్ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ షో’లో ప్రదర్శించనున్నది. కొత్త స్మార్ట్‌ఫోన్స్ కూడా... లెనొవొ కంపెనీ ‘వైబ్ ఎస్1 లైట్’, ‘వైబ్ కే4 నోట్’ అనే రెండు స్మార్ట్ఫోన్లను మార్కెట్లో ఆవిష్కరించింది. ‘వైబ్ ఎస్1 లైట్’లో 5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 2,700 ఎంఏహెచ్ బ్యాటరీ, 1.3 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4జీ, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 13 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక ‘వైబ్ కే4 నోట్’ స్మార్ట్‌ఫోన్‌లో 5.5 అంగుళాల తెర, 3 జీబీ ర్యామ్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. దీని ధర రూ.11,999. వైబ్ కే4 నోట్ స్మార్ట్ఫోన్ల ఫ్లాష్ సేల్స్ జనవరి 19 నుంచి అమెజాన్‌లో ప్రారంభమౌతాయని కంపెనీ వెల్లడించింది.