Convergence
-
ఘనంగా సీడీకే 'కన్వర్జెన్స్ 2026' వేడుకలు
హైదరాబాద్: ప్రముఖ ఆటోమోటివ్ రిటైల్ సాఫ్ట్వేర్ సంస్థ 'సీడీకే' (CDK), తన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల కోసం హైదరాబాద్, పుణె నగరాల్లో 'కన్వర్జెన్స్ 2026' వేడుకలను ఘనంగా నిర్వహించింది. సంస్థ సాధించిన విజయాలను వేడుకగా జరుపుకోవడంతో పాటు, భారతీయ సంస్కృతి కుటుంబ విలువలకు అద్దం పట్టేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ఏడాది "మన భారతీయ మూలాల్లోకి వెళ్దాం" అనే థీమ్‌తో వేడుకలు నిర్వహించారు.ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసే సీడీకే సంస్థ, 2019 నుండి వరుసగా 'గ్రేట్ ప్లేస్ టు వర్క్' (GPTW) గుర్తింపును పొందుతోంది. అంతేకాకుండా, 2025 సంవత్సరానికి గాను భారతదేశంలోని టాప్ 100 ఐటీ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఈ విజయాల వెనుక ఉద్యోగుల శ్రమతో పాటు వారి కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో ఉందని ఈ వేడుక చాటిచెప్పింది.కన్వర్జెన్స్ 2026 వేడుకల్లో ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా అలంకరించిన వేదికపై సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు థీమ్ ఆధారిత ఫ్యాషన్ వాక్ వంటి కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ముఖ్యంగా పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయించిన జోన్ ఆకట్టుకుంది. ఇదే వేదికపై సంస్థ అభివృద్ధికి కృషి చేసిన ప్రతిభావంతులైన ఉద్యోగులకు 'రివార్డ్స్ అండ్ రికగ్నిషన్' విభాగంలో అవార్డులను అందజేసి గౌరవించారు. -
లక్ష కోట్ల డాలర్లకు భారత రిటైల్ రంగం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అత్యంత ఆకర్షణీయమైన మార్కెట్లలో భారత్ ఒకటని అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ప్రెసిడెంట్ డగ్ మెక్‌మిలన్ చెప్పారు. విశిష్టమైన దేశీ రిటైల్ రంగం .. 2025 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయిని అధిగమించగలదని పేర్కొన్నారు. కన్వర్జ్ ః వాల్‌మార్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. భారత మార్కెట్ వైవిధ్యమైనది కావడంతో స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రణాళికలను అమలు చేయాల్సి ఉంటుందని సంస్థ సిబ్బందికి సూచించారు. దేశీ మల్టీ–బ్రాండ్ రిటైల్ రంగంలో నేరుగా ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు లేనందున తాము ఇతర విధానాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నామని డగ్ వివరించారు. అమెరికా, చైనాలతో పాటు భారత్ కూడా టాప్ 3 మార్కెట్లలో ఒకటన్నారు. వాల్‌మార్ట్‌లో భాగమైన ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, డిజిటల్ చెల్లింపు సేవల సంస్థ ఫోన్‌పే మెరుగ్గా రాణిస్తున్నాయని, వీటికి భారీ సంఖ్యలో యూజర్లు ఉన్నారని డగ్ పేర్కొన్నారు. ‘ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 3,00,000 పైచిలుకు విక్రేతలు ఉండగా, ఫోన్‌పే యూజర్ల సంఖ్య 30 కోట్ల పైచిలుకు ఉంది. రెండు సంస్థలూ గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు. 2018లో 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. -
కన్వర్జెన్స్ 2015లో సొనాటా సాఫ్ట్వేర్
హైదరాబాద్: బార్సిలోనా(స్పెయిన్)లో జరిగే కన్వర్జెన్స్ 2015 ఈఎంఈఏలో డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ టెక్నాలజీస్‌ను ప్రద ర్శించనున్నామని సొనాటా సాఫ్ట్వేర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 30న ప్రారంభమయ్యే ఈ కన్వర్జెన్స్ వచ్చే నెల 2 వరకూ జరుగుతుందని సొనాటా సాఫ్ట్వేర్ హెడ్(డెలివరీ) పీవీఎస్ఎన్ రాజు చెప్పారు. ఈ కన్వర్జెన్స్‌లో బ్రిక్ అండ్ క్లిక్ రిటైలింగ్ వంటి వినూత్నమైన డిజిటల్ బిజినెస్ ప్లాట్‌ఫారమ్స్, సొల్యూషన్స్‌ను డిస్ప్లే చేస్తామని తెలిపారు. ఇక ఇటీవలే తాము కొనుగోలు చేసిన ఇంటరాక్టివ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(ఐబీఐఎస్) సీఆర్ఎం సప్లై చెయిన్ సొల్యూషన్‌ను డిస్ప్లే చేస్తుందని ఆయన వివరించారు.


