breaking news
container images
-
ప్రపంచంలోని టాప్ 10 బిజీయెస్ట్ కంటైనర్ పోర్ట్‌లు (ఫోటోలు)
-
ఆకట్టుకుంటున్న ఫేస్బుక్లో నేతలపై సెటైర్లు!
ఎ కొండూరు/గుడివాడ, న్యూస్‌లైన్ : సమైకాంధ్ర ఉద్యమం ఫెస్ బుక్‌లో జోరుగా సాగుతుంది. సమైకాంధ్ర ఉద్యమంలో పాల్గొనని నేతల కార్టున్ చిత్రాలు పోస్ట్ చేసి ఆంధ్రకు జరుగుతున్న అన్యాయన్ని ఎత్తిచూపుతున్నారు. యువకులు అధికంగా ఫెస్బుక్ అకౌంట్ కలిగి ఉండటంతో ఆలోచింపచేసే చిత్రాలు పోస్ట్ అవుతున్నాయి. విభజనకు కారకులైన సోనియా, అంటోనీ వ్యంగ చిత్రాలు, రాష్ట్రాంలో ద్వంధ్వ వైఖరి ప్రదర్శిస్తున్న చంద్రాబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, బోత్స,చిరంజీవి చిత్రాలు ఆలోచింపచేస్తున్నాయి. మచ్చుకు కొన్ని.... తెలంగాణా, రాయలసీమ, కోస్తాంధ్రా తెలుగు తల్లికి మాంగళ్యంలో మూడు ముడులు వంటివని వీటిని వీడదీయకుడదనే విజ్ఞఫ్తి చిరుపై భారీ సెటైర్లు... తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఓ రకమైన రేంజ్, ఇమేజ్ ఉంది. ఇదంతా ఒకప్పుడు ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఫేస్బుక్లో ఆయనపై ఏ విధమైన సెటైర్ ఉన్నా.....లైక్ కొడదామా..లేదా కామెంటు పెడదామా అని ఫేస్ యూజర్స్ ఉర్రూతలూగుతున్నారిప్పుడు. 2009 ఎన్నికల ప్రచారంలో చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నాయకులపై చేసిన వ్యాఖ్యలను సైతం పొలిటికల్ సెటైర్లుగా మార్చారు. ‘రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను పంచెలూడేట్లు కొట్టండి అన్న వ్యాఖ్యకు చిరు ఈ విధంగా స్పందిస్తారు ‘ఆ రోజుల్లో... నా ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్’లో కలిపేస్తానని పవన్ ఉహించి ఉండడు.