breaking news
Consultancy firm
-
డీల్స్ డీలా
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి పెరిగిపోతుండటం, పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం తదితర అంశాల నేపథ్యంలో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో విలీనాలు, కొనుగోళ్లు (ఎంఅండ్ఏ), ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) డీల్స్‌పై ప్రభావం పడింది. లావాదేవీలు ఏకంగా 48 శాతం పడిపోయాయి. 17 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. పరిమాణంపరంగా 2025 తొలి త్రైమాసికంతో పోల్చి చూస్తే రెండో త్రైమాసికంలో ఎంఅండ్ఏ, పీఈ డీల్స్ 13 శాతం క్షీణించి 582కి పరిమితమయ్యాయి. 2023 రెండో క్వార్టర్ తర్వాత త్రైమాసికాలవారీగా డీల్ విలువ ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే ప్రథమం. కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్టన్ భారత్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, అనిశ్చితి, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పెరుగుతున్న బంగారం ధరలు మొదలైన భౌగోళికరాజకీయాంశాల వల్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. అయితే, మందగమనంలోనూ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు నిలకడగా వస్తుండటం, కొత్త యూనికార్న్‌లు ఆవిర్భవిస్తుండటం మొదలైనవి సానుకూలాంశాలని గ్రాంట్ థార్న్టన్ భారత్ పార్ట్నర్ (గ్రోత్) శాంతి విజేత తెలిపారు. మౌలిక సదుపాయాలు, బ్యాంకింగ్‌లాంటి రంగాలపై ఇన్వెస్టర్లు ఆసక్తి కనపరుస్తున్నారని వివరించారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → జూన్ త్రైమాసికంలో 5.4 బిలియన్ డాలర్ల విలువ చేసే 197 ఎంఅండ్ఏ లావాదేవీలు నమోదయ్యాయి. 2023 క్యూ2 తర్వాత ఇది కనిష్ట స్థాయి. తాజా క్యూ2లో బిలియన్ డాలర్ డీల్ ఒకే ఒక్కటి (యస్ బ్యాంక్‌లో సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ 1.57 బిలియన్ డాలర్ల పెట్టుబడి) నమోదైంది. 2025 క్యూ1లో ఇలాంటి డీల్స్ నాలుగు ఉన్నాయి. → పీఈ కార్యకలాపాలు, గత త్రైమాసికంతో పోలిస్తే తగ్గినప్పటికీ 2022 నాలుగో త్రైమాసికం తర్వాత అత్యధిక స్థాయిలో 7.5 బిలియన్ డాలర్ల విలువ చేసే 357 డీల్స్ నమోదయ్యాయి. → క్యూ2లో పబ్లిక్ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణ పెద్దగా జరగలేదు. వరుసగా మూడో త్రైమాసికంలోనూ ఐపీవో కార్యకలాపాలు నెమ్మదించాయి. జూన్ త్రైమాసికంలో కంపెనీలు 12 ఐపీవోల ద్వారా 1.9 బిలియన్ డాలర్లు సమీకరించాయి. క్రితం త్రైమాసికంతో పోలిస్తే డీల్స్ పరిమాణం 25 శాతం, విలువ 26 శాతం తగ్గింది. → అయితే, జూన్‌లో పరిస్థితులు కాస్త మెరుగుపడుతున్న సంకేతాలు కనిపించాయి. నెలలవారీగా చూస్తే, ఈ ఏడాది మొత్తం మీద అత్యధిక సంఖ్యలో ఐపీవోలు, నిధుల సమీకరణ విషయంలో జూన్ రెండో స్థానంలో నిల్చింది. లీలా హోటల్స్ (407 మిలియన్ డాలర్లు), ఏథర్ ఎనర్జీ (343 మిలియన్ డాలర్లు), ఏజిస్ వొప్యాక్ టెరి్మనల్స్ (326 మిలియన్ డాలర్లు) లాంటి పెద్ద లిస్టింగ్‌లు నమోదయ్యాయి. → దాదాపు క్రితం త్రైమాసికం తరహాలోనే క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్‌కి (క్యూఐపీ) సంబంధించి 2.2 బిలియన్ డాలర్ల విలువ చేసే 16 ఇష్యూలు నమోదయ్యాయి. -
RRR: ‘ఆర్ఆర్ఆర్’ పనులు షురూ!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘రీజనల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్)’ అలైన్మెంట్ ఖరారు పనులు మొదలయ్యాయి. ప్రాజెక్టు కన్సల్టెంట్ సంస్థ కేఅండ్‌జే ప్రైవేటు లిమిటెడ్.. నాలుగు రోజులుగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్)కు 50–70 కిలోమీటర్ల అవతల 339 కిలోమీటర్ల పొడవున రీజనల్ రింగు రోడ్డును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిని రెండు భాగాలుగా విభజించారు. అందులో ఉత్తర భాగం అయిన సంగారెడ్డి–నర్సాపూర్–తూప్రాన్–గజ్వేల్–ప్రజ్ఞాపూర్–జగదేవ్‌పూర్–యాదగిరిగుట్ట–భువనగిరి–చౌటుప్పల్ వరకు ఉండే 164 కిలోమీటర్ల రోడ్డును కేంద్ర ప్రభుత్వం భారత్‌మాల పరియోజన ప్రాజెక్టులో చేర్చింది. ఈ భాగం నిర్మాణానికి రూ.9,500 కోట్లు ఖర్చవుతాయని ప్రస్తుత అంచనా. ఈ భాగానికి సంబంధించి తుది అలైన్మెంట్ ఖరారు పనిని కన్సల్టెన్సీ సంస్థ ప్రారంభించింది. ప్రాథమిక అలైన్మెంట్ వెంట.. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును ప్రతిపాదించిన సమయంలో కన్సల్టెన్సీ సేవలు అందించిన బెంగుళూరు సంస్థ ప్రాథమికంగా ఒక అలైన్‌మెంటును నిర్ధారించింది. అక్షాంశ, రేఖాంశాలు, గూగుల్ మ్యాప్ ఆధారంగా దానిని రూపొందించారు. ఇప్పుడా అలైన్మెంట్ ఆధారంగానే క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నారు. మార్గమధ్యలో నీటి వనరులు, భారీ నిర్మాణాలు, కొండలు, గుట్టల వంటివి ఎక్కడైనా అడ్డుగా వస్తాయా అనేది పరిశీలించి.. రోడ్డు అలైన్‌మెంట్‌ను పక్కకు మార్చనున్నారు. ముఖ్యంగా ఇటీవల పలు ప్రాంతాలకు కాళేశ్వరం నీటిని తరలించే కాల్వలు నిర్మించారు. ఆయాచోట్ల పరిస్థితికి తగినట్టు అలైన్మెంట్లో మార్పులు, చేర్పులు చేయనున్నారు. రీజనల్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టులో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని.. త్వరగా కసరత్తు పూర్తి చేయాలని కన్సల్టెన్సీని కేంద్రం ఆదేశించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రెండు మూడు నెలల్లో అలైన్మెంట్ ఖరారు పూర్తిచేసి, ఏయే ప్రాంతాల్లో ఎంత భూమి సేకరించాలనే విషయంలో స్పష్టత ఇచ్చే దిశగా కన్సల్టెన్సీ చర్యలు చేపట్టినట్టు సమాచారం. ►ఆర్ఆర్ఆర్ను ప్రస్తుతం నాలుగు వరుసల్లో ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించనున్నారు. భవిష్యత్తులో ఎనిమిది వరుసలకు విస్తరిస్తారు. ఇందులో ప్రధాన రోడ్డుతోపాటు సర్వీసు రోడ్లు ఉంటాయి. మొత్తం ఎనిమిది వరుసల రహదారి 80 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. మరో 20 మీటర్ల అదనపు స్థలాన్ని చేర్చి.. 100 మీటర్ల వెడల్పు ఉండేలా భూమిని సేకరించనున్నారు. నేతల ఒత్తిళ్ల మధ్య.. రీజనల్ రింగు రోడ్డు ప్రతిపాదన రాగానే నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆయా ప్రాంతాల్లో రైతులను మభ్యపెట్టి తక్కువ ధరకే భూములు కొన్నారు. ఇప్పుడా భూములకు చేరువగా రోడ్డు ఉండాలని, అదే సమయంలో తమ స్థలాలపై నుంచి నిర్మించవద్దని ఆశిస్తున్నారు. కాస్త పలుకుబడి ఉన్న బడా వ్యక్తులు అలైన్మెంట్ ఖరారుపై ప్రభావం చూపేలా ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కానీ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని, అలైన్‌మెంట్‌కు సంబంధించి స్థానికంగా ఎలాంటి ప్రకటనలూ చేయొద్దని కన్సల్టెన్సీని కేంద్రం ఆదేశించినట్టు తెలిసింది. ఆర్ఆర్ఆర్ను ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మిస్తుండటంతో వంపులు లేకుండా చూడాలని స్పష్టం చేసినట్టు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ దక్షిణ భాగంపై పరిశీలన రీజనల్ రింగు రోడ్డు ఉత్తర భాగాన్ని కేంద్రం జాతీయ రహదారి కింద నిర్మిస్తోంది. ఈ భాగంలో ప్రతిపాదిత పట్టణాలను అనుసంధానిస్తూ ఇప్పటికే రోడ్లు ఉన్నాయి. వాటిమీదుగా పెద్ద సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తున్నాయి. దీనిని ఆసరా చేసుకుని కొత్తరోడ్డు నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంలో ప్రతిపాదిత పట్టణాల (చౌటుప్పల్–ఇబ్రహీంపట్నం–కందుకూరు–అమన్‌గల్–చేవెళ్ల–శంకర్పల్లి–కంది–సంగారెడ్డి)లను అనుసంధానిస్తూ పెద్ద రోడ్లు లేవు. ఎన్ని వాహనాలు తిరుగుతాయన్న స్పష్టత లేదు. దీంతో ఆ లెక్కలు తేల్చాలని జాతీయ రహదారుల విభాగాన్ని కేంద్రం ఆదేశించింది. అధికారులు అధ్యయనం చేసి వారం క్రితం కేంద్రానికి నివేదిక ఇచ్చారు. ఈ భాగాన్ని కూడా కేంద్రమే నిర్మించడంపై త్వరలో స్పష్టత రానుంది. -
హెచ్‌డీఎఫ్‌సీకి కన్సల్టెన్సీ సంస్థ టోకరా
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ప్రయివేటురంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీకి ఉద్యోగ కన్సల్టెన్సీ సంస్థ భారీ టోకరా ఇచ్చింది. నకిలీ ఆదాయ పత్రాలు, ఇతర దొంగ సర్టిఫికెట్లతో బ్యాంకులో ఉద్యోగాలను సాధించింది. బ్యాంకు మేనేజర్ స్థాయినుంచి ఇతర ఉద్యోగాలను ఇలా అక్రమ పద్ధతుల్లో సాధించింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బ్యాంకు సదరు కన్సల్టెన్సీ సంస్థపై కేసు నమోదు చేసింది. గుర్గావ్ కు చెందిన అడెకో కన్సల్టెన్సీ ఈ మోసానికి పాల్పడింది. అక్రమ పద్దతుల్లో బ్యాంకు మేనేజర్ సహా 68 ఉద్యోగులను హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సాధించింది. ఇందుకు సదరు అభ్యర్థులనుంచి భారీ ఎత్తున డబ్బులను తీసుకుంది. నకిలీ సాలరీ స్లిప్పులు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ల ద్వారా ఈ ఉద్యోగాలను పొందిందని బ్యాంకు ఆరోపించింది. 2017, ఫిబ్రవరిలో గీతాంజలి బగ్గా అసిస్టెంట్ మ్యానేజర్గా ఉద్యోగం పొందారు. అయితే రిఫరెన్స్ తనిఖీలో ఆ ఉద్యోగి నకిలీ సర్టిఫికెట్లు చూపించినట్టు తేట తెల్లమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన అంతర్గత విచారణలో అడెకో కన్సల్టెన్సీకి చెందిన అమిత్ చౌదరి అనే వ్యక్తికి రూ. 60వేలు చెల్లించినట్లు బగ్గా వెల్లడించారు. దీంతో తీగ లాగితే.. మిగతా 68 మంది ఉద్యోగుల డొంక కదిలింది. ఇలా మాజీ మేనేజర్ సత్యేంద్ర తన ఎంపికకు రూ .1.45 లక్షలు చెల్లించారని స్పష్టమైంది. ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించిన హెచ్డీఎఫ్సీ అమిత్ చౌదరి సహా, బ్యాంకు ఉద్యోగులు కోహల్ కుష్వాహా, విశాల్ పాండేలపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. -
త్వరలో దేశీ ఈ-కామర్స్ 35 బిలియన్ డాలర్లకు
న్యూఢిల్లీ: భారత ఈ-కామర్స్ రంగ వృద్ధి పటిష్టంగా ఉందని, 2019 నాటికి 35 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని కన్సల్టెన్సీ సంస్థ నొమురా ఒక నివేదికలో పేర్కొంది. అయితే, లాభదాయకతపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వివరించింది. ఈ దిశగా ప్రస్తుతం కొంత పురోగతి కనిపిస్తోందని నొమురా తెలిపింది. కేటగిరీల్లో వైవిధ్యం, డిస్కౌం టింగ్ తగ్గించడం, రవాణా మెరుగుపర్చుకోవడం, జీఎస్టీ వంటి చట్టాల అమలు మొదలైన అంశాలపై మరింతగా కసరత్తు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. భారత్‌లో ఈ-కామర్స్ సంస్థలకు పండుగ సీజన్ అమ్మకాలు భారీగానే ఉన్నప్పటికీ, చైనా.. అమెరికాతో పోలిస్తే ఇప్పటికీ తక్కువ స్థాయిలోనే ఉన్నాయని నొమురా వివరించింది. గతేడాది నవంబర్ 11న చైనాలో అలీబాబా సంస్థ సింగిల్స్ డే నాడు ఏకంగా 9 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిపింది. అలాగే 2014లో సైబర్ మండే, బ్లాక్ ఫ్రైడే రోజుల్లో అమెరికాలో అమ్మకాలు చెరి 3 బిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. మరోవైపు, భారత్‌లో హాలిడే అమ్మకాలు త్రైమాసికానికి 4 బిలియన్ డాలర్లుగా నొమురా అంచనా వేసింది. దేశీ ఈ-కామర్స్ కంపెనీల వార్షిక అమ్మకాల్లో సుమారు 35-40% వాటా పండుగ సీజన్‌దే (అక్టోబర్-డిసెంబర్) ఉంటోంది.