breaking news
companies deregistered
-
చైనాకు అమెరికా భారీ షాక్..
వాషింగ్టన్ : ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అలీబాబా, బైదూ ఇంక్ వంటి చైనా కంపెనీలను అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్ల నుంచి తొలగించేందుకు దారితీసే తీర్మానాన్ని అమెరికన్ సెనేట్ ఆమోదించింది. చైనా కంపెనీల డీలిస్టింగ్‌తో పాటు విదేశీ కంపెనీల ప్రాధాన్యతను తగ్గించేలా బిల్లును రూపొందించింది. చైనా కంపెనీల్లో అమెరికన్ల నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేలా కీలక బిల్లును ఆమోదింపచేసింది. రిపబ్లికన్, డెమొక్రాట్ సెనేటర్లు జాన్ కెన్నెడీ, క్రిస్ వాన్ హాలెన్ ప్రతిపాదించిన బిల్లును యూఎస్ సెనేట్ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. చైనా దిగ్గజ కంపెనీల్లో కోట్లాది డాలర్లను పెట్టుబడుల రూపంలో కుమ్మరించడం పట్ల చట్టసభ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పెన్షన్ ఫండ్లు, విద్యా సంస్ధల నిధులను సైతం ఆకర్షణీయ రాబడుల కోసం చైనా కంపెనీల్లో మదుపు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ కంపెనీలకు చెక్ చైనా కంపెనీలను టార్గెట్‌గా చేసుకున్న ఈ బిల్లులో పొందుపరిచిన అంశాలను చూస్తే..విదేశీ ప్రభుత్వ నియంత్రణలో పనిచేయడం లేదని కంపెనీలు స్పష్టం చేయని పక్షంలో వరుసగా మూడేళ్లు కంపెనీ ఆడిటింగ్‌ను పబ్లిక్ కంపెనీ అకౌంటింగ్ పర్యవేక్షక బోర్డు ఆడిట్ చేయకుండా, ఆయా కంపెనీల షేర్లను ఎక్స్ఛేంజ్ల నుంచి నిషేధించేలా ఈ బిల్లును రూపొందించారు. కాగా, నియమాలకు అనుగుణంగా చైనా నడుచుకోవాలని తాను కోరుకుంటున్నానని సెనేట్‌లో బిల్లును ప్రతిపాదిస్తూ కెన్నెడీ పేర్కొన్నారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో లిస్టయిన కంపెనీలన్నీ ఒకే ప్రమాణాలను కలిగిఉండాలని, ఈ బిల్లు ఆ ప్రమాణాలను తీసుకురావడంతో పాటు ఇన్వెస్టర్లు మెరుగైన నిర్ణయాలు తీసుకునేలా పారదర్శకత అందిస్తుందని మరో సెనేటర్ వాన్ హోలెన్ అన్నారు. చదవండి : అమెరికా కీలక ముందడుగు డ్రాగన్ కంపెనీలకు గడ్డుకాలం చైనా కంపెనీలపై కొరడా ఝళిపించే బిల్లును తీసుకురావడంతో జాక్‌మాకు చెందిన యాంట్ ఫైనాన్షియల్ నుంచి సాఫ్ట్‌బ్యాంక్‌కు చెందిన బైట్‌డ్యాన్స్ లిమిటెడ్ వంటి పలు చైనా కంపెనీల లిస్టింగ్ ప్రణాళికలకు విఘాతం కలిగింది. ఈ బిల్లుతో రానున్న రోజుల్లో అమెరికన్ స్టాక్ఎక్స్ఛేంజ్ల్లో లిస్టయిన చైనా కంపెనీలన్నింటికీ ఇబ్బందులు తప్పవని బీజింగ్‌కు చెందిన స్టాక్‌మార్కెట్ నిపుణులు, పోర్ట్‌ఫోలియో మేనేజర్ హల్క్స్ వ్యాఖ్యానించారు. అమెరికాలో ఉన్న చైనా ఆడిటర్స్పైనా బిల్లు ప్రభావం చూపనుంది.ఇక అమెరికా-చైనా ట్రేడ్‌వార్ ఉద్రిక్తతల నుంచి కరోనా మహమ్మారిపై ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా బెడిసికొట్టిన నేపథ్యంలో డ్రాగన్ కంపెనీలను టార్గెట్ చేస్తూ అగ్రరాజ్యం ఈ బిల్లును తీసుకురావడం గమనార్హం. -
2.26 లక్షల కంపెనీలు డీరిజిస్ట్రర్
సాక్షి, న్యూఢిల్లీ : రెగ్యులేటరీ నిబంధనలను పాటించకపోవడంతో 2.26 లక్షలకు పైగా కంపెనీలను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీల నుంచి తీసివేసినట్టు ప్రభుత్వం నేడు ప్రకటించింది. వీటిలో ఎక్కువ సంస్థలు మహారాష్ట్రకు చెందినవేనని ప్రభుత్వం తెలిపింది. 2.97 లక్షల కంపెనీలు గత రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల నుంచి తమ వార్షిక రిటర్నులను దాఖలు చేయడం లేదని 2017-18లో ఆర్ఓసీ గుర్తించిందని, వారు ఎలాంటి కార్యకలాపాలను కూడా చేపట్టడం లేదని కార్పొరేట్ వ్యవహారాల మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం లోక్‌సభకు నివేదించారు. గుర్తించిన కంపెనీల్లో 2.26 లక్షల కంపెనీలను కంపెనీల యాక్ట్ 2013 సెక్షన్ 248 కింద ఆర్ఓసీ తొలగించింది అని తెలిపారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కంపెనీల యాక్ట్ సెక్షన్ 248ను అమలు చేస్తుంది. దీని ప్రకారం దీర్ఘకాలికంగా ఎలాంటి కార్యకలాపాలు నిర్వర్తించకుండా హవాలా లావాదేవీలు నడుపుతున్న కంపెనీల పేర్లను రిజిస్ట్రార్ నుంచి తొలగిస్తారు. మొత్తం డీరిజిస్ట్రర్ అయిన సంస్థల్లో ఎక్కువగా మహారాష్ట్రకు చెందినవే ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి దాదాపు 59,849 కంపెనీలు డీరిజిస్ట్రర్ అయ్యాయి. తర్వాత 43,925 కంపెనీలతో ఢిల్లీ, 24,723 కంపెనీలతో తమిళనాడు, 18,165 కంపెనీలతో కర్నాటక, 16,817 కంపెనీలతో తెలంగాణ, 11,389 కంపెనీలతో గుజరాత్‌లు ఉన్నాయి. దీర్ఘకాలికంగా కార్యకలాపాలు కొనసాగించని కంపెనీల పేర్లనే తొలగించినట్టు అరుణ్‌జైట్లీ తెలిపారు. -
2 లక్షల పైన కంపెనీలపై ప్రభుత్వం వేటు
సాక్షి, న్యూఢిల్లీ : షెల్ కంపెనీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. 2.09 లక్షలకు పైగా సంస్థలను ప్రభుత్వం డీరిజిస్టర్ చేసింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు వీటిని డీరిజిస్టర్ చేస్తున్నట్టు మంగళవారం ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాక ఆ కంపెనీల బ్యాంకు అకౌంట్లను నియంత్రిస్తూ చర్యలు కూడా ప్రారంభించింది. ఈ కంపెనీలు చట్టబద్ధంగా పునరుద్దరించబడే వరకు ఈ సంస్థల బ్యాంకు అకౌంట్లను ఆపరేట్ చేయడానికి వీలు లేదంటూ ప్రభుత్వం ఆదేశించింది. '' కంపెనీల యాక్ట్ సెక్షన్ 248(5) కింద 2,09,032 పేర్లను రిజిస్టర్ కంపెనీల నుంచి తొలగించాం. వీటి ప్రస్తుత డైరెక్టర్లు, అధికారిక సంతకాలు ఇక మాజీ డైరెక్టర్లు, మాజీ అధికారిక సంతకాలుగా మారాయి'' అని అధికారిక ప్రకటన వెలువడింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న కంపెనీల చట్టం సెక్షన్ 248 ప్రకారం పలు కారణాలచే కంపెనీల పేర్లను రిజిస్టర్ జాబితా నుంచి తొలగించే అధికారం ఉందని ప్రభుత్వం తెలిపింది. నిలిపివేయబడినవి(స్ట్రక్ ఆఫ్) నుంచి యాక్టివ్‌లోకి వీటి స్టేటస్‌లోకి మారినప్పుడు మాత్రమే వీటిని చట్టబద్ధంగా మళ్లీ పునరుద్ధరించడం జరుగుతుందని చెప్పింది. నిలిపివేయబడ్డ ఈ కంపెనీల బ్యాంకు అకౌంట్ల ఆపరేషన్లను నియంత్రించే చర్యలు కూడా తీసుకోబడుతున్నాయని ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది.


