breaking news
commondar level
-
సురోవికిన్ కూడా వాగ్నర్ సభ్యుడే
న్యూయార్క్: రష్యాలో వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు ఘటన అక్కడి మిలటరీలో లుకలుకలను ఒకటొకటిగా బయట పెడుతోంది. తాజాగా, రష్యా టాప్ మిలటరీ కమాండర్ జనరల్ సెర్గెయ్ సురోవికిన్ వాగ్నర్ గ్రూప్‌లో రహస్య వీఐపీ సభ్యుడని తెలిపే కొన్ని పత్రాలు దొరికినట్లు సీఎన్ఎన్ పేర్కొంది. వాగ్నర్ వీఐపీ సభ్యుడిగా సురోవికిన్ పేరు 2018లో నమోదైనట్లు అందులో తెలిపింది. ఆయనతోపాటు మరో 30 మంది రష్యా సీనియర్ మిలటరీ, ఇంటెలిజెన్స్ అధికారులు కూడా వాగ్నర్ వీఐపీ సభ్యులని పేర్కొంది. వాగ్నర్ సభ్యుడిగా సురోవికిన్ ఉన్నారనేందుకు కచ్చితమైన ఆధారాలేవీ లేనప్పటికీ, రష్యా సైనిక బలగాల్లోని చాలా మంది సీనియర్ అధికారులు వాగ్నర్ గ్రూప్‌తో దగ్గరి సంబంధాలు సాగించేందుకు అవకాశం ఉందని సీఎన్ఎన్ కథనం పేర్కొంది. ఇలాంటి దగ్గరి సంబంధాల వల్లే వాగ్నర్ కిరాయి సైనికులు రొస్తోవ్‌లోని కీలక మిలటరీ బేస్‌నుæ శ్రమ లేకుండా స్వాధీనం చేసుకోగలిగారన్న అనుమానా లున్నాయి. తిరుగుబాటు అనంతరం సురోవికిన్ కనిపించకుండా పోయారు. ప్రిగోజిన్ తిరుగుబాటు విషయం ఆయనకు తెలుసునంటూ న్యూయార్క్‌టైమ్స్ కథనం పేర్కొంది. ప్రిగోజిన్‌ను తిరుగుబాటు ఆపేయాలంటూ విడుదల చేసిన వీడియోలో సురోవికిన్ తడబడుతూ మాట్లాడుతున్నట్లు కనిపించారు. దీంతో, ఆయన మానసిక ఆరోగ్యంపైనా అనుమానాలున్నాయి. జనర ల్ ఆర్మగెడ్డాన్గా పిలుచుకునే సురోవికిన్ అధ్యక్షుడు పుతిన్‌కు నిన్నటిదాకా నమ్మినబంటు. తాజా పరిణామాలతోనూ ఆయన్ను పుతిన్ నమ్ముతారా అన్నది తేలాల్సి ఉంది. -
దళ కమాండర్ లొంగుబాటు
ఖమ్మం : ఖమ్మం జిల్లాలోని తెలంగాణ-చత్తీస్ఘడ్ సరిహద్దులో మావోయిస్టు దళ కమాండర్ శ్యామల దుర్గయ్య అలియాస్ దర్మన్న పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఈయనపై చత్తీస్ఘడ్, తెలంగాణా రాష్ట్రాలలో 20కి పైగా కేసులు ఉన్నాయి. దర్మన్న మూడు రోజుల కిందటే భద్రాచలం ఏఎస్పీ భాస్కరన్ ఎదుట లొంగిపోయారు. శనివారం విలేకర్ల ముందు ప్రవేశపెట్టారు. (కొత్తగూడెం) -
నలుగురు మావోయిస్టుల లొంగుబాటు
పాడేరు: విశాఖపట్నం పాడేరులో దళ కమాండర్ స్థాయి ఉన్న నలుగురు మావోయిస్టులు జిల్లా ఎస్పీ ఎదుట లోంగిపోయారు. ఈ సంఘటన ఒరిస్సా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. లొంగిపోయిన నలుగురు నక్సల్స్‌లో ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరి పేరున రాష్ట్ర ప్రభుత్వం గతంలో రూ. 4 లక్షల రివార్డు ప్రకటించింది. లొంగిపోయిన మావోయిస్టులు మంగోలీ పాడియా అలియాస్ అర్జున్, రమామది అలియాస్ అనిత, గంగికోడిమ అలియాస్ సంగీత, కుజిమాజోలీ అలియాస్ గీత. కాగా ఆరోగ్య కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని లొంగిపోయిన మావోయిస్టులు తెలిపారు.