breaking news
committee elect
-
మున్సిపల్ కార్మికుల సమస్యలపై సీఎం వైఎస్ జగన్ స్పందన
-
AP: వాళ్ల సమస్యలను వెంటనే పరిష్కరించండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గృహ నిర్మాణాలకు వనరుల విషయంలో దృష్టిసారించాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏపీలో గృహనిర్మాణశాఖపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఇవాళ(సోమవారం) సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఏపీలో మున్సిపల్ కార్మికుల సమస్యలపై సీఎం వైఎస్ జగన్ స్పందించారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి హై పవర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్‌లతో కూడిన హై పవర్ కమిటీని సమస్య పరిష్కారం కోసం నియమించినట్టు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: గృహ నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష.. వనరులపై దృష్టిసారించాలని ఆదేశం -
ఎక్సైజ్ కానిస్టేబుళ్ల కార్యవర్గం ఎన్నిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : స్థానిక ఎన్జీఓ కార్యాలయంలో ఆదివారం ఎక్సైజ్ కానిస్టేబుల్, హె డ్ కానిస్టేబుల్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అ« ద్యక్ష, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్ష, ట్రెజరర్ల ఎంపిక కోసం ఎన్నికలు నిర్వహించారు అధ్యక్షుడిగా బాలాజి నాయక్, ప్రధాన కార్యదర్శిగా క్రిషారెడ్డి, ఉపాధ్యక్షులుగా నారాయణ స్వామి, ట్రెజరర్‌గా గౌస్ ఖాన్ æగెలుపొందారు. గౌరవ అధ్యక్షుడిగా క్రిష్ణా నాయక్, కార్యనిర్వహక కార్యదర్శిగా రామలింగ, సహాయ కార్యదర్శులుగా కవీంద్ర, పెన్నయ్య, మీడియా ప్రతిని ధులుగా బాబు, హనుమంతారెడ్డిలు, కార్యని ర్వహక సభ్యులుగా భీమప్ప, బాలక్రిష్ణ, వాసు, విశ్వనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికాలుగా తాడిపత్రి సీఐ నరసింహులు, గుత్తి సీఐ రాజశేఖర్ గౌడ్, కంబదూరు సీఐ విశ్వనాథ్ రెడ్డి, ఎస్ఐ అశ్వర్థరెడ్డి వ్యవహరించారు.