breaking news
Colombia team
-
కొలంబియా ముందుకు...
గ్వాడలహారా (మెక్సికో): ప్రత్యర్థి జట్టును తక్కువ అంచనా వేయకుండా ఆడిన కొలంబియా జట్టు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో వరుసగా రెండో విజయం సాధించింది. గ్రూప్ ‘కె’లో భాగంగా కాంగో జట్టుతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో కొలంబియా 1–0 గోల్ తేడాతో గెలిచింది. 76వ నిమిషంలో డేనియల్ మునోజ్ ఏకైక గోల్ చేసి కొలంబియా జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో కొలంబియా నాకౌట్ దశకు అర్హత సాధించింది. క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పటిష్టమైన పోర్చుగల్ జట్టును తొలి మ్యాచ్‌లో 1–1తో నిలువరించిన కాంగో జట్టు ఈ మ్యాచ్‌లోనూ కొలంబియాకు గట్టిపోటీ ఇచ్చింది. తొలి 20 నిమిషాల్లో కొలంబియా ఐదుసార్లు గోల్ చేసేందుకు అవకాశాలు సృష్టించుకున్నా కాంగో గోల్‌కీపర్ లియోనెల్ ఎంపాసి అడ్డుగోడలా నిలబడ్డాడు. ఎట్టకేలకు 76వ నిమిషంలో కొలంబియా ఖాతా తెరిచింది. యువాన్ క్వింటెరో అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో అడ్డుకోవడంలో కాంగో డిఫెండర్లు విఫలమయ్యారు. అక్కడే ఉన్న మునోజ్ కాంగో గోల్‌కీపర్‌కు అవకాశం ఇవ్వకుండా బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. 52 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో మళ్లీ ఆడుతున్న కాంగో జట్టుకు ఈ ఓటమితో నాకౌట్ దశ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఘనా 0–0 ఇంగ్లండ్ బోస్టన్: గత నాలుగు ప్రపంచకప్‌లలో ఘనా జట్టు తమ రెండో లీగ్ మ్యాచ్‌లో ఓడిపోలేదు. అదే రికార్డును ఐదో ప్రపంచకప్‌లోనూ కొనసాగించింది. గ్రూప్ ‘ఎల్’లో భాగంగా మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌ను ఘనా 0–0తో ‘డ్రా’గా ముగించింది. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్‌తో సహా ఇతర ఆటగాళ్లు 19 సార్లు ఘనా గోల్‌పోస్ట్ లక్ష్యంగా షాట్లు సంధించినా గోల్ మాత్రం చేయలేకపోయారు. మరోవైపు ఘనా జట్టు రక్షణాత్మక ఆటతీరుకే ప్రాధాన్యం ఇచ్చింది. ఆ జట్టు రెండుసార్లు మాత్రమే ఇంగ్లండ్ గోల్‌పోస్ట్‌పై దాడులు చేసింది. తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4–2తో క్రొయేషియాపై, ఘనా 1–0తో పనామాపై గెలిచాయి. ప్రస్తుతం ఇంగ్లండ్, ఘనా జట్లు నాలుగు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి.గెలిచి నిలిచిన క్రొయేషియాటొరంటో: గత రెండు ప్రపంచకప్‌లలో సెమీఫైనల్ చేరిన క్రొయేషియా జట్టు ఖాతాలో తొలి విజయం చేరింది. గ్రూప్ ‘ఎల్’లో భాగంగా పనామా జట్టుతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో క్రొయేషియా 1–0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 54వ నిమిషంలో కుడి వైపు నుంచి జోసిప్ స్టానిసిక్ అందించిన క్రాస్ పాస్‌ను ‘డి’ ఏరియా లోపల యాంటె బుడిమిర్ లక్ష్యానికి చేర్చాడు. ఈ విజయంతో క్రొయేషియా మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. నాకౌట్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. -
కొలంబియా హైటెక్ ముఠా అరెస్ట్
బనశంకరి : నగరంలో చోరీలకు పాల్పడుతున్న కొలంబియా దేశానికి చెందిన హైటెక్ ముఠాను జయనగర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.80 లక్షల విలువ చేసే వజ్రం, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ తెలిపారు. మంగళవారం నగరంలో విలేకరుల సమావేశంలో సునీల్‌కుమార్ వివరాలను వెల్లడించారు. కొలంబియా దొంగల అరెస్ట్‌తో విశ్రాంత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ముఖర్జీ, సదాశివనగరలో మాజీ ఎమ్మెల్యే ఇళ్ల్లలో చోరీ కేసుల ఆచూకీ లభించింది. గత మేనెలలో కొలంబియా నుంచి ఢిల్లీకి చేరుకుని అక్కడ నుంచి బెంగళూరు వచ్చి ఓ విల్లాను అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. నిందితులు బోగూటౌదజోస్ ఎడ్వర్డ్స్ అరివాలో బర్బానో, గుస్తావోఅడాల్పోజరామిల్లోజరాల్డో, యామిర్ అల్బరాట్సస్యాంచియాస్, ఎడ్వర్డ్స్ ఎలెక్సిస్గార్సియాపరమోతో పాటు కింబర్లి గుటియారిస్ అనే మహిళ కూడా ఈ ముఠా సభ్యురాలు. ఐదుగురు ముఠా జేపీ.నగర, హెచ్ఎస్ఆర్.లేఔట్, హెచ్ఏఎల్, బాణసవాడి, జయనగర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. బెంగళూరు నగరంలో శ్రీమంతులు అధికంగా నివసించే ప్రాంతా లను గూగల్‌లో గాలించి వారి ఇళ్లలో చోరీలకు తెగబడుతున్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. పోలీసులకు పట్టుబడిన దొంగల్లో జోస్ హైస్కూల్ వరకు విద్యనభ్యసించగా, గుస్తావో ఎంబీఏ పట్టభద్రుడు, యామిర్ వెల్డర్‌గా ట్రైనింగ్ చేశాడు. ఎడ్వర్డ్ çఫుడ్హ్యాండింగ్ కోర్సు పూర్తిచేయగా, మహిళ కింబర్లి బిజనెస్ టెక్నాలజీ డిగ్రీ మధ్యలో నిలిపివేసి నేరకార్యకలాపాల్లో భాగస్వాములయ్యారు. జైలు పక్షులు పోలీసులకు పట్టుబడిన కొలింబియా దొంగల గ్యాంగ్‌లో జోస్ కొలంబియాలో అక్రమంగా పిస్తోల్ కలిగి ఉన్నందుకు 5 నెలల శిక్ష అనుభవించాడు. 2016లో ఇద్దరు స్నేహితులతో కలిసి నేపాల్ ద్వారా భారత్ అక్కడనుంచి బెంగళూరు నగరానికి చేరుకుని నగరంలో ఆఫ్రికన్‌తో పరిచయం చేసుకుని ఇళ్లల్లో చోరీలకు పాల్పడేవాడు. గుస్తావో 1996లో కొలంబియా పోలీస్ అధికారి కుమారుడి హత్యకేసులో 16 ఏళ్లు జైలుశిక్షను అనుభవించాడు. యామిర్ మెక్సికోలో చిన్నపాటి ఉద్యోగం చేశాడు. 2015లో ఇతను అక్రమ వీసా కారణంగా అతడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఎడ్వర్డ్స్గ్రాసియా, మహిళ కింబర్లి ఇద్దరు అక్రమ వీసాతో జైలు శిక్షను అనుభవించారు. వీరిందరికీ స్పానిష్ భాష మాత్రమే తెలియగా వీరిలో యామిర్కు ఇంగ్లీష్ కూడా వస్తుంది. జీపీఎస్ ద్వారా ఇళ్లు గుర్తింపు కొలంబియా ముఠా జీపీఎస్ మ్యాప్‌లో శ్రీమంతుల ఇళ్ల కోసం పగలు, రాత్రి సంచరించి ఇళ్ల వద్ద కార్లు ఉన్నాయా లేదా అని గుర్తించేవారు. మొదట ముఠాలోని ఓ మహిళ ఇంటి వద్దకు వెళ్లి కాలింగ్‌బెల్ నొక్కి ఇంటిలో ఎవరూ లేకపోతే ఆ సమాచారాన్ని వెంటనే సమీపంలోని గ్యాంగ్ సభ్యులకు వాకీటాకీ ద్వారా తెలిపేది. గ్యాంగ్ కు టూల్స్ తీసుకవచ్చి తలుపు బద్దలు కొట్టి చోరీలకు పాల్పడేవారు. దూరంలో కారులో కూర్చున్న సభ్యురాలు కింబర్లి వాకీటాకీలో సూచనలు చేస్తే నిఘాపెట్టేది. చోరీకి పాల్పడిన బంగారు ఆభరణాలను కరిగించి బంగారు బార్లను తయారు చేసేవారు. జయనగరలో గతనెలలో చోటుచేసుకున్న చోరీ కేసు ఆచూకీ కనిపెట్టడానికి ప్రత్యేక పోలీస్ బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా విచారణ చేపట్టి జూలై నెలలో చోటుచేసుకున్న మరో చోరీ కేసును పరిశీలించి ఓఎల్ఎఫ్, ఫ్లిప్‌కార్టు తదితర ఇతర ఆన్లైన్ విక్రయాలపై నిఘా పెట్టారు. కారు కొనుగోలు చేసి విక్రయిస్తున్న డీలర్లను పరిశీలించగా కొలంబియా ముఠా ఆచూకీ లభించిందని సునీల్‌కుమార్ తెలిపారు. సమావేశంలో ఏసీపీ బీకే .సింగ్, డీసీపీ డాక్టర్ శరణప్ప తదితరులు పాల్గొన్నారు. -
కొలంబియాకు మూడో స్థానం
► అమెరికాపై 1-0తో విజయం ► కోపా అమెరికా కప్ గ్లెండేల్ (అమెరికా): కోపా అమెరికా కప్‌లో కొలంబియా జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఆతిథ్య అమెరికా జట్టుతో ఆదివారం మూడు, నాలుగో స్థానం కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో కొలంబియా 1-0 గోల్‌తో నెగ్గింది. స్ట్రయికర్ కార్లోస్ బాకా (31వ నిమిషంలో) కొలంబియా తరఫున ఏకైక గోల్ సాధించాడు. అర్జెంటీనాతో జరిగిన సెమీఫైనల్లో 0-4తో ఓడిన అమెరికా ఈ మ్యాచ్‌లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. గోల్ కీపర్ డేవిడ్ ఓస్పినా అడ్డుగోడలా నిలవడంతో పలు గోల్ ప్రయత్నాలు కూడా వమ్ము అయ్యాయి. ఈ టోర్నీలో కొలంబియా చేతిలో అమెరికా ఓడటం ఇది రెండోసారి. మ్యాచ్ తొలి 12వ నిమిషంలోనే స్టార్ ఆటగాడు జేమ్స్ రోడ్రిగ్వెజ్ గోల్ అవకాశాన్ని కీపర్ టిమ్ హోవర్డ్ అడ్డుకున్నాడు. అయితే ఆ తర్వాత అతనే ఇచ్చిన పాస్‌ను 31వ నిమిషంలో బాకా అతి సమీపం నుంచి గోల్ చేసి జట్టుకు ఆధిక్యం అందించాడు. ద్వితీయార్ధంలో డెంప్సీ ఫ్రీకిక్ దాదాపు గోల్‌పోస్టులోకి వెళ్లినట్టే అనిపించినా ఓస్పినా ఒంటి చేత్తో దాన్ని అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ నమోదు కాలేదు.


