breaking news
the Collective
-
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీవ్రతాలు
నిజామాబాద్‌కల్చరల్ : శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా నగరంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. పలు ఆలయాల్లో మహిళలు సామూహిక వ్రతాలు నిర్వహించగా, ఇళ్లల్లో కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని అందంగా అలంకరించి శ్రద్ధాసక్తులతో పూజలు చేశారు. కిషన్‌గంజ్‌లోని వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకుడు వేలేటి గౌరిశంకరశర్మ ఆధ్వర్యంలో వందలాది మంది సుహాసినులు(ముల్తైదువులు) సామూహిక వరలక్ష్మీవ్రతాలు నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా తల్లి సువర్ణ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు కొండ వీరశేఖర్గుప్తా, పార్శి మహేశ్వర్గుప్తా, కోశాధికారి రాజేశ్వర్గుప్తాతోపాటు పెద్దసంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. అలాగే న్యాల్కల్రోడ్లోని శృంగేరి శంకర మఠం– శ్రీలలితాదేవి ఆశ్రమాలయంలో వరలక్ష్మి వ్రతం, సామూహిక కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. -
వైద్య ఉద్యోగులు సమష్టిగా పనిచేయాలి
ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు బాలాజీనాయుడు రిమ్స్ (కడప అర్బన్) : ప్రభుత్వ వైద్య శాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న వైద్య ఉద్యోగులందరూ సమష్టిగా పనిచేయాలని ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీనాయుడు తెలిపారు. మంగళవారం కడప రిమ్స్‌లోని ఐపీ విభాగం కాన్ఫరెన్స్ హాలులో ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా సదస్సు నిర్వహించారు. బాలాజీనాయుడు మాట్లాడుతూ ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘమన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో వార్డు సిబ్బంది మొదలుకొని ల్యాబ్ టెక్నిషియన్స్, రేడియోగ్రాఫర్స్, ఫార్మసిస్ట్‌లు, నర్సింగ్ సిబ్బందికి పదోన్నతి అవకాశాలు, సంవత్సరానికి 35 రోజుల సాధారణ సెలవులు, వారాంతపు డే ఆఫ్‌లు, యూనిఫాం అలవెన్స్‌లతోపాటు అన్ని డిమాండ్లను సాధించామన్నారు. అన్ని పీఆర్సీలలోనూ మెరుగైన వేతనాలు, సాధారణ బదిలీలలో కౌన్సెలింగ్ విధానం సాధించామన్నారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్‌కు అన్ని వేళలా సహకరిస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మణమూర్తి, ఏఐటీయూసీ మాజీ అధ్యక్షుడు డబ్ల్యు రాము, కడప రిమ్స్ బ్యాచ్ అధ్యక్షుడు జీవయ్య, జిల్లా కన్వీనర్ కంభం చిన్నయ్య, ఏఐటీయూసీ నాయకుడు బాదుల్లా, నాయకులు నరహరి, స్టాఫ్ నర్సులు, వైద్య ఉద్యోగులు పాల్గొన్నారు.