breaking news
coconut 3
-
నారికేళం.. ధరహాసం
ద్వారకాతిరుమల: కొబ్బరికాయల ధర మరింత పెరిగింది. దీపావళి, ఆ తరువాత కార్తీకమాసం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కొబ్బరి కాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే కనీవినీ ఎరుగని రీతిలో ధరలు పెరగడంతో పలు క్షేత్రాలను సందర్శిస్తున్న భక్తులు కొబ్బరి కాయలు కొనలేక గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం రైతులు వెయ్యి కొబ్బరి కాయలను రూ. 27 వేలకు విక్రయిస్తున్నారు. చిన్నా, పెద్దా, లేత, ముదురు, ఎండు, పచ్చి అనే తేడా లేకుండా అన్ని రకాల కాయలను ఇదే ధరకు అమ్ముతున్నారు.ఇదిలా ఉంటే నెల రోజుల నుంచి రికార్డు స్థాయిలో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో కొబ్బరి కాయకు రూ.20 ధర రావడాన్ని రైతులు చూడలేదు. అలాంటిది ఊహించని విధంగా ఇప్పుడు ఇంత ధర పలుకుతుండటంతో రైతులు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరుస పండుగలు, ఆ తరువాత కార్తీకమాసం కావడంతో ధర అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే నారికేళం ధర ఇప్పట్లో దిగివచ్చేలా కనిపించడం లేదు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు ప్రస్తుతం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోజుకు 70 లారీలకు పైగా కొబ్బరి కాయలు గుజరాత్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మద్యప్రదేశ్, బీహార్, పశి్చమబెంగాల్కు ఎగుమతి అవుతున్నాయి. స్థానికంగా ధరల పెరుగుదలకు ఈ ఎగుమతులు కూడా ఒక కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మహారాష్ట్ర నుంచి డిమాండ్ ఉంటే నెల క్రితమే ఒక్కో కొబ్బరికాయ ధర రూ. 28కు చేరేదని అంటున్నారు. మొక్కుబడులు వాయిదా.. కోరిన కోర్కెలు తీరడంతో శ్రీవారి క్షేత్రానికి మొక్కులు చెల్లించేందుకు వస్తున్న భక్తులు కొబ్బరి కాయల ధరలను చూసి హడలిపోతున్నారు. ఈ క్రమంలోనే 101, ఆపై కొబ్బరి కాయల మొక్కుబడి ఉన్న పలువురు భక్తులు తమ మొక్కులను వాయిదా వేసుకుంటున్నారు. సామాన్య భక్తులు సైతం అంత ధర పెట్టి కొబ్బరికాయను కొనేందుకు ఆలోచిస్తున్నారు. దాంతో కొందరు వ్యాపారులు కొబ్బరికాయ రేటు చెబితే భక్తులు కొనడం లేదని గ్రహించి, పూజా సామాగ్రితో కలిపి సెట్టు రూ.100కు విక్రయిస్తున్నారు. కొబ్బరికాయల ధరలు మరింతగా పెరిగితే వ్యాపారాలు సాగడం కష్టమేనని అంటున్నారు.సైజును బట్టి ధర పుణ్యక్షేత్రాల్లో వ్యాపారులు ఒక్కో కొబ్బరి కాయను రూ.30 నుంచి రూ.45కు విక్రయిస్తున్నారు. రైతుల నుంచి అన్ని సైజుల కాయలను ఒకే ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు, వాటిని గ్రేడింగ్ చేసి అతి చిన్న కాయను రూ.30కు, మీడియం సైజు కాయను రూ.35 నుంచి రూ. 40కు, పెద్ద కాయను రూ. 45 నుంచి రూ.50కు విక్రయిస్తున్నారు. దాంతో ద్వారకాతిరుమల దివ్య క్షేత్రాన్ని సందర్శిస్తున్న భక్తులు కొబ్బరి కాయలు కొనేందుకు గగ్గోలు పెడుతున్నారు. -
తల లేకున్నా గెల వేసింది.
అమలాపురం : అరటి చెట్టు కొన్నాళ్లు ఎదిగాక, మొవ్వు నుంచి కోటాకు వేసి, ఆనక దాన్నుంచి పువ్వు వచ్చి, అది గెలగా అభివృద్ధి చెందుతుంది. ఇదీ ఏ అరటి చెట్టయినా ఫలసాయాన్నిచ్చే క్రమం. అయితే ఓ అరటిచెట్టును మొదలంటా నరికేసినా.. తల లేని మెండెం లాంటి మొదలు నుంచే గెల వేసి, కాయలు ఏపుగా ఎదుగుతున్నాయి. కొత్తపేట మండలం అవిడిరేవు సమీపంలో కొబ్బరిరైతు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ ఆడిటర్ ఉద్దరాజు ప్రసాదరాజు సాగుచేస్తున్న తోటలో ఓ అరటిచెట్టును తెగులు కారణంగా నరికేశారు. అయితే ఆ చెట్టు మొదలు నుంచే గెల వచ్చి, ఎదుగుతూ..‘నన్ను నేలకూల్చినా.. చైతన్యబావుటానై నింగికెగుస్తా’ అన్న ఓ విప్లవకారుడి మాటలను గుర్తుకు తెస్తోంది. అదే తోటలో ఆ చెట్టు పక్కనే నరికిన మరో చెట్టు మొదలు నుంచి కొత్త పిలక వచ్చి, అనతి కాలంలోనే గెల వేయడం మరో విశేషం. ఆ సమీపంలో ఉన్న ప్రసాదరాజుకే చెందిన మరో తోటలో ఒకే విత్తనం కొబ్బరికాయ నుంచి ఏకంగా మూడు మొక్కలు రావడం ఇంకో తమాషా. ఆ మూడు మొక్కలూ ప్రస్తుతానికి ఏపుగా పెరుగుతున్నాయని, కాపు ఎలా ఉంటుందో చూడాలని ప్రసాదరాజు ‘సాక్షి’తో అన్నారు. -
‘త్రి’గుణీకృతం.. ఈ టెంకాయ అంకురసిరి
లూటుకుర్రు (మామిడికుదురు) : ‘నాకులాగే ‘ముక్కంటి’ అయిన శివుడి కన్న నేనే ఒక్కిం త ఎక్కువ తెలు సా. ఆ బూడిదరాయుడికి బిడ్డలు ఇద్దరే అయి తే.. నాకు మాత్రం ముగ్గురు సంతానం’ అన్నట్టు.. ఓ టెం కా య మూడు మొలకలకు జన్మని చ్చింది. సాధారణం గా ఓ కొ బ్బరి కాయ నుంచి ఒకే మొలక వస్తుంది. లూటుకుర్రు శివారు బాడిలంకలో మామిడికుదురు ఎంపీపీ మద్దాల సావిత్రీదేవి ఇంటి పెరట్లోని ఓ కాయకు మూడు మొలకలు వచ్చాయి. దీనిపై పి.గన్నవరం ఏడీఏ జె.ఎలియాజర్ను ‘సాక్షి’ వివరణ కోరగా కొబ్బరి కాయలో ఒక బీజం ఉంటే ఒక మొలక వస్తుందని, ఈ కాయలో మూడు బీజాలు ఉండడం వల్ల మూడు మొలకలు వచ్చి ఉంటాయని చెప్పారు. అరుదుగా మాత్రమే ఇలా జరుగుతుందన్నారు.