breaking news
cm new party
-
సీఎం రాజీనామా చేయరు... పార్టీ పెట్టరు
ముఖ్యమంత్రి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయరని రాష్ట్ర మంత్రి కొండ్రు మురళి స్పష్టం చేశారు. శనివారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఆయన కొత్త పార్టీ స్థాపిస్తారంటూ వస్తున్న వార్తలు ఊహగానాలే అంటు కొట్టి పారేశారు. కాంగ్రెస్ పార్టీకి నిజమైన కార్యకర్త కిరణ్ కుమార్ రెడ్డి ఆయన స్పష్టం చేశారు. అలాంటి ఆయన పార్టీ వీడతారనేది ఊహగానమే అని చెప్పారు. రాష్ట్రంలో కొత్త పార్టీ రావడం కల అని రాష్ట్ర మంత్రి కొండ్రు మురళి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే సీఎం కిరణ్ తన పదవితోపాటు కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తారని ఊహగానాలు గత కొంత కాలంగా ఊపందుకున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విభజన బిల్లు అసంపూర్తిగా ఉందని తిప్పి రాష్ట్రపతికి పంపింది. బిల్లును పార్లమెంట్లో ఎలాగైనా నెగ్గిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్రం తన పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఓ వేళ అదే జరిగితే ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేస్తారా అనే విలేకర్ల ప్రశ్నకు కొండ్రు మురళీపై విధంగా స్పందించారు. -
'29 తర్వాత కొత్త పార్టీపై మాట్లాడదామన్న సీఎం'
సీఎం కొత్త పార్టీ పెడితే అందులో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. కిరణ్ పార్టీ పెట్టని నేపథ్యంలో మరో పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 29 తర్వాత కొత్త పార్టీ ఏర్పాటుపై మాట్లాడదామని తనతో సీఎం వెల్లడించిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ దూసుకువెళ్తుంది. ఈ నేపథ్యంలో సీమాంధ్రలో ఆ పార్టీకి డిపాజిట్లు గల్లంతవుతాయని కాంగ్రెస్ నాయకులలో జోరుగా ప్రచారం సాగుతుంది. దాంతో సీఎం కొత్త పార్టీ పెట్టి ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేస్తారని పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే.