సీఎం రాజీనామా చేయరు... పార్టీ పెట్టరు | 'CM will not launch new party', says Kondru Murali | Sakshi
Sakshi News home page

సీఎం రాజీనామా చేయరు... పార్టీ పెట్టరు

Feb 15 2014 11:33 AM | Updated on Jul 29 2019 5:31 PM

సీఎం రాజీనామా చేయరు... పార్టీ పెట్టరు - Sakshi

సీఎం రాజీనామా చేయరు... పార్టీ పెట్టరు

ముఖ్యమంత్రి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయరని రాష్ట్ర మంత్రి కొండ్రు మురళి స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయరని రాష్ట్ర మంత్రి కొండ్రు మురళి స్పష్టం చేశారు. శనివారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఆయన కొత్త పార్టీ స్థాపిస్తారంటూ వస్తున్న వార్తలు ఊహగానాలే అంటు కొట్టి పారేశారు. కాంగ్రెస్ పార్టీకి నిజమైన కార్యకర్త కిరణ్ కుమార్ రెడ్డి ఆయన స్పష్టం చేశారు. అలాంటి ఆయన పార్టీ వీడతారనేది ఊహగానమే అని చెప్పారు. రాష్ట్రంలో కొత్త పార్టీ రావడం కల అని రాష్ట్ర మంత్రి కొండ్రు మురళి వెల్లడించారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే సీఎం కిరణ్ తన పదవితోపాటు కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తారని ఊహగానాలు గత కొంత కాలంగా ఊపందుకున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విభజన బిల్లు అసంపూర్తిగా ఉందని తిప్పి రాష్ట్రపతికి పంపింది. బిల్లును పార్లమెంట్లో ఎలాగైనా నెగ్గిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్రం తన పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఓ వేళ అదే జరిగితే ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేస్తారా అనే విలేకర్ల ప్రశ్నకు కొండ్రు మురళీపై విధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement